(Source: ECI/ABP News/ABP Majha)
Weight Loss Pills : మహిళలు బరువును తగ్గించే మాత్రలు వేసుకోవచ్చా? బరువు తగ్గేందుకు ఎలాంటి మాత్రలు ఎంచుకోవాలి?
Weight Loss Supplements : మహిళలు బరువు తగ్గేందుకు మాత్రలు వాడొచ్చా? వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఒకవేళ వాడితే ఎలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి?
Best Weight Loss Pills : బరువు అనేది ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే సమస్య. ముఖ్యంగా మహిళలను వేధించే ఆరోగ్య సమస్యల్లో బరువు కచ్చితంగా ఉంటుంది. రోజు తమ పనుల్లో బిజీగా ఉన్నా సరే.. కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా మహిళలు బరువు పెరుగుతూ ఉంటారు. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మహిళలు ఎక్కువగా బరువు పెరుగుతారు. వ్యాయామాలు చేసే లేదా ఇతరత్రా డైట్లు ఫాలో అయ్యే టైమ్ కానీ.. శక్తి కానీ ఉండదు. అలాంటి సమయంలో కొందరు బరువు తగ్గేందుకు మాత్రలు వేసుకుంటారు. ఇది అసలు మంచి ఆలోచనేనా? బరువు తగ్గేందుకు అసలు మాత్రలు వేసుకోవచ్చా? ఒకవేళ మాత్రలు ఉపయోగిస్తే ఎలాంటి వేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు?
ఈ మందులు వాడితో చిటికెలో బరువు తగ్గిపోతారు.. నాజుకైన నడుము మీ సొంతమవుతుందని ఎన్నో టీవీ, వాణిజ్య ప్రకటనలు ఆకర్షిస్తూ ఉంటాయి. ఎలాంటి వ్యాయామం అవసరం లేదు.. ఫుడ్ విషయంలో మార్పులే చేయనవసరం లేదు కేవలం ఈ మెడిసిన్ ఉపయోగిస్తే బరువు ఇట్టే తగ్గిపోతారంటూ చెప్పే ప్రకటనలు నిజమేనేమో అనేలా చేస్తాయి. కానీ ఇలాంటి మాత్రలు ఉపయోగించకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు ఇలాంటి మాత్రలు పనిచేయవు. పనిచేసినా.. ఆరోగ్య సమస్యలు ఇస్తాయి. బరువు తగ్గేందుకు ఉపయోగించే మాత్రల్లో కెఫిన్ ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు హైపర్ యాక్టివ్ అయిపోవడం, నిద్రలేమి, జీర్ణ సమస్యలు వంటివాటికి గురవుతారు.
బరువు తగ్గించే సప్లిమెంట్స్
ముందు మార్కెట్లలో చూపించే సప్లిమెంట్స్‌ను పూర్తిగా మీ మైండ్‌లో నుంచి తీసేయండి. ఒకవేళ మీరు కచ్చితంగా బరువు తగ్గేందుకు మాత్రలు వేసుకోవాలనుకుంటే మీరు వ్యాయామం, జీవనశైలితో కూడిన మార్పులు, ఆహారంలో మార్పులు కూడినదై ఉండేవి ఎంచుకోవాలి. అలాంటివే మీకు ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. పక్కదారి పట్టించే టాబ్లెట్స్‌కు బదులు మీరు డైట్ నిపుణులు, వైద్యుల సలహాలతో కొన్ని టాబ్లెట్స్ ఉపయోగించవచ్చు. ఇవి మీ ఫుడ్ క్రేవింగ్స్‌ను కంట్రోల్ చేసి.. జీవక్రియన పెంచి, శరీరంలో కొవ్వుల శోషణను తగ్గిస్తాయి. కచ్చితంగా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతనే మీరు ఇలాంటి టాబ్లెట్స్ ఉపయోగించాలి. ఎందుకంటే ఒక్కొక్కరి శరీర తీరును బట్టి ఒక్కో రకమైన మాత్రలు పనిచేస్తాయి. వాటిలో ఎలాంటి టాబ్లెట్స్ ఎంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
కొవ్వును తక్కువగా శోషించేవి
బరువును తగ్గించే పిల్స్‌లో కొవ్వును తక్కువగా గ్రహించే పిల్స్ ఉంటాయి. తీసుకునే ఆహారం నుంచి కొవ్వును తక్కువ గ్రహించి.. జీవక్రియను పెంచి హెల్తీగా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. అయితే కచ్చితంగా వీటిని వైద్యులు సిఫారసు చేస్తేనే మీరు ఉపయోగించాలి. మెడికల్ షాప్‌లలో కూడా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే వీటిని మీకు అందిస్తారు. ఎందుకంటే ఇలాంటి మెడిసన్స్ వల్ల మీరు జీర్ణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ మీకు వైద్యుడు మీకు వీటికి సంబంధించిన టాబ్లెట్స్ సూచిస్తే వీటితో పాటు రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన విటమిన్లు కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది.
