kidney: మీ కిడ్నీలు సేఫ్‌గా ఉండాలంటే ఈ ఆహారాలను దూరం పెట్టండి
Kidney Food: కిడ్నీ వ్యాధితో బాధపడేవారు కొన్ని వస్తువులను తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే వీటిని తినడం వల్ల కిడ్నీ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.
Kidney Health Tips in Telugu: కిడ్నీ వ్యాధి ఎంత ప్రమాదకరమో తెలిసిందే. అందుకే మనం తినే ఆహారంపై తప్పకుండా అవగాహన ఉండాలి. ముఖ్యంగా కిడ్నీ వ్యాధి బాధితులు కొన్ని ఆహారాల జోలికి అస్సలు వెళ్లకూడదు.
మీరు మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇందులో అధిక సోడియం ఉన్న ఆహారం, ప్రాసెస్ చేసిన మాంసం, కార్బోనేటేడ్ పానీయాలను అస్సలు ముట్టొద్దు.
ఊరగాయలు:
కొంత మందికి ఊరగాయ లేనిది నోట్లోకి ముద్దవెళ్లుదు. కానీ కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు.. ఎంత కోరికగా అనిపించినా ఊరగాయలు తినకూడదు. ఎందుకంటే ఇందులో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది.
ప్రాసెస్ చేసిన మాంసం:
రుచిని పెంచేందుకు ప్రాసెస్ చేసిన మాంసంలో చాలా ఉప్పు ఎక్కువగా కలుపుతుంటారు. మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది.
ఉప్పు:
ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకున్నట్లయితే అధిక బీపీ సమస్యతో బాధపడాల్సి వస్తుంది. ఇది మూత్రపిండాలపై కూడా ఒత్తిడిని కలిగిస్తుంది. ఫాస్ట్ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్ కూడా మానుకోవాలి.
ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం:
మీరు కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటే, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినకూడదు. కాయధాన్యాలు, బీన్స్, ఇతర అధిక ప్రోటీన్ ఆహారాలకు దూరంగా ఉండండి.
అరటిపండ్లు:
అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కిడ్నీ రోగులు ఈ పండును తినకూడదు. దీనికి బదులుగా, పైనాపిల్ తినవచ్చు, ఇందులో విటమిన్ A కూడా ఉంటుంది.
బంగాళదుంప:
బంగాళదుంపలలో పొటాషియం ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. కాబట్టి దీనికి దూరంగా ఉండాలి. మీరు బంగాళాదుంప తినవలసి వస్తే, రాత్రంతా నీటిలో నానబెట్టండి.
తీపి పానీయాలు:
తీపి సోడా, కోలా వంటి తీపి పానీయాలు, శీతల పానీయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే వాటిలో ఫాస్ఫేట్ ఉంటుంది, ఇది రాళ్లను కలిగిస్తుంది. వీటిలో ఉండే ఫ్రక్టోజ్ కిడ్నీలకు కూడా ప్రమాదకరం.
ఫాస్పరస్ అధికంగా ఉండే ఆహారాలు:
ఎక్కువ ఫాస్పరస్ ఉన్న ఆహారం శరీరానికి హానికరం. డైరీ, గింజలు, తృణధాన్యాలు, కార్బోనేటేడ్ పానీయాలు వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి లేదా మితంగా తీసుకోవాలి.
పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు:
తక్కువ పొటాషియం స్థాయిలు మూత్రపిండాలు, గుండె సమస్యలను కలిగిస్తాయి. "బచ్చలికూర, టమోటాలు, అవకాడోలు, నారింజ, అరటిపండ్లు, ఇతర అధిక-పొటాషియం ఆహారాల వినియోగాన్ని తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలు:
కిడ్నీలో రాళ్లను అభివృద్ధి చేయడంలో ఆక్సలేట్లు పాత్ర పోషిస్తాయి. బచ్చలికూర, రబర్బ్, దుంపలు, చాక్లెట్, కొన్ని గింజలు, విత్తనాలు.
కెఫిన్:
కెఫీన్ శరీరాన్ని డీహైడ్రేషన్‌గా మారుస్తుంది.అంతేకాదు రక్తపోటును పెంచుతుంది, ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కెఫిన్‌కూ దూరంగా ఉండటం మంచిది.
Also Read : అమ్మాయిలు న్యూ ఇయర్ పార్టీ కోసం మీ చర్మాన్ని, జుట్టుని సిద్ధం చేసుకోండిలా
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.