Breast Cancer: మహిళలూ.. రొమ్ము క్యాన్సర్లు చాలా రకాలున్నాయ్, చికిత్స మార్గాలివే!
మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి.
మహిళలు సాధారణంగా ఎదుర్కొనే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. ఈ వ్యాధి బారినపడుతున్న మహిళల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. రొమ్ము క్యాన్సర్ సాధారణంగా రొమ్ము నాళాలు లేదా లోబుల్స్‌లో అభివృద్ధి చెందుతుంది. లోబుల్స్ అంటే పాలను ఉత్పత్తి చేసే గ్రంథులు. క్యాన్సర్ కణాలు ఆరోగ్యకరమైన రొమ్ము కణజాలంపై ప్రభావం చూపుతాయి. క్యాన్సర్ శోషరస కణుపుల్లోకి ప్రవేశిస్తే అది ఇతర భాగాలకు వెళ్లడానికి ఒక మార్గాన్ని ఏర్పరుచుకుంటుంది. ఇది మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్‌కు దారితీయవచ్చు.
రొమ్ము క్యాన్సర్లు వేర్వేరు రకాలుగా ఉన్నాయి. ఇన్వాసివ్ బ్రెస్ట్ క్యాన్సర్, నాన్ ఇన్వాసివ్ బ్రెస్ట్ క్యాన్సర్. నాన్-ఇన్వాసివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అసలు కణజాలం నుంచి వ్యాపించదు. రొమ్ము క్యాన్సర్‌ను ఇన్‌సిటు అని కూడా అంటారు. ఇన్వాసివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రొమ్ము నాళాలు, గ్రంధుల నుంచి రొమ్ములోని ఇతర భాగాలకు వ్యాపించే క్యాన్సర్.
రొమ్ము క్యాన్సర్ రకాలు
డక్టల్ కార్సినోమా ఇన్ సిటు లేదా DCIS: DCIS అనేది నాన్‌వాసివ్ రకం రొమ్ము క్యాన్సర్, ఇది మీ రొమ్ముల నాళాలకు పరిమితమై పరిసర కణజాలానికి వ్యాపించదు.
లోబ్యులర్ కార్సినోమా ఇన్ సిటు లేదా LCIS: LCIS అనేది మళ్లీ ఒక రకమైన నాన్‌వాసివ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఇది రొమ్ములోని లోబుల్స్‌లో అభివృద్ధి చెందుతుంది. DCIS లాగా ఈ క్యాన్సర్ కణాలు కూడా చుట్టుపక్కల కణజాలానికి వ్యాపించవు.
ఇన్వాసివ్ డక్టల్ కార్సినోమా లేదా IDC: ఇది రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణ రకాల్లో ఒకటి. ఇది రొమ్ము పాల నాళాలలో అభివృద్ధి చెందుతుంది. అయితే ఇవి ఇతర కణజాలానికి వ్యాపిస్తాయి. ఈ దశలో గుర్తించకపోతే ఇతర అవయవాలు, కణజాలాలకు కూడా వ్యాపిస్తుంది.
ఇన్వాసివ్ లోబ్యులర్ కార్సినోమా లేదా ILC: IDC లాగా ఈ క్యాన్సర్ రొమ్ము లోబుల్స్‌లో అభివృద్ధి చెంది తర్వాత చుట్టుపక్కల కణజాలానికి వ్యాపిస్తుంది.
ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్
దీన్నే IBC అని కూడా పిలుస్తారు. ఇది చాలా అరుదైన రొమ్ము క్యాన్సర్. కానీ వేగంగా వ్యాపిస్తుంది. ఈ రకమైన క్యాన్సర్‌లో కణాలు రొమ్ము దగ్గర శోషరస కణుతులను నిరోధిస్తాయి. ఇది కణితిని సృష్టించదు, కానీ రొమ్ము ఉబ్బి ఎర్రగా కనిపించేలా చేస్తుంది. ఇటువంటి పరిస్థితి గుర్తిస్తే వెంటనే వైద్యులని సంప్రదించడం ఉత్తమం.
ట్రిపుల్ నెగటివ్ రొమ్ము క్యాన్సర్
ఇది అరుదైన క్యాన్సర్. ఇది వస్తే చికిత్స చేయడం కష్టతరం అవుతుంది.
రొమ్ము క్యాన్సర్ చికిత్సలు
క్యాన్సర్ దశ, పరిమాణం, రకాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. శస్త్ర చికిత్స అనేది పరిస్థితి చేయదాటిన తర్వాత చేస్తారు. కీమో థెరపీ, టార్గెటెడ్ థెరపీ, రేడియేషన్ లేదా హార్మోన్ థెరపీని కూడా సిఫార్సు చేస్తారు. రేడియేషన్ థెరపీ: ఈ చికిత్స ప్రక్రియలో క్యాన్సర్ కణాలను చంపడానికి అధిక శక్తితో కూడిన రేడియేషన్లను ఉపయోగిస్తారు. కీమోథెరపీ చికిత్స సాధారణంగా శస్త్రచికిత్స వంటి ఇతర చికిత్సలతో పాటు ఉపయోగించబడుతుంది. ఇందులో క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి ఔషధ చికిత్సను ఉపయోగిస్తారు. ఇక హార్మోన్ థెరపీ మరొకటి. ఇది రొమ్ము క్యాన్సర్ హార్మోన్లకు సున్నితంగా ఉండే వ్యక్తులకు సిఫార్సు చేస్తారు.
Also read: దీపావళి పండుగ సీజన్లో వచ్చే అనారోగ్యాల నుంచి ఇలా రక్షణ పొందండి