అన్వేషించండి

Lakshadweep Trip : లక్షద్వీప్​ వెళ్తున్నారా? అయితే ఇవి తప్పకుండా ఎక్స్​పీరియన్స్ చేయండి

Lakshadweep Tour : అత్యంత సున్నితమైన ద్వీప సమూహాలలో లక్షద్వీప్ ఒకటి. చలికాలంలో మీరు ట్రిప్​ వేసేందుకు అనువైన ప్రదేశం ఇది. మీరు అక్కడి వెళ్తే కొన్ని రైడ్స్​ని కచ్చితంగా ప్రయత్నించవచ్చు.

Dive into Lakshadweep : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో లక్షద్వీప్ పేరు మార్మోమ్రోగిపోతుంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా బాయ్​కట్ మాల్దీవులు అంటూనే లవ్ ఫర్ లక్షద్వీప్ అంటూ మద్ధతిస్తున్నారు సెలబ్రెటీలు, నెటిజన్లు. మాల్దీవులకు టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని లక్షద్వీప్​లకు చెక్కేస్తున్నారు. అక్కడి నుంచి వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెట్టేస్తే చలికాలంలో మీరు ట్రిప్​కి వెళ్లగలిగే ప్రాంతాలలో లక్షద్వీప్ కచ్చితంగా ఉంటుంది.

లక్షద్వీప్​లో సహజమైన తెల్లని ఇసుక, స్పష్టమైన జలాలు, శక్తివంతమైన పగడపు దిబ్బలు మీ మనసును ఆకర్షిస్తాయి. ఇక్కడి జంతుజాలం కూడా మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చలికాలంలో హాయిగా సేదతీరాలని కోరుకునేవారికి ఉష్ణమండల స్వర్గధామం లక్షద్వీప్ అని చెప్పవచ్చు. వెచ్చని వాతావరణాన్ని ఆస్వాదించడానికి, అద్భుతమైన ట్రిప్​ మీ సొంతం కావాలనుకుంటే ఈ ద్వీపానికి వెళ్లొచ్చు. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత మీరు తప్పకుండా చేయాల్సిన కొన్ని పనుల జాబితా ఇక్కడ ఉంది. ఈ లిస్ట్​ మీకు లక్షద్వీప్​లో మంచి అనుభూతిని ఇస్తుంది. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే..

స్నార్కెలింగ్..

లక్షద్వీప్ వెళ్లినప్పుడు మీరు స్నార్కెలింగ్ కచ్చితంగా చేయాలి. దీనిలో భాగంగా మీరు నీటి అడుగున ఉన్న ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఈ ఎక్స్​పీరియన్స్ మిమ్మల్ని కచ్చితంగా మంత్ర ముగ్ధులను చేస్తుంది. ద్వీపాల చుట్టూ ఉన్న పగడపు తోటలు, సముద్ర జీవులు మీ మనసును కట్టిపడేస్తాయి. పగడాలు, చేపలు, ఇతర జలచరాల అందాలను మీరు దగ్గరగా చూడొచ్చు. ఈ తీరప్రాంతంలో మీరు రంగురంగుల దిబ్బలు, ప్రత్యేకమైన సముద్ర జీవులు చూడాలంటే.. అగట్టి వెళ్లాలి. అగట్టి లక్షద్వీప్​ స్నార్కెలింగ్​ చేయడానికి అనువైన ప్రదేశం. 

స్కూబా డైవింగ్

మీరు ఈ ట్రిప్​లో మరింత ఇన్వాల్వ్ కావాలనుకుంటే అక్కడ మీరు స్కూబా డైవింగ్ చేయాలి. మీ డైవింగ్ అనుభవ స్థాయిని బట్టి.. డైవ్ ట్రిప్ చేయొచ్చు. షిప్ బ్రేక్​లు, ఓవర్​హాంగ్​లు, డ్రిఫ్ట్ డైవింగ్​లు చేయవచ్చు. ఇవి ప్రయాణాన్ని నెక్స్ట్ లెవెల్​కు తీసుకెళ్తాయి. కవరత్తి ద్వీపం స్కూబా డైవింగ్​కు అనువైన ప్రదేశం. ఈ ద్వీపంలో ప్రత్యేకమైన చేపలు, దిబ్బలు, తాబేళ్లు ఉంటాయి. 

యాచ్ రైడ్స్

సముద్రంలో గాలి మిమ్మల్ని సున్నితమైన స్పర్శతో తాకుతూ.. ఆకాశనీలం ఉన్న జలాలాపై గ్లైడ్ చేసేందుకు లక్షద్వీప్​ అనువైనది. ఇది మీకు విలాసవంతమైన, విశాలమైన యాచ్​ రైడ్​ను ఇస్తుంది. అక్కడ క్రూయిజ్ ప్రయాణం.. మీకు విశ్రాంతి, ఉత్సాహం రెండింటినీ ఇస్తుంది. మీకు మరపురాని జ్ఞాపకాలను అందిస్తుంది. 

అక్వేరియం 

మీరు లక్షద్వీప్ వెళ్తే కచ్చితంగా అక్వేరియంలు కచ్చితంగా సందర్శించండి. లక్షద్వీప్​ల అనేక మ్యూజియంలు, అక్వేరియంలు ఉన్నాయి. అక్కడ మీరు సముద్ర జీవులు, వాటి సంబంధిత కళాఖండాలు చూడొచ్చు. రాజధాని ద్వీపమైన కవరత్తిలో మీరు సాంస్కృతిక కార్యకలాపాలు చూడొచ్చు. ట్రెడీషనల్ దుస్తులు షాపింగ్ చేయొచ్చు. కవరెట్టి అక్వేరియంలో సముద్ర జీవల శ్రేణి మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇక్కడ మీరు ప్రత్యేకమైన నిర్మాణాలు, జీవనశైలిని చూడొచ్చు. 

చేపలు పట్టొచ్చు.. 

లక్షద్వీప్​లో మినీకాయ్ ద్వీపం గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. అక్కడ బీచ్ రిసార్ట్​లు, రంగురంగుల పగడపు దిబ్బలు, పచ్చని వృక్ష సంపందతో నిండి ఉంటుంది. అద్భుతమైన తెల్లని ఇసుక బీచ్​లు ఆకట్టుకుంటాయి. 300 అడుగుల ఎత్తైన లైట్​హౌస్, ఫిషింగ్, జుమా మసీదు ఇక్కడి గొప్ప సాంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తాయి. అలాంటి మినీకాయ్​లో మీరు చేపలు పట్టొచ్చు. అక్కడి ఫిషింగ్ హెరిటేజ్ పర్యాటకులకు సాంప్రదాయ పద్ధతిలో ఫిషింగ్ చేసేందుకు అవకాశాన్ని కలిగిస్తుంది. 

Also Read : మహిళలు బరువును తగ్గించే మాత్రలు వేసుకోవచ్చా? బరువు తగ్గేందుకు ఎలాంటి మాత్రలు ఎంచుకోవాలి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget