Tips for Better Sleep at Night : రాత్రుