Cold Feet: మీ పాదాలకు కోల్డ్ ఫీట్ సమస్య ఉందా? అందుకు కారణం ఏంటో తెలుసా?
పాదాలు చల్లగా ఉండి ఇబ్బంది పెడుతుంటే ఇలా చేసి చూడండి. ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
పాదాలు చాలా మందికి సాధారణంగా నులివెచ్చలుగా ఉంటాయి. కానీ మరికొంత మంది పాదాలు మాత్రం మంచు ముక్కల్లాగ చల్లగా ఉంటాయి. సాక్స్, షూస్ వేసుకున్నా కూడా పాదాలు చల్లగా, తడిగా ఉంటాయి. నడుస్తుంటే తడి పాదాల అచ్చుముద్రలు పడిపోతాయి. ఇక చల్లటి వాతావరణంలో ఉంటే ఐస్ ముక్కలు మీద నడుస్తున్నట్టు ఉంటుంది. చల్లని పాదాలు రక్తప్రసరణ సరిగా జరగకపోవడానికి సంకేతంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శరీరంలోని అంతర్లీన సమస్యకు మరొక కారణం కూడా కావచ్చని చెప్తున్నారు.
పాదాలు చల్లగా మారడానికి కారణాలు
⦿ఆటో ఇమ్యూన్ పరిస్థితులు
⦿పెరిఫెరల్ న్యూరోపతి అనేది మధుమేహం వల్ల వచ్చే సమస్య. ఇది పాదాల్లోని నరాలను దెబ్బతీసి వాటిని చల్లబరుస్తుంది
⦿రక్తహీనత
⦿రక్తప్రసరణ సమస్యలు
⦿గుండె జబ్బులు
⦿ధమనుల్లో బ్లాకేజ్
⦿పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ వల్ల కాళ్ళు, పాదాలకు రక్తప్రవాహం మందగించేలా చేస్తుంది. ఇది అధిక ధూమపానం అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, వయస్సు సంబంధిత సమస్యల వల్ల కూడా సంభవించవచ్చు.
⦿రేనాడ్ ఫినామినన్ వ్యాధి వల్ల కాలి వేళ్ళలో ఉన్న రక్తనాళాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. వీటి వల్ల రక్తప్రవాహం పరిమితం చేస్తుంది. చర్మం రంగులోని మార్పులు వస్తాయి. పాదాలు మీద సూదులతో గుచ్చుతున్నట్టుగా అనిపిస్తుంది.
⦿హైపోథైరాయిడిజం వంటి హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా పాదాలు చల్లగా అనిపిస్తాయి.
⦿నాడీ వ్యవస్థలో ఇబ్బందులు
పాదాలు చల్లగా మారుతున్నాయ్ అనేందుకు సంకేతాలు
☀పాదాలు శరీరంలోని మిగిలిన భాగాల కంటే తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంటాయి.
☀పాదాలు, కాలి వేళ్ళలో తేలికపాటి నొప్పి
☀పాదాలు వేడెక్కడానికి ఎక్కువ సమయం తీసుకోవడం
☀చేతులు, కాళ్ళలో బలహీనత, నొప్పి, తిమ్మిరి
☀పాదాలు లేత ఎరుపు లేదా నీలం రంగులోకి మారతాయి
☀రాత్రివేళ పాదాలు మరింత చలిగా అనిపిస్తాయి.
పాదాలు ఐస్ ముక్కల్లాగా అనిపించడానికి కారణాలు
రక్తప్రసరణ సరిగా లేకపోవడం: కాళ్ళు, పాదాల్లో రక్తప్రసరణ సరిగా జరగకపోతే చల్లగా అవుతాయని వైద్యులు చెబుతున్నారు. అంటే రక్తం పాదాలకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థలోని నాళాల ద్వారా రక్తం ప్రయాణిస్తుంది. కొన్ని సార్లు అవి మూసుకుపోవడం, గట్టి పడటం జరుగుతుంది. అప్పుడు రక్తం ప్రవహించడం కష్టమవుతుంది.
ఔషధ దుష్ప్రభావాలు
క్రమం తప్పకుండా తీసుకునే మందుల వల్ల కూడా ఒక్కోసారి రక్త ప్రసరణకి ఆటంకం కలుగుతుంది. పాదాలు చల్లబడటానికి కారణమయ్యే మందులు..
* బీటా బ్లాకర్స్ అధిక రక్తపోటు అదుపులో ఉంచుకునేందుకు తీసుకుంటారు.
* ఎర్గోటమైన్ తలనొప్పి, మైగ్రేన్ కోసం తీసుకుంటారు
* జలుబు, దగ్గు కోసం వాడే సూడోపెడ్రిన్ వల్ల కూడా పాదాలు చల్లగా మారిపోతాయి.
ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా?
చల్లని పాదాల సమస్య నుంచి బయటపడేందుకు ముందుగా రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఒకవేళ మందుల వల్ల పాదాలు చల్లగా అవుతుంటే వైద్యులను సంప్రదించి ఇతర మందులు తీసుకోవడం గురించి చర్చించాలి. ఇవే కాకుండా ఈ పనులు చేయొచ్చు..
⦿వెచ్చదనం ఉండేలా సాక్స్ ధరించడం
⦿ప్రతిరోజు కనీసం 30-45 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
⦿కంప్రెషన్ సాక్స్ ధరించాలి
⦿సమతుల్య ఆరహం తీసుకోవాలి
⦿రక్తప్రసరణ మెరుగు పరిచే విధంగా కాళ్ళని కదిలించాలి
⦿నీరు తాగాలి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: రోజుకొక గుడ్డు తింటే గుండెకి మంచిదేనంటున్న పోషకాహార నిపుణులు