అన్వేషించండి

Diwali 2022: దీపావళికి వంటింట్లో వాడే ఈ వస్తువులు మాత్రం కొనకండి, దురదృష్టం వెంటాడుతుందట

Diwali 2022: దీపావళికి ఎన్నో కొత్త వస్తువులు కొనుగోలు చేస్తుంటారు చాలా మంది. కొనకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి.

Diwali 2022: దీపావళి వచ్చిందంటే తెలుగు లోగిళ్లు దీపాలతో వెలిగిపోతాయి. ఇంటికి లక్ష్మిదేవిని స్వాగతించడానికి ఇళ్లను అలంకరిస్తారు. దీపావళి ముందు వచ్చే ధనత్రయోదశితో దీపావళి వేడుకలు ప్రారంభమవుతాయి. దీపావళికి ఇంటి కోసం ఎన్నో కొత్త వస్తువులు కొంటుంటారు. బంగారం  వెండే కాదు, ఇంట్లోని గిన్నెలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేవాళ్లు కూడా ఎక్కువే. అయితే ఆ రోజున కొనకూడని వస్తువులు కూడా ఉన్నాయి. తెలియక  చాలా మంది వాటిని కొనేస్తుంటారు. ఇలా కొనడం దురదృష్టమని నమ్ముతారు. కొందరికి ఇవి మూఢనమ్మకాలుగా కనిపిస్తాయి కానీ ఈ నమ్మకాలు తరతరాలుగా జాతిలో ఇమిడిపోయాయి. నమ్మేవాళ్లు నమ్ముతారు, ఆచరిస్తారు. ఈ రోజున ఏమీ కొనకూడదో తెలుసుకోండి.  మరొక విషయం ఇవి నమ్మకాలపై ఆధారపడిన విషయం. నమ్మేవాళ్లు నమ్మవచ్చు, నమ్మని వాళ్లు కేవలం దీన్ని ఓ కథనంగా చదవండి. 

కళాయి
చాలా మందికి దీపావళికి కొత్త కళాయిలు, గిన్నెలు కొనే అలవాటు ఉంది. కానీ పూర్వపు నమ్మకాల ప్రకారం కళాయి కొనకూడదు. ఎందుకంటే కొన్నప్పుడు కళాయి ఖాళీగా ఉంటుంది. ఇలా ఖాళీగా ఉన్న గిన్నెలు కొనడం వల్ల ఇల్లు కూడా ఖాళీ అవుతుందని, ఇంట్లో సంపద ఉండదని నమ్మకం. ఒకవేళ తెలియక కొన్నట్లయితే ఆ కొత్త గిన్నెను నీటితో లేదా ఏదైనా ఆహారంతో నింపి ఇంటికి తీసుకెళ్లండి. ఖాళీ గిన్నె మాత్రం తీసుకెళ్లద్దు.

కత్తులు
కిచెన్లో కత్తిపీటలు మాయమై చాకులే వాడుతున్నారు. కత్తిని మనం ఎందుకు ఉపయోగిస్తాం, ఏదైనా వస్తువును ముక్కలు చేసేందుకు. అంతే దాని ఆకారాన్ని నాశనం చేస్తున్నామన్నమాట. అందుకే చాకులను కొని ఇంటికి తీసుకెళ్లకూడదు. ఇవి దురదృష్టాన్ని తెస్తాయని పెద్దలు నమ్ముతారు. 

ఇనుము
ఇనుముతో చేసి వస్తువులను ఇళ్లల్లో అధికంగానే వాడతాము. ఇనుముతో చేసిన వస్తువులు రాగి, ఇత్తడి కన్నా చాలా తక్కువ రేటుకే వస్తాయి. అందుకే వీటినే కొనేందుకు ఇష్టపడతారు. అయితే దీపావళి, ధన్ తేరాస్ పండుగల్లో ఇనుముతో చేసిన వస్తువులు కొనకూడదు. 

గాజు వస్తువులు
జ్యోతిషశాస్త్రపరంగా గాజు వస్తువులు రాహు గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. అందుకే వీటిని ఈ పండుగ సందర్భంగా కొనకూడదు. గాజు పగలితే పదునైనా వస్తువుగా మారుతుంది. ఇవి సులభంగా కూడా పగిలిపోతాయి. కాబట్టి వీటిని పండుగ సందర్భంగా ఇంటికి తీసుకెళ్లకూడదు.  

నూనె, వెన్న
నూనెలు, నెయ్యి, వెన్న వంటివి ప్రత్యేకంగా ఈ పండుగ కోసం కొనడం నివారించాలి. ఎందుకంటే ఆ ఉత్పత్తులు పవిత్రమైన ఉత్పత్తుల జాబితాలోకి రావు. అందుకే ఆ రోజు కొనకూడదు అంటారు. మీకు నూనెలు అవసరం ఉంటే దీపావళి, ధన్‌తేరాస్ పండుగలకు ముందే కొనేసి ఇంట్లో పెట్టుకోవాలి. లేదా ఆ పండుగల తరువాత కొనాలి. ఆ రెండు రోజులు మాత్రం కొనకూడదు. 

Also read: మగవారికీ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా? ఈ లక్షణాలు కనిపిస్తే ఏమిటర్థం?

Also read: బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కొన్ని నెలల ముందే కనిపించే ప్రధాన సంకేతం ఇది, తేలికగా తీసుకోవద్దు

టాప్ హెడ్ లైన్స్

Diabetes and Dengue : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Abhijeet Dipke Typhoid: టైఫాయిడ్ బారిన పడిన అభిజిత్ దీప్కే.. ఈ వ్యాధి లక్షణాలు ఏంటీ? ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది
టైఫాయిడ్ బారిన పడిన అభిజిత్ దీప్కే.. ఈ వ్యాధి లక్షణాలు ఏంటీ? ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య.. అంతలోనే ఏం జరిగింది?
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య.. అంతలోనే ఏం జరిగింది?
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Embed widget