Walking: వాకింగ్ చేసేప్పుడు ఈ తప్పులు అసలు చేయకండి?
Exercise: మనలో చాలా మంది ఉదయం లేవగానే వాకింగ్ చేస్తుంటారు. దీని వలన ఆరోగ్య సమస్యల రాకుండా ఉంటాయి.
Walking: నడక అనేది చాలా సులభమైన వ్యాయామం. ఏ వయస్సు వారైనా.. ఎలాంటి వర్క్‌అవుట్ చేయకపోయినా సులభంగా వాకింగ్ చేయొచ్చు. రోజువారీ నడక వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించగలదని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. నడక కండరాలను బలోపేతం చేయడానికి, బరువును అదుపులో ఉంచడానికి చాలా సహాయపడుతుంది. డైలీ నడక మానసిక ఆరోగ్యానికి మంచిది. అయితే నడిచేటప్పుడు చేసే కొన్ని పొరపాట్ల వల్ల పూర్తి ప్రయోజనం పొందడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.
నడిచే భంగిమ సరిగ్గా లేకపోతే..
చాలామంది సరైన భంగిమతో నడవరు. భుజాలను పక్కకు వచ్చి వంచి నడుస్తారు. అలాగే పాదాలను కూడా తడబడుతూ వేస్తుంటారు. దానివల్ల నడక సామర్థ్యం తగ్గుతుంది. కాలక్రమేణా అసౌకర్యంగా మారుతుంది. ఆ తర్వాత అది వెన్ను సమస్యలకు దారితీస్తుంది. మీరు నడుస్తున్నప్పుడు, మీ భుజాలను కాస్త వెనక్కి వంచండి. మీ దినచర్యలో నడవడానికి కొంత సమయాన్ని కేటాయించండి. అలాగే ఉదయం, సాయంత్రం, భోజనం తర్వాత నడవడం అలవాటు చేసుకోండి.
ఆరోగ్యానికి నడక ఎంతో మంచిది
మనలో చాలా మంది ఉదయాన్నే లేచి నడుస్తుంటారు మరి కొంత మంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నడుస్తుంటారు. దీని వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మనం వేసే ప్రతి అడుగు ఆరోగ్యకరమైన శరీరాన్ని, ప్రశాంతమైన మనస్సును కలిగి ఉండటానికి సహాయపడుతుంది. ప్రస్తుతం జీవనశైలిలో మార్పుల కారణంగా చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
వార్మ్‌అప్ చేయకుండా.. వాకింగ్ మొదలు పెట్టొద్దు..
నడకకు ముందు వార్మ్‌అప్ చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. వార్మ్‌అప్ చేయకుండా నడవడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. నడక వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలను ఉన్నాయి. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది , ఫ్లెక్సిబిలిటీ పెరిగేలా చేస్తుంది. వార్మ్‌అప్.. మీ గుండె, కీళ్లు , కండరాలను వాకింగ్ కు సిద్ధం చేస్తుంది. కొద్దీ నిమిషాల డైనమిక్ స్ట్రెచింగ్, లైట్ కార్డియోలతో నడకతో ప్రారంభించండి. నడక తర్వాత, మీరు కొన్ని స్ట్రెచింగ్ కూడా చేయాలి. అవి కండరాల నొప్పిని తగ్గిస్తాయి. హైడ్రేటెడ్‌గా ఉండటానికి , చెమట ద్వారా కోల్పోయిన ద్రవాలను తిరిగి పొందడానికి నీరు చాలా అవసరం. ఎక్కువ దూరం నడుస్తున్నప్పుడు తప్పకుండా మీతో వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళండి. నడక వల్ల చాలా అలసిపోతాం. కాబట్టి, ప్రోటీన్లతో కూడిన భోజనం తీసుకోండి.
Also Read: నిశ్చితార్థానికి, పెళ్లికి ఇంత మార్పా? అనంత్ అంబానీ మళ్లీ బరువు పెరగడానికి కారణం అదేనట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.