Party Skin Care : అమ్మాయిలు న్యూ ఇయర్ పార్టీ కోసం మీ చర్మాన్ని, జుట్టుని సిద్ధం చేసుకోండిలా
Skin Care Tips : న్యూ ఇయర్ దగ్గర్లో ఉంది. ఈ సమయంలో పార్టీలు, గెట్ టూ గెదర్లు అవుతూ ఉంటాయి. ఆ సమయానికి మీ పార్టీ లుక్ కోసం మిమ్మల్ని సిద్ధం చేసుకోండి.
Prepare Your Skin for the New Year Party : లాంగ్ వీకెండ్లో న్యూ ఇయర్ వచ్చేస్తుంది. సంవత్సరం మారేందుకు కేవలం కొన్ని రోజులే ఉన్నాయి. ఈ సమయంలో చాలామంది పార్టీలు చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలితో కలిసి బయటకు వెళ్లడమో.. టెంపుల్స్‌కి వెళ్లడమో.. పబ్‌లకు వెళ్లి ఎంజాయ్ చేయడమో చేస్తారు. మీరు కూడా అలాంటి పార్టీలకు వెళ్లే వారైతే.. మీ చర్మాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇప్పటి నుంచి మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీ స్కిన్ మీకంటే బాగా మెరుస్తుంది. పార్టీల కోసం కాకపోయినా.. మీ స్కిన్కోసం ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకే మంచిది. ఎప్పుడు బయటకు వెళ్లాల్సి వచ్చినా.. మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఈజీగా రెడీ అయిపోవచ్చు. అయితే స్కిన్ కేర్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఎక్స్ఫోలియేషన్
మీ చర్మానికి ఏది అప్లై చేయాలన్నా.. మీరు ఏ పార్టీకి సిద్ధమవుతున్న ముందు చేయాల్సిన దశ ఎక్స్ఫోలియేషన్. ఇది మీ చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. చర్మానికి రిఫ్రెష్మెంట్ ఇస్తుంది. దీనికోసం మీరు తేలికపాటి ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్ లేదా ఫేస్ మాస్క్ ట్రై చేయవచ్చు. ఇవి మీ చర్మానికి మంచి ప్రయోజనాలు అందిస్తాయి. అనంతరం మీరు చర్మాన్ని శుభ్రం చేయడం కోసం తేమనిచ్చే, మృదువైన, నూనె ఆధారిత క్లెన్లర్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది మీ చర్మాన్ని డ్రై కానివ్వకుండా హైడ్రేట్ చేస్తుంది.
పోషకమైన ఫేస్ మాస్క్
మీ చర్మం మృదువుగా, పార్టీకి సిద్ధంగా ఉండేందుకు మీరు మంచి ఫేస్ మాస్క్‌ని ట్రై చేయాలి. ఎందుకంటే మంచి మాస్క్ ఎప్పుడూ మీకు మంచి హైడ్రేటింగ్, స్మూత్ చర్మాన్ని అందిస్తుంది. మీ చర్మం తేమగా, అద్భుతంగా కనిపించడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు పార్టీకి వెళ్లే ముందు దీనిని ఉపయోగిస్తే మంచిది. ఇది మీకు మేకప్ అవసరం లేకుండా ఆరోగ్యకరమైన, సహజమైన మెరుపును స్కిన్‌కు అందిస్తుంది.
పోషణ, హైడ్రేట్
మీరు రాత్రంతా పార్టీలో మెరిసిపోవాలంటే మీ చర్మానికి తగినంత పోషణ, హైడ్రేట్ అందించాలి. మీ చర్మాన్ని బూస్ట్ చేయడం కోసం కొల్లాజెన్ లేదా పెప్టైడ్స్‌తో కూడిన మాయిశ్చరైజింగ్ సీరమ్ ఎంచుకోవచ్చు.
చర్మాన్ని హైడ్రేట్ చేసే రీ హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్‌ను ఉపయోగించండి. దానిపై సీరమ్‌ను రెగ్యూలర్‌గా అప్లై చేయండి. సీరమ్ రోజూ ఉపయోగిస్తే మీ స్కిన్ టోన్ మెరుపును సంతరించుకుంటుంది. ఇది మీకు మంచి గ్లో అందిస్తుంది. పైగా ఇది మీరు వేసుకునే మేకప్ స్థిరంగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. కళ్లు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని తేమగా చేసేందుకు ఐ క్రీమ్‌ను తప్పక అప్లై చేయండి.
మేకప్ కోసం..
పార్టీకి వెళ్లే ముందు మేకప్ విషయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి పార్టీ చేసుకునే ముందు లేదా ఎప్పుడైనా బయటకు వెళ్లేప్పుడు కచ్చితంగా మేకప్ ప్రైమర్‌ని ఉపయోగించాలి. ఎందుకంటే ప్రైమర్ మీ చర్మం, మీ మేకప్ మధ్య ఓ వారధిగా పనిచేస్తుంది. మీ చర్మాన్ని కెమికల్స్ నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా మీ ఫౌండేషన్, ఐషాడో వంటి ఇతర మేకప్ ప్రొడెక్ట్స్ ఎక్కువ సేపు మీ ముఖంపై ఉండేలా, చెక్కు చెదరకుండా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. మీకు ఆయిలీ స్కిన్ ఉంటే.. మ్యాట్ ఫైయింగ్ ప్రైమర్ ఎంచుకోండి. కానీ మీరు స్మోకీ లుక్ కావలనుకుంటే హైడ్రేటింగ్ ప్రైమర్ ఉపయోగిస్తే మంచిది.
జుట్టు విషయంలో..
పార్టీకి వెళ్లే రోజు మీరు కచ్చితంగా హెయిర్ వాష్ చేసుకోండి. దానికి మంచి కండీషన్ ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా మీ జుట్టును హీట్, స్టైలింగ్ నుంచి జాగ్రత్త రక్షించుకోగలుగుతారు. బేబి హెయిర్ వంటివి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. సీరమ్‌లు, కండీషనర్లు మీ జుట్టును హీటింగ్ టూల్స్ నుంచి కాపాడుతాయి. స్ట్రెయిటెనింగ్, కర్లింగ్, బ్రో డ్రైయింగ్ వంటివి కాస్త తక్కువ నష్టాన్ని ఇస్తాయి కాబట్టి వీటిని ట్రై చేస్తే మంచిది.
Also Read : ఫుడ్ విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన అపోహలు ఇవే.. మీరు కూడా ఫాలో అయ్యారా?