ఖాళీ కడుపున బ్రెడ్ తింటున్నారా? అయితే ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్టే!
చాలా మంది బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ తీసుకుంటారు. బిజీ టైం లో గంటల తరబడి టిఫిన్ ఎక్కడ చేస్తాములే అని కొంతమంది సింపుల్ గా బ్రెడ్ రోస్ట్ చేసుకుని దాని మీద బటర్ పూసుకుని తినేస్తారు.
చాలా మంది బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ తీసుకుంటారు. బిజీ టైం లో గంటల తరబడి టిఫిన్ ఎక్కడ చేస్తాములే అని కొంతమంది సింపుల్ గా బ్రెడ్ రోస్ట్ చేసుకుని దాని మీద బటర్ పూసుకుని తినేస్తారు. మరి కొంతమంది బ్రెడ్ మీద జామ్ రాసుకుని లాగించేస్తారు. ఇవి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని ఎంచుకుంటారు. మీరు కూడా అలాగే చేస్తున్నారా అయితే ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఎందుకంటే పరగడుపున ఎక్కువగా బ్రెడ్ తీసుకోవడం వల్ల అనేక నారోగ్య సమస్యలు వస్తాయండోయ్. అవును మీరు విన్నది నిజమే. శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు ఇందులో అధిక కార్బో హైడ్రేట్స్ ఉన్నాయి. మరి అటువంటిది తింటే ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తాయని ఆలోచిస్తున్నారా? అయితే మీరు దీని గురించి తెలుసుకోవాల్సిందే.
బ్రెడ్ లో కేలరీలు ఎక్కువ, పోషకాలు తక్కువ అని మీకు తెలుసా? పరగడుపున బ్రెడ్ తినడం అసలు మంచిది కాదని ఆహార నిపుణులు అంటున్నారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకూడదని తెలుపుతున్నారు.
పరగడుపున బ్రెడ్ తినడం మంచిదా? చెడ్డదా?
ఆకలిని పెంచుతుంది: అసలు మీరు ముందు ఎటువంటి బ్రెడ్ తింటున్నారనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వైట్ బ్రెడ్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇది గ్లైసిమిక్ ఇండెక్స్ (GI) ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాల జాబితాలో ఉంది. మనం తినే తిండిలోని గ్లూకోజు ఎంత వేగంగా మన రక్తంలో కలుసుందనే విషయాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ తో (జీఐ) కొలుస్తారు. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఆకలిని పెంచుతాయి. అందువల్ల ఎక్కువగా తినేస్తారు. ఫలితంగా బరువు పెరగడం, ఊబకాయం రావడం వంటి సమస్యలు ఏర్పడతాయి.
రక్తంలో చక్కెర స్థాయిలని పెంచుతుంది: ఖాళీ కడుపున బ్రెడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీని ద్వారా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఎందుకంటే బ్రెడ్ అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారం, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
మలబద్ధకాన్ని పెంచుతాయి: బ్రెడ్ లో ఉండే పిండి పదార్థాలు మలబద్ధకాన్ని పెంచుతాయి. అందుకే ఉదయాన్నే నేరుగా బ్రెడ్ తినకుండా ఏదైనా తేలికగా ఉండే ఆహారాన్ని తీసుకుని తర్వాత వీటిని తీసుకోవడం మంచిది.
ఉబ్బరంగా అనిపిస్తుంది: వైట్ బ్రెడ్ లో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. దీని వల్ల పొద్దున్నే తినడం వల్ల పొట్ట ఉబ్బరంగా అనిపించి అసౌకర్యంగా ఫీల్ అవుతారు. వాటికి బదులుగా ఆరోగ్యకరమైన పండ్లు లేదా తేలికగా అనిపించే అల్పాహారాన్ని ఎంచుకోవడం ఉత్తమం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: కన్నీళ్ల సాయంతో క్యాన్సర్‌ను గుర్తించే కాంటాక్ట్ లెన్సులు, శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ
Also read: ఈ ఆహారాలు మీ ఆకలిని సహజంగానే అణిచేస్తాయి, అలా కూడా బరువు తగ్గొచ్చు