By: ABP Desam | Updated at : 19 Feb 2023 01:29 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Unsplash
కరివేపాకు వంటలకు మంచి సువానస రుచిని ఇవ్వడమే కాదు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. కానీ తినేటప్పుడు మాత్రం వాటిని పక్కన పెట్టేస్తారు. అలా చేయడం వల్ల వాటి వల్ల పొందాల్సినవన్నీ మీరు మిస్ చేసుకుంటున్నట్టు అవుతుంది. దీని వల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది. బీటా కెరోటిన్, విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన కరివేపాకు రోగనిరోధక శక్తిని బలోపేటమ చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే మధుమేహులు తప్పనిసరిగా కరివేపాకు తింటే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
కరివేపాకుతో డయాబెటిస్ నియంత్రణ ఎలా?
కరివేపాకులో కార్బజోల్ ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ని అరికట్టడంలో సహాయపడతాయి. శరీర కణాలను పోషణ అందిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిసాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరివేపాకులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అవి జీర్ణక్రియను నెమ్మది చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా చేస్తాయి. ఇందులోని ఫైటో కెమికల్స్ ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి.
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం కరివేపాకులో యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు ఉన్నాయి. ఎలుకల మీద జరిపిన పరిశోధనలో కరివేపాకు వల్ల షుగర్ లెవల్స్ తగ్గాయని నిరూపితమైంది. సాధారణ ఎలుకలకు అలాగే డయాబెటిస్ ఉన్న ఎలుకలకు వివిధ మోతాదుల(5, 10, 15 శాతం) ప్రకారం కరివేపాకు ఉన్న ఆహారాన్ని ఐడు వారాల పాటు తినిపించారు. ఇవి తినడం వల్ల హైపోగ్లైసీమిక్‌లో తేడా ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు. సాధరణ ఎలుకల్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో పెద్దగా తగ్గింపు లేదు కానీ తేలికపాటి డయాబెటిస్ ఉన్న ఎలుకల్లో 5,10,15 శాతం ఆహారం తీసుకున్న వాటిలో రక్తంలో చక్కెర గరిష్టంగా 13.1, 16.3, 21.4 శాతం తగ్గింది.
కరివేపాకు ఎలా ఉపయోగించాలి?
కరివేపాకు కాస్త చెడు, ఘాటైన రుచిని కలిగి ఉంటాయి. ఆ వాసన కారణంగానే వాటిని తినడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కానీ వాటిని ఇలా తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.
☀కొన్ని ఆకులను తీసుకుని ఉదయం టీ లేదా కాఫీకి ముందు వాటిని నమలాలి.
☀చేదుని పోగొట్టుకునేందుకు ఆకులని బ్లెండర్ లో వేసి కొద్దిగా నీరు, ఉప్పు కలిపి జ్యూస్ చేసుకుని తీసుకోవచ్చు.
కరివేపాకు రసం ఎలా చేయాలి?
ఒక కంటైనర్ లో కొంచెం నీరు తీసుకుని దాంట్లో తాజా కరివేపాకు చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి 5- నిమిషాలు ఉడకనివ్వాలి. చల్లారిన తర్వాత వడకట్టుకుని కొద్దిగా నిమ్మరసం, టీ స్పూన్ తేనె కలుపుకుని తాగాలి. ఈ రసాన్ని ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడే తాగాలి.
☀కరివేపాకు పొడి చేసి పెట్టుకుని కూరల్లో వేసుకోవచ్చు. ఇవి కూరలకు మరింత అదనపు రుచి ఇస్తుంది. అలాగే కరివేపాకులను వేడి నీటిలో 3-4 నిమిషాలు పాటు బాగా మరిగించి టీ కూడా తయారుచేసుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మీ పాదాలకు కోల్డ్ ఫీట్ సమస్య ఉందా? అందుకు కారణం ఏంటో తెలుసా?
Coffee: కొవ్వుని కరిగించే కాఫీలు- ఓసారి ట్రై చేసి చూడండి
Peanut Butter: పీనట్ బటర్, రోజుకో స్పూను తింటే ఎంతో ఆరోగ్యం
Vegan Chicken: వేగన్ చికెన్ - ఈ శాఖాహార చికెన్‌ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు
సోయాతో చేసిన మీల్ మేకర్‌ను మగవారు తినకూడదని అంటారు, ఇది ఎంతవరకు నిజం?
Sleeping: రోజులో 9 గంటలకు మించి నిద్రపోతున్నారా? అతి నిద్ర వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు ఇవే
Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి
PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్ 30 వరకు ఛాన్స్
Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!
Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?