Garlic: కాల్చిన వెల్లుల్లిని అప్పుడప్పుడు తింటే క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు
ప్రస్తుతం భయంకరమైన రోగాలు ఎక్కువ మంది ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి.
ఆధునిక కాలంలో ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రతి పది మందిలో ఒకరు అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి రోగాలు ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్నాయి. అలాంటి భయంకరమైన రోగాలు రాకుండా ఆరోగ్యంగా జీవించాలంటే కొన్ని రకాల ఆహారాలు ప్రత్యేకంగా తీసుకోవాలి. అలాంటి ఆహారాలలో ఒకటి కాల్చిన వెల్లుల్లి. వెల్లుల్లిని వంటల్లో వాడుతారు. అయితే వెల్లుల్లిని కాల్చి.. పైన పొట్టు తీసి లోపలి గుజ్జును తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధులను అడ్డుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.
మగవారు కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల వారిలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఇది కాపాడుతుంది. దీనివల్ల గుండెపోటు, అధిక రక్తపోటు వంటివి రాకుండా ఉంటాయి. కాల్చిన వెల్లుల్లి తరచూ తీసుకోవడం వల్ల చుండ్రు, తెల్ల వెంట్రుకలు కూడా రావు. అధిక బరువుతో బాధపడేవారు కాల్చిన వెల్లుల్లి తింటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. కొలెస్ట్రాల్ లేకపోతే గుండె సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా కాల్చిన వెల్లుల్లి ఉపయోగపడుతుంది. నిప్పులపై కాల్చిన వెల్లుల్లిని తినడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లు చేరకుండా ఉంటాయి. తరచూ అలసట, నీరసంతో బాధపడేవారు కాల్చిన వెల్లుల్లి తినడం అలవాటు చేసుకోవాలి.
మగవారు కాల్చిన వెల్లుల్లి తినడం అలవాటు చేసుకుంటే వారిలో వీర్య నాణ్యత పెరుగుతుంది. లైంగిక సంబంధిత సమస్యలు ఏవీ రావు. లైంగిక జీవితం ఆనందంగా ఉంటుంది. కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా ప్రొస్టేట్, రొమ్ము క్యాన్సర్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. పంటి నొప్పితో బాధపడేవారు ఈ కాల్చిన వెల్లుల్లి పేస్టులా చేసి దంతాల మీద పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు అధికంగా ఉంటాయి. కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. వికారం, పొట్ట నొప్పి, గుండెల్లో మంట వంటివి కూడా తగ్గుతాయి.
వెల్లుల్లి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లిని తరచూ తినడం అలవాటు చేసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. రక్త ప్రసరణ సవ్యంగా సాగుతుంది. వెల్లుల్లిలో మన శరీరానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ బి6, క్రోమోజోమ్ లోపాలను వెల్లుల్లి అడ్డుకుంటుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది లైంగిక జీవితానికి అత్యవసరమైనది. గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి చాలా అవసరం. శరీరంలో చేరే చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి వెల్లుల్లి మేలు చేస్తుంది.
Also read: బ్రౌన్ బ్రెడ్ తినడం మంచిదేనా? ఇది తింటే సైడ్ ఎఫెక్టులు ఏమైనా ఉన్నాయా?
Also read: నేతితో పనీర్ జిలేబి, ఇంట్లోనే టేస్టీగా ఇలా చేసేయండి, చాలా సులువు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.