అన్వేషించండి

Chocolate: చాక్లెట్ అతిగా తింటున్నారా? ఈ సైడ్ ఎఫెక్టులు రాక తప్పవు

చాక్లెట్లు అంటే ఇష్టపడేవారు ఎంతోమంది.

తీయని చాక్లెట్లు అంటే ఎంతో మందికి ఇష్టం. అందులోని రకరకాల ఫ్లేవర్లు మార్కెట్లో లభిస్తున్నాయి. డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్... ఇలా రకరకాల చాక్లెట్లు లభిస్తున్నాయి. అయితే చాక్లెట్లు మితంగా తినడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. కానీ అతిగా తింటే మాత్రం చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దలకన్నా పిల్లలు రోజూ చాక్లెట్లు తింటూనే ఉంటారు. ఈ చాక్లెట్లను అతిగా తింటే వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

చాక్లెట్లు అతిగా తినే వారిలో పొట్ట ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు కలిగే అవకాశం ఎక్కువ. అంతేకాదు చాక్లెట్లలో చక్కెర, కొవ్వు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా పొట్టనొప్పికి కారణం అవుతాయి. దీనిలోని అధిక చక్కెర కంటెంట్ పేగులో హానికరమైన బ్యాక్టీరియా పెరగడానికి దారితీస్తుంది. అలాగే చాక్లెట్లలో ఉండే చక్కెర రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెరిగేలా చేస్తుంది. దీనివల్ల చాక్లెట్లు అధికంగా తినేవారు తీవ్ర అలసటకు, చికాకుకు లోనవుతారు. అలాగే మానసికంగా కూడా వారిలో ఎన్నో మార్పులు వస్తాయి. బరువు కూడా త్వరగా పెరుగుతారు. అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా పెరుగుతుంది.

మితంగా తీసుకుంటే శరీరానికి చురుకుదనాన్ని అందిస్తుంది. అదే అమితంగా తీసుకుంటే అలసటను పెంచుతుంది. మానసిక స్థితిని కూడా మార్చేస్తుంది. కెఫిన్ చాక్లెట్లలో ఉంటుంది. అధికంగా చాక్లెట్లు తింటే అధిక కెఫీన్ శరీరంలో చేరి మానసిక ఆందోళనకు,  గుండె దడకు కారణం అవుతుంది. నిద్ర కూడా సరిగా పట్టదు. చాక్లెట్లో ఉండే క్యాలరీలు కూడా ఎక్కువే. కాబట్టి రోజూ చాక్లెట్ తినేవారు త్వరగా బరువు పెరుగుతారు. చాక్లెట్లకు బదులు పండ్లు, కూరగాయలు వంటివి తినడం అలవాటు చేసుకోవాలి. ఇవి ఎంత తిన్నా కూడా త్వరగా బరువు పెరగరు. చాక్లెట్లలో నట్స్, పాలు, సోయా వంటివి వాడుతున్నారు. వీటివల్ల కొంతమందికి అలెర్జీ రావచ్చు.ఆ అలెర్జీ ఉన్నవారు తెలియక చాక్లెట్లు తింటే వారి శరీరంపై దద్దుర్లు, దురదలు, శ్వాస ఆడక పోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. 

రోజుకి చిన్న చాక్లెట్ ముక్క తినడం వల్ల అంతా మంచే జరుగుతుంది. కానీ పూర్తి చాక్లెట్‌ను రోజూ తింటూ ఉంటే కొన్నాళ్లకు మీలో జీర్ణ సమస్యలు, మానసిక సమస్యలు వంటివి మొదలవుతాయి. బరువు కూడా త్వరగా పెరిగిపోతారు. కాబట్టి చాక్లెట్‌ను మితంగా తినడమే అలవాటు చేసుకోండి. రోజుకు చిన్న ముక్క డార్క్ చాక్లెట్ తింటే చాలు. ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. 

Also read: ఈ ఉద్యోగాలు చేసే మహిళలు అండాశయ క్యాన్సర్ బారిన త్వరగా పడతారు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Hair Oils for Men : మగవారికి జుట్టుకు ఏ ఆయిల్ మంచిది? హెయిర్ ఫాల్, పలుచబడిన జుట్టుకు ఇవి ట్రై చేయండి
మగవారికి జుట్టుకు ఏ ఆయిల్ మంచిది? హెయిర్ ఫాల్, పలుచబడిన జుట్టుకు ఇవి ట్రై చేయండి
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
Rice Flour For Skin : రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
Soaked Figs Benefits : ఉదయాన్నే 2 నానబెట్టిన అంజీర్ తింటే.. మలబద్ధకం నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో లాభాలు
ఉదయాన్నే 2 నానబెట్టిన అంజీర్ తింటే.. మలబద్ధకం నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో లాభాలు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
Embed widget