అన్వేషించండి

Pregnant Belly : గర్భిణీ స్త్రీ కడుపు తాకడం మంచిదేనా? నిపుణుల సలహా ఇదే..

Pregnancy Care : ప్రెగ్నెంట్ సమయంలో తల్లి కడుపు బయటకు వస్తుంది. దానిని టచ్ చేసి చాలామంది విషెష్ చెప్తారు. అయితే ఇలా గర్భిణీ కడుపు పట్టుకోవడం మంచిదేనా?

Stroking the Pregnant Belly : మతపరమైన, సాంస్కృతిక, వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా గర్భిణీ కడుపు తాకడంపై వివిధ అభిప్రాయాలు ఉంటాయి. చాలామంది మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు తమ కడుపునకు ఇతరుల చేయిని తాకించి.. బేబి మూమెంట్స్​ని చూపిస్తారు. కానీ కొందరు అలాంటివి ఇష్టపడరు. కేవలం వారు మాత్రమే గర్భాన్ని రబ్ చేసుకుంటా.. పిల్లలతో తమ సమయాన్ని ఎంజాయ్ చేస్తారు. మరికొందరు ఇతరులు తమ గర్భం టచ్ చేస్తే అస్సలు కంఫర్ట్​బుల్​గా ఫీల్​ అవ్వరు. ఇంతకు కాబోయే తల్లి గర్భాన్ని టచ్ చేయడం ఆమోదయోగ్యమైనదేనా? దానికి హద్దులున్నాయా?

ఈ అంశంపై నిపుణులు భిన్నమైన దృక్కోణాలు కలిగిన ఇద్దరు గర్భిణీలపై అధ్యయనం చేశారు. అయితే వారి నిర్ణయాల ప్రకారం.. ఆమె ఆహ్వానం, అనుమతి లేకుండా గర్భిణీ స్త్రీ కడుపు తాకడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఎందుకంటే బొడ్డు తాకడం అనేది ఆ మహిళ సన్నిహత ప్రాంతాన్ని టచ్ చేయడం. కాబట్టి ఆమె ఆమోదం లేకుండా తాకడం అస్సలు మంచిది కాదు. ఈ స్థలం కేవలం భాగస్వాములు, తోబుట్టువులు, తల్లిదండ్రులు, వారు సన్నిహితంగా భావించే వ్యక్తుల కోసం మాత్రమే. వారు కూడా ఆమె అనుమతి లేకుండా టచ్ చేయకూడదని తెలిపారు. పరిచయస్తులు, సహోద్యుగులు, అపరిచితులు నెలలు నిండిన కడుపును తాకడం ఆమోదయోగ్యం అస్సలు కాదు. 
నెలలు నిండుతున్న గర్భాన్ని టచ్ చేయాలా వద్దా అనేది టచ్ చేయాలనుకునేవారి ఇంగితంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీరు ముట్టుకున్నప్పుడు గర్భిణీ స్త్రీ కంఫర్ట్​గా లేకుంటే దాని ప్రభావం పిల్లలపై చూపిస్తుంది అంటున్నారు. కాబట్టి గర్భిణీ ముట్టుకోవద్దని చెప్తే దానిని తాకకపోవడమే మంచిదని చెప్తున్నారు నిపుణులు. స్త్రీ వ్యక్తిగత సూచనలను కచ్చితంగా అందరూ పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. కొన్ని కారణాల వల్ల ఎవరైనా కడుపును రబ్ చేయాలని కోరుకుంటే.. ముందు కచ్చితంగా ఆమె పర్మిషన్ తీసుకోవాలి అంటున్నారు. 

తమ గర్భంపై ఇతరులు తాకడాన్ని స్వాగతించని స్త్రీలు ఎదుటివారిని సున్నితంగా తిరస్కరించవచ్చు. లేదంటే మీరు ఏదైనా శబ్ధం లేదా చేష్టల ద్వారా ఎదుటివారికి మిమ్మల్ని ముట్టుకోవద్దని చెప్పవచ్చు. అయితే మీరు స్ట్రాంగ్​గా వద్దని చెప్పినా.. నవ్వుతూ తిరస్కరించడమే మంచిది. ఎందుకంటే ఎదుటివారు మీకు విషెష్ చెప్పడానికి, వారి ఆప్యాయతను మీకు చూపించాలని తాకేందుకు సిద్ధమై ఉండొచ్చు. కాబట్టి మీరు కాస్త నవ్వుతూ దానిని తిరస్కరించవచ్చు. 

ఎందుకంటే పెళ్లి కావడం కొత్త జీవితం అనుకుంటారు కానీ.. పిల్లల్ని కనడమే నిజమైన కొత్తజీవితం. ఇది మహిళల్లో శారీరక, మానసిక మార్పులను తీసుకువస్తుంది. ఈ సమయంలో వారి భావోద్వేగాలు సంక్లిష్టంగా ఉంటాయి. కాబట్టి ఆమె కడుపును టచ్ చేసే ముందు ఆమె పర్మిషన్ కచ్చితంగా తీసుకోవాలి. ఆమె ఓకే అంటేనే మీరు గర్భాన్ని తాకాల్సి ఉంటుంది. లేదంటే దూరంగా ఉండాల్సిందే. అయితే గర్భం ధరించిన స్త్రీ మాత్రం తన కడుపును రబ్​ చేసుకుంటూ.. లోపలి శిశువుతో మాట్లాడుతూ హాయిగా సమయాన్ని వెచ్చించవచ్చు. ఆమె అలా చేస్తుంది కదా మేము కూడా అలానే ఉంటాము అంటే కచ్చితంగా తప్పు. 

Also Read : మగవారికి కూడా మోనోపాజ్ ఉంటుందట.. ఈ మార్పులు వాటి లక్షణాలే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget