అన్వేషించండి

Cancerous Moles : ఇంతకీ మీ శరీరంపై ఉన్నవి పుట్టుమచ్చలా? క్యాన్సర్ మచ్చలా?

Moles Story : శరీరంపై కాస్త డార్క్​గా, ముఖ్యంగా బ్లాక్​గా ఉండే మచ్చలను పుట్టుమచ్చలు అనుకుంటాము. అసలు నిజంగా అవి పుట్టుమచ్చలేనా? లేక క్యాన్సర్ మచ్చలా?

Types of Moles : చిన్నతనం నుంచి శరీరంపై కొన్ని మచ్చలు కనిపిస్తాయి. వాటిని పుట్టు మచ్చలు అంటారు. పుట్టినప్పటి నుంచి ఉన్న మచ్చలు కాబట్టి పుట్టుమచ్చలు అంటున్నారు.. కానీ కొన్ని మచ్చలు వయసు పెరిగే కొద్ది వస్తాయి. చూసేందుకు అవి కూడా పుట్టు మచ్చల్లానే కనిపిస్తాయి. కాబట్టి వాటిని కూడా బర్త్ మోల్స్ అనేసుకుంటారు. కానీ అవి నిజంగా పుట్టుమచ్చలా? లేకుంటే శరీరంలో వచ్చే మార్పులకు సంకేతాలా? ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? 

వయసు పెరిగే కొద్ది వచ్చే మచ్చలను చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఏమైతే ఏముంది చూసేందుకు బాగానే ఉంది కదా అనుకుంటారు. అది ఏమైనా మీ అందాన్ని ఇబ్బంది పెడుతుందంటే అప్పుడు దాని గురించి ఆలోచిస్తారు. మరికొందరు అది పుట్టుమచ్చే అయినా సర్జరీలు చేసి మరీ దానిని తీయించుకుంటారు. అయితే ప్రతి మచ్చ ఏదొక భిన్నమైన కథను కలిగి ఉంటుందట. 

పుట్టుమచ్చలు అంటే ఏమిటి?

పుట్టుమచ్చలను శాస్త్రీయంగా నెవి అని పిలుస్తారు. ఇవి శరీరంలోని మెలనోసైట్స్ అనే క్లస్టర్డ్ పిగ్మెంట్ ఉత్పత్తి కణాల ద్వారా ఏర్పడతాయి. ఇవి శరీరంలోపలి నుంచి చర్మంపైకి కనిపిస్తూ పుట్టుమచ్చలుగా కనిపిస్తాయి. ఇవి వివిధ రంగులు, ఆకారాలు, పరిమాణాలలో కనిపిస్తాయి. పుట్టుమచ్చలు సాధారణంగా మొదటి రెండు దశాబ్ధాలలో ఉద్భవిస్తాయి.  యుక్తవయసు నుంచి 40 ఏళ్లవరకు ఉంటాయి. కాలక్రమేణా మార్పులకు లోనవుతాయి. లేదంటే లేత రంగునుంచి ముదురు రంగుకు మారుతూ ఉంటాయి. 

పుట్టు మచ్చలు v/s చిన్న మచ్చలు

కొన్ని చిన్న చిన్న మచ్చలను పుట్టుమచ్చలు అనుకుంటారు. పుట్టుమచ్చలు అనేవి చర్మకణాల సమూహాల నుంచి విభిన్నంగా ఉంటాయి. చిన్నచిన్న మచ్చలకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఇవి ఫ్లాట్ రూపాన్ని కలిగి ఉంటాయి. రెండో రకం మెలనోసైట్​ల ద్వారా ఉత్పత్తి అయి.. మెలనిన్ నుంచి వాటి రంగును పొందుతాయి. అంతేకాకుండా సూర్యరశ్మి ద్వారా ప్రభావితమవుతాయి. చిన్నచిన్న మచ్చలు సాధారణంగా పుట్టుమచ్చలతో సంబంధం ఉన్నా.. రూపాంతరం చెందే సామర్థ్యాన్ని కలిగి ఉండవు. కాబట్టి వాటిని మచ్చలుగా గుర్తించాలి. పుట్టుమచ్చలు సాధారణంగా చాలా ముదురు రంగులో ఉంటాయి. చిన్నచిన్న మచ్చలు ఎక్కువగా ఎరుపు లేదా లేత గోధుమ రంగులో కనిపిస్తాయి. 

క్యాన్సర్ మచ్చలు

పట్టుమచ్చలలో ఎక్కువ భాగం ప్రమాదకరం కానప్పటికీ.. కొన్ని చర్మ క్యాన్సర్​ను అభివృద్ధి చేస్తాయి. ముఖ్యంగా ఎక్కువసేపు సూర్యరశ్మికి గురైనప్పుడు వీటి ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. డైస్ప్లాస్టిక్ లేదా ఎటిపికల్ నెవి అని పిలువబడే మచ్చలు మెలనోమా అంటే మెలనోసైట్స్​లో మొదలయ్యే ఒక రకమైన చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. రెగ్యూలర్​గా స్కిన్ టెస్ట్ చేయించుకుంటే వీటి గురించి మీరు పూర్తి అవగాహనతో ఉండొచ్చు. అంతేకాకుండా ఈ తరహా క్యాన్సర్స్​ను ముందుగా గుర్తించగలుగుతారు. తద్వారా నివారణ చర్యలు, చికిత్సలు త్వరగా ప్రారంభించవచ్చు. 

కాబట్టి పుట్టుమచ్చలు కాకుండా చర్మంపై వచ్చే మచ్చలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉంటే మంచిది. కొన్ని మచ్చలు తక్షణమే ఆందోళన కలిగించవు కానీ.. దీర్ఘకాలికంగా సూర్యరశ్మి వల్ల ప్రభావానికి గురై.. క్యాన్సర్ కారకాలను ప్రేరేపించవచ్చు. కాబట్టి.. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిది. శరీరంపై ఏదైనా మచ్చ పరిమాణంలో లేదా రంగులో మార్పులు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి. 

Also Read : గర్భిణీ స్త్రీ కడుపు తాకడం మంచిదేనా? నిపుణుల సలహా ఇదే..

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
Golbal Star Ram Charan : అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
Embed widget