నీటిబరువు తగ్గించేవి..
బరువు తగ్గాలి అనుకుంటే మీరు దీనిని దృష్టిలో పెట్టుకోవాలి. కొందరి శరీరం కొవ్వుతో కాకుండా.. నీటి బరువు వల్ల లావు కనిపిస్తారు. అలాంటి వారికి ఇవి మంచి ప్రయోజనాలు అందిస్తాయి. డాక్టర్లు మీ శరీర బరువును బట్టి వీటిని రాస్తారు. ఇలాంటి వాటిలో దాదాపు అన్ని సహజమైన పదార్థాలే ఉంటాయి. గ్రీన్ కాఫీ, కెఫిన్, విటిమిన్ బి6, నారింజ వంటి పదార్థాలు కలిగిన మాత్రలు నీటి బరువును తగ్గిస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇవి 5 నెలల్లో 5 నుంచి 15 కిలోల బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయని తేల్చాయి. దీనితో పాటు పోషకాహార సప్లిమెంట్లు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అవి మీరు ఎక్కువ శక్తిని కోల్పోకుండా చేస్తాయి.
ప్లాంట్ బేస్డ్ మాత్రలు
వీటిని స్త్రీ, పురుషులు ఇద్దరు బరువు తగ్గేందుకు ఉపయోగించవచ్చు. ఫైబర్, కెఫిన్ ఉండే ప్లాంట్ బేస్డ్ మాత్రలు బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. మీకు కెఫిన్ ప్రాబ్లమ్ ఉంటే కెఫీన్ లేని మెడిసన్‌ను వైద్యులు మీకు సూచిస్తారు. వీటితో పాటు విటమిన్ సప్లిమెంట్స్ కచ్చితంగా తీసుకోవాలి. బయోటిన్, విటిమిన్ సి, విటమిన్ బి 12, విటిమిన్ డి కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.
FDA ఆమోదం
FDA ఆమోదం పొందిన మాత్రలు బరువు తగ్గడంలో బాగా హెల్ప్ చేస్తాయి. వాటి ఆమోదం లభించిన చాలా మాత్రలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఈ వెయిట్‌లాస్ సప్లింమెంట్లను సహజమైన పదార్థాలతో తయారు చేస్తారు. ఇవి జీవక్రియను పెంచి.. తినాలనే కోరికను కంట్రోల్లో ఉంచి.. ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గేందుకు ఇది హెల్ప్ చేస్తాయి. ఇలాంటివి ఉపయోగించే ముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి ఎందుకంటే ఇవి మీకు అలెర్జీ వంటి సైడ్ ఎఫెక్ట్ ఇవ్వొచ్చు.
ఆరోగ్యంగా బరువు తగ్గడం అనేది మీ దీర్ఘకాలిక ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి మాత్రలు తీసుకునే సమయంలో మీరు భోజనాన్ని అస్సలు స్కిప్ చేయకూడదు. అల్పాహారం మానకూడదు. ఎందుకంటే ఫుడ్ మానేస్తే తినాలనే కోరికలు పెరుగుతాయి. కాబ్టటి మంచి జీవనశైలిని పాటించాలి. మీరు దీనిని ఫాలో అవ్వకపోతే బరువు తగ్గలేరు.
Also Read : ఈ మౌత్ వాష్లను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.