Weird: కరీనా కపూర్ కొడుకు పూర్తి పేరేమిటి? కరెంట్ అఫైర్స్ పరీక్షలో అడిగిన ప్రశ్న, ఏ స్కూల్లోనంటే...
కరీనా కపూరే కాదు, ఆమె కొడుకులు చాలా పాపులర్ అయిపోతున్నారు. చివరికి పరీక్షల్లో ప్రశ్నలుగా కూడా మారుతున్నారు.
![Weird: కరీనా కపూర్ కొడుకు పూర్తి పేరేమిటి? కరెంట్ అఫైర్స్ పరీక్షలో అడిగిన ప్రశ్న, ఏ స్కూల్లోనంటే... What is the full name of Kareena Kapoor's son? The question asked in the Current Affairs exam is, in which school ... Weird: కరీనా కపూర్ కొడుకు పూర్తి పేరేమిటి? కరెంట్ అఫైర్స్ పరీక్షలో అడిగిన ప్రశ్న, ఏ స్కూల్లోనంటే...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/26/c7818974aba10423b7ab6e64b2ccc0ff_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కరెంట్ అఫైర్స్ అంటే? ప్రపంచంలో లేదా దేశంలో జరిగిన ముఖ్య ఘటనల సమాహారం. వీటిపైనే చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ఆధారపడి ఉంటాయి. అందులో దేశప్రజలకు, దేశానికి, ప్రపంచానికి అవసరమైన, వాటితో ముడిపడిన అంశాలను అడుగుతారు. కానీ ఓ స్కూల్ వాళ్లు కరెంట్ అఫైర్స్ పరీక్షల్లో ఓ వింత ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏ విధంగా విద్యార్థులకు ఉపయోగకరమో ఆ స్కూల్ వారికే తెలియాలి.
కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ కొడుకు పూర్తి పేరు ఏమిటి? ఈ ప్రశ్న మధ్యప్రదేశ్ లోని ఓ స్కూల్ వారు ఆరోతరగతి పిల్లలకు నిర్వహించిన పరీక్షలో అడిగారు. ఆ స్కూలు పేరు అకడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్. ఇది కాండ్వా జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్. పరీక్ష పూర్తయ్యాక ప్రశ్నా పత్రాన్ని ఇంటికి తీసుకెళ్లారు పిల్లలు. దాన్ని చూసిన తల్లిదండ్రులకు ఈ ప్రశ్న చదివి దిమ్మతిరిగింది. కొందరు జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ఇలాంటి ప్రశ్నలేనా పిల్లల్ని అడిగేది అని ప్రశ్నిస్తూ, ఆ స్కూల్ వారిపై చర్యలు తీసుకోమని కోరారు. ఆ ప్రశ్నాపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
కరీనా కొడుకు పేరు ఏమిటనే ప్రశ్నతో పాటూ మరో నాలుగు కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కూడా అడిగారు. వాటిలో ఒకటి ఉత్తరకొరియా డిక్టేటర్ ఎవరు? అని. అలాగే పాకిస్తాన్లో క్రాష్ అయిన ఫైటర్ జెట్ పైలెట్ ఎవరు? అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి.
A private school in Khandwa asked the name of film actor Kareena Kapoor Khan and Saif Ali Khan's son in the examination paper of class 6th. The DEO said a show cause notice will be issued to the school @ndtv @ndtvindia @GargiRawat @manishndtv pic.twitter.com/YkERwGYeMB
— Anurag Dwary (@Anurag_Dwary) December 24, 2021
Also Read: నీతా అంబానీ చేతిలో నీళ్ల బాటిల్... ఆ నీళ్ల బాటిల్ ఖరీదుతో హైదరాబాదులో ఫ్లాట్ కొనేయచ్చు
Also Read: క్రూరమైన కిల్లర్... కార్డియాక్ అరెస్టు, వచ్చే ముందు ఈ లక్షణాలు కనిపించొచ్చు, జాగ్రత్త పడండి
Also Read: ఛీ... అద్దెకున్నవాళ్లు ఇలా కూడా చేస్తారా? పాపం ఆ ఓనర్
Also Read: ఇంజెక్షన్ అంటే భయమా? మీలాంటివాళ్ల కోసమే సూది లేని ఇంజెక్షన్లు వస్తున్నాయి...
Also Read: మనోళ్లు మాములుగా తినలేదుగా... నిమిషానికి ఎన్ని బిర్యానీలు కుమ్మేశారో తెలిస్తే షాకవుతారు
Also Read: చీరకట్టుకూ రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబానికి మధ్య బంధమేంటి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)