అన్వేషించండి

Tiger Nuts: మధుమేహం అదుపులో ఉండాలంటే ఈ నట్స్ తినేయండి

చూసేందుకు శనగలు మాదిరిగా కనిపించే ఈ నట్స్ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయి.

నట్స్ అనగానే బాదం, వాల్ నట్స్, పిస్తా ఇవే త్వరగా అందరికీ గుర్తుకు వస్తాయి. కానీ ఇవి మాత్రమే కాదు బహుళ ప్రయోజనాలు కలిగిన టైగర్ నట్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? చూసేందుకు వీటి పరిమాణం కాస్త శనగలు మాదిరిగా కనిపిస్తుంది. టైగర్ నట్స్ ని చుఫా గింజలు, ఎల్లో నట్స్ ఎడ్జ్, ఎర్త్ ఆల్మండ్ అని కూడ పిలుస్తారు. కాస్త తీపి, వగరు, కొబ్బరి రుచిని కలిగి ఉంటాయి. పూర్వంలో వీటి వినియోగం ఎక్కువగా ఉండేది. ఇప్పుడిప్పుడే ప్రజలు మళ్ళీ కిచెన్ లో టైగర్ నట్స్ ఉండే విధంగా చూసుకుంటున్నారు. దీనితో చేసిన పొడిని పాలలో కలుపుకుని తాగుతారు. ఇవి నమలడానికి కాస్త గట్టిగా ఉంటాయి. కానీఈ వీటిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు.

ఫైబర్ పుష్కలం: టైగర్ నట్స్ లో కరిగని ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణం కాకుండా పేగుల నుంచి వెళ్తుంది. ఇందులోని పీచు పదార్థం మలవిసర్జన సజావుగా సాగేలా చేస్తుంది. గట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్యని నివారిస్తుంది. ఇందులో లైపీస్, అమైలెస్ వంటి ఎంజైమ్ లు ఉన్నాయి. పేగుల్లోని ఆహారాన్ని విచ్చిన్నం చేయడంలో ఇవి సహాయపడతాయి. గ్యాస్, పొట్ట ఉబ్బడం, అజీర్తి, అతిసారం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

డయాబెటిస్ నియంత్రణ: ఈరోజుల్లో అత్యధికులు ఎదుర్కొంటున్న సమస్య మధుమేహం. దీన్ని నియంత్రించగలిగే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడే అమినో యాసిడ్ ఆర్జినైన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలని అదుపులో ఉంచుతాయి.

యాంటీ బ్యాకర్టీయా గుణాలు: ఒక అధ్యయనం ప్రకారం ఇందులో అసిటోన్, ఇథనాల్, క్లోరోఫామ్, పెట్రోలియం ఈథర్ వంటి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్నాయి. ఇకోలి, సాల్మొనెల్లా, సెయింట్ ఆరియస్ కి వ్యతిరేకంగా పని చేస్తాయి.

చెడు కొలెస్ట్రాల్ కరిగిస్తుంది: వీటిలో కరగని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది. ఇది మాత్రమే కాదు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇందులోని ఓలేయిక్ యాసిడ్, విటమిన్ ఇ అధిక మొత్తంలో ఉండటం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచేందుకు దోహదపడుతుంది.

ప్రీబయోటిక్: పొట్ట ఆరోగ్యానికి మేలు చేసే ప్రీబయోటిక్ ఇందులో సమృద్ధిగా లభిస్తుంది. శరీరంలోని చెడు బ్యాకర్టీయాతో పోరాడేందుకు సహాయపడుతుంది. మెరుగైన జీర్ణ వ్యవస్థకు దోహదపడతాయి. గట్ లో మంచి బ్యాక్టీరియా ఏర్పడేందుకు సహాయం చేస్తుంది. జీర్ణ వ్యవస్థ సజావుగా సాగేలా చేస్తుంది.

రిచ్ యాంటీ ఆక్సిడెంట్: ఆక్సీకరణ ఒత్తిడి నుంచి జీర్ణవ్యవస్థని రక్షించుకోవడం కోసం యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇవి టైగర్ నట్స్ లో మెండుగా లభిస్తాయి. అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో మెరుగ్గా పని చేస్తాయి.  

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: నిరంతరం దగ్గు వస్తుందా? విస్మరించొద్దు, ఆ క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget