అన్వేషించండి

Diabetes-BP Effect on Kidneys : బీపీ, షుగర్‌తో కిడ్నీ డ్యామేజ్.. ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఎఫెక్ట్ తక్కువ, డాక్టర్ల సూచనలివే

Kidney Care : డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఉంటే.. వాటి ఎఫెక్ట్ కిడ్నీలపై కూడా పడుతుందని ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచించారు. అవేంటంటే.. 

Diabetic Nephropathy Precautions : ఈరోజుల్లో మధుమేహం, బీపీ లాంటివి చాలా సాధారణంగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యలుగా మారిపోయాయి. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలిని ఫాలో అవ్వకపోవడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలు చాలామందిని ప్రభావితం చేస్తున్నాయి. అయితే మధుమేహం, బీపీ అనేది శరీరాన్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది? కిడ్నీలపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

నలభై ఏళ్లు పైబడినవారిని ఓ 100 మందిని తీసుకుంటే వారిలో 40 నుంచి 50 శాతం డయాబెటిస్ లేదా బీపీతో ఇబ్బందిపడుతున్నారు. లైఫ్​స్టైల్, అన్​హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ ఇలా ప్రతీది డయాబెటిస్, బీపీ ప్రమాదాన్ని రెట్టింపు చేస్తున్నాయని విజయవాడలోని మణిపాల్ హాస్పటల్​కు చెందిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. అలాగే బీపీ, మధుమేహం ఉంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో సూచించారు. 

శరీరంపై డయాబెటిస్, బీపీ ప్రభావం

"మధుమేహం ఎక్కువగా కంట్రోల్​ లేకుండా ఉంటే.. కంటిపై ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. దీనిని డయాబెటిక్ రెట్నోపతి అంటారు. మూత్రం నుంచి ప్రోటీన్ ఎక్కువమోతాదులో పోతుంది. దీనిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. దీర్ఘకాలికంగా ఇది కొనసాగితే కిడ్నీల వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా గుండెకు సంబంధించిన, రక్తనాళాల్లో సమస్యలు వస్తాయి" అని తెలిపారు. 

"డయాబెటిస్ కంట్రోల్​ లేకపోతే బాడీలో సాల్ట్, ఫ్లూయిడ్ పెరిగి హైబీపీ వస్తుంది. అలాగే బీపీ ఉన్నవారిలో ఒబెసిటీ సమస్యలు పెరగడం, ఇన్సులిన్ రెసిస్టెన్సీ తగ్గిపోయి మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రెండూ ఒకదానితో మరొకటి ముడి పడి ఉంటాయి." - డాక్టర్ శ్రీధర్ 

డయాబెటిస్, బీపీ రెండూ ఉంటే..

మధుమేహం, బీపీ రెండూ ఒకేసారి ఉంటే.. శరీరంపై ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీలు, గుండె, కళ్లకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ శ్రీధర్ తెలిపారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

"డయాబెటిస్ వచ్చిన మొదటి 5 సంవత్సరాలు దానిని కంట్రోల్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ముందు తీసుకున్న మందులే కంటిన్యూ చేయడం సరికాదు. రెగ్యులర్​గా షుగర్ చెకప్స్ చేయించుకోవాలి. నెలకోసారి లేదా మూడునెలలకోసారి టెస్ట్​లు చేయించుకుంటే మంచిది. వ్యాయామాం చేయాలి. పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. నాన్​వెజ్ తగ్గించడం, సాల్ట్ ఫుడ్స్, స్నాక్స్ తగ్గించుకోవడం మంచి ఫలితాలు ఇస్తాయి" అని తెలిపారు. ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల డయాబెటిస్, బీపీ ఉన్నా శరీరంపై వాటి ఎఫెక్ట్ తక్కువగా ఉంటుందని వెల్లడించారు. 

డయాబెటిస్ ఉంటే కిడ్నీకి సంబంధించిన టెస్ట్​లు కచ్చితంగా చేయించుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల ముందుగానే సమస్యను గుర్తించి డ్యామేజ్ జరగకుండా కాపాడుకోవచ్చని చెప్తున్నారు. ఇప్పటికీ కిడ్నీలు ఎఫెక్ట్ అయితే ఎక్కువకాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయితే ట్రాన్సప్లెంట్ చేయడం, డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుంది. మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి జీవితకాలం పెంచుకోవచ్చని.. అయితే ముందుగా సూచించిన జాగ్రత్తలు తీసుకుంటే ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుందని సూచించారు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Job Resignation Reasons : జాబ్ మానేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందా? ఉద్యోగుల రాజీనామాల వెనుక అసలు కారణాలు ఇవే
జాబ్ మానేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందా? ఉద్యోగుల రాజీనామాల వెనుక అసలు కారణాలు ఇవే
Best Indoor Plants : మూడ్‌ను మెరుగుపరిచే ఇండోర్ మొక్కలు ఇవే.. ఇంటికి అందం, మనసుకు ప్రశాంతత
మూడ్‌ను మెరుగుపరిచే ఇండోర్ మొక్కలు ఇవే.. ఇంటికి అందం, మనసుకు ప్రశాంతత
Childhood Obesity : ఊబకాయం వల్ల అమ్మాయిలకు పీరియడ్స్ త్వరగా వచ్చేస్తాయా? మరి మగపిల్లలకు? నిపుణుల సూచనలివే
ఊబకాయం వల్ల అమ్మాయిలకు పీరియడ్స్ త్వరగా వచ్చేస్తాయా? మరి మగపిల్లలకు? నిపుణుల సూచనలివే
Urination During Stomach Upset : విరేచనాలతో పాటు పదే పదే యూరిన్‌కు వెళ్తున్నారా? కారణాలు, జాగ్రత్తలు ఇవే
విరేచనాలతో పాటు పదే పదే యూరిన్‌కు వెళ్తున్నారా? కారణాలు, జాగ్రత్తలు ఇవే

వీడియోలు

Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Heavy Rain Update 2026: భాగ్యనగరాన్ని దడదడలాడించిన తొలి రుతుపవన వర్షం - ట్రాఫిక్ కష్టాలు.. వాహనదారులకు పోలీసుల కీలక సూచనలు!
భాగ్యనగరాన్ని దడదడలాడించిన తొలి రుతుపవన వర్షం - ట్రాఫిక్ కష్టాలు.. వాహనదారులకు పోలీసుల కీలక సూచనలు!
Vizag Steel Plant Accident Updates:
"స్టీల్‌ప్లాంట్ సమస్యలపై త్వరలోనే చర్చలు- రాజకీయాలకు అతీతంగా కార్మిక సంఘాలు పనిచేయాలి" డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్
Visakhapatnam Steel Plant Accident Nara Lokesh Visit:
"విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బాధితులకు 90 రోజుల్లో న్యాయం" పరామర్శ తర్వాత లోకేష్‌ ప్రకటన
Longest Serving PMs of India: నెహ్రూ రికార్డు బద్దలుకొట్టిన నరేంద్ర మోదీ.. సుదీర్ఘకాలం భారత ప్రధానిగా సేవలందించింది వీరే
నెహ్రూ రికార్డు బద్దలుకొట్టిన నరేంద్ర మోదీ.. సుదీర్ఘకాలం భారత ప్రధానిగా సేవలందించింది వీరే
Hyderabad Future City Legal Immunity: ఫ్యూచర్ సిటీకి పటిష్టమైన చట్టపరమైన రక్షణ - ఎవరొచ్చినా మార్చలేరు - రేవంత్ మాస్టర్ ప్లాన్ !
ఫ్యూచర్ సిటీకి పటిష్టమైన చట్టపరమైన రక్షణ - ఎవరొచ్చినా మార్చలేరు - రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Ravi Teja: సంక్రాంతి 2027 రేసులోకి రవితేజ... మళ్ళీ మాస్ కామెడీతో?
సంక్రాంతి 2027 రేసులోకి రవితేజ... మళ్ళీ మాస్ కామెడీతో?
HYDRA Name Hystory: హైడ్రా అంటే హిట్లర్ కోర్ టీమా? మార్వెల్ విలనా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు నిజం ఇదీ!
హైడ్రా అంటే హిట్లర్ కోర్ టీమా? మార్వెల్ విలనా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు నిజం ఇదీ!
PM Modi 12 Years Achievements:సామాన్యుడి చేతిలో బ్యాంక్ బుక్... దేశం చేతిలో సెమీకండక్టర్ చిప్‌! ఎన్నికై ఎక్కువ కాలం పాలించిన ప్రధానిగా రికార్డు సృష్టించిన మోదీపై స్పెషల్ స్టోరీ!
సామాన్యుడి చేతిలో బ్యాంక్ బుక్... దేశం చేతిలో సెమీకండక్టర్ చిప్‌! ఎన్నికై ఎక్కువ కాలం పాలించిన ప్రధానిగా రికార్డు సృష్టించిన మోదీపై స్పెషల్ స్టోరీ!
Embed widget