Weight Loss: వీటిని రాత్రిపూట తింటే త్వరగా బరువుపెరుగుతారు
కొన్ని రకాల ఆహారాలు రాత్రి పూట తినకూడదు. కానీ ఈ విషయం తెలియక చాలా మంది తిని, బరువు పెరుగుతున్నారు.
![Weight Loss: వీటిని రాత్రిపూట తింటే త్వరగా బరువుపెరుగుతారు Do not eat these at night, you will gain weight quickly Weight Loss: వీటిని రాత్రిపూట తింటే త్వరగా బరువుపెరుగుతారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/26/0a6dc5931aad979ab5cf89422cea07b8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
శరీరబరువును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. బరువు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యసమస్యలు కూడా పెరుగుతుంటాయి. అంతేకాదు శరీర బరువుతో ముడిపడి అనేక రోగాలు కూడా ఉన్నాయి. అయితే ఎత్తుకు తగ్గ బరువును మెయింటేన్ చేయమని చెబుతారు వైద్యులు. అనారోగ్యకరమైన ఆహారాలు, జంక్ ఫుడ్, తీపి పదార్థాలు అధికంగా తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు. అయితే రాత్రిపూట కొన్ని ఆహారాలను దూరంగా పెట్టాలి. వాటిని తరచూ రాత్రి పూట తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు.
టీ, కాఫీలు
కొందరికి టీ, కాఫీలు ఎప్పుడు తాగాలో కూడా తెలియదు. ప్రతి మూడు, నాలుగ్గంటలకోసారి కాఫీ, టీలు తాగేస్తుంటారు. ఏముంది గుక్కెడు టీ నీళ్లేగా అంటుంటారు. కానీ ఆ గుక్కెడే బరువు పెరగడానికి సహాయపడతాయి. టీ, కాఫీలలో కెలోరీలు, కెఫీన్ అధికంగా ఉంటుంది. వీటిని రాత్రి పూట తాగడం వల్ల ఆ కెలోరీలన్నీ శరీరంలో చేరతాయి. అంతేకాదు కెఫీన్ వల్ల నిద్ర సరిగా పట్టక బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి టీ, కాఫీలు సాయంత్రం నాలుగ్గంటల తరువాత తాగక పోవడం ఉత్తమం
మాంసాహారం
రాత్రి పూట పొట్ట నిండా చికెన్ బిర్యానీలు, మటన్ ఫ్రైలు తినేసి పడుకుంటే పొట్ట రావడం ఖాయం. ఎందుకంటే అవి త్వరగా జీర్ణం కావు, కొవ్వు రూపంలో పేరుకుపోతాయి. మీకు అంతగా మాంసాహారం తినాలనిపిస్తే రాత్రి ఏడుగంటలకే తినేయండి. రాత్రి పది వరకు నిద్రపోవద్దు. మధ్యలో ఓ అరగంట వాకింగ్ కూడా చేయండి.
క్యాబేజీ, కాలీ ఫ్లవర్
వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. తిన్నా కూడా త్వరగా జీర్ణం కావు. కాబట్టి ఈ కూరలు మధ్యాహ్నం పూటే వండుకోవాలి. రాత్రి పూట తింటే జీర్ణక్రియకు ఆటంకం కలగడం ఖాయం. ఆహారం సరిగా జీర్ణం కాకపోతే కొవ్వుగా మారిపోతుంది. కనుక త్వరగా బరువు పెరిగిపోతారు.
మద్యం, బీర్లు
రాత్రయితే చాలు సిట్టింగ్ పేరుతో ఆల్కహాల్ తాగే వారి సంఖ్య చాలా ఎక్కువ. రాత్రి తాగేవారందరికీ అధికంగా పెరుగుతుంది. రాత్రిపూట మద్యాన్ని దూరం పెట్టాలి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also Read: కొత్త ఏడాదిలో ధనవంతులవ్వాలని ఆశపడుతున్నారా? ఇంట్లో ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి...
Also Read: టీ ప్రేమికులందరికీ ఓ ప్రశ్న... రోజూ మీరు తాగే టీ మిమ్మల్ని లావుగా చేస్తోందని తెలుసా?
Also Read: ఛీ... అద్దెకున్నవాళ్లు ఇలా కూడా చేస్తారా? పాపం ఆ ఓనర్
Also Read: ఇంజెక్షన్ అంటే భయమా? మీలాంటివాళ్ల కోసమే సూది లేని ఇంజెక్షన్లు వస్తున్నాయి...
Also Read: మనోళ్లు మాములుగా తినలేదుగా... నిమిషానికి ఎన్ని బిర్యానీలు కుమ్మేశారో తెలిస్తే షాకవుతారు
Also Read: చీరకట్టుకూ రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబానికి మధ్య బంధమేంటి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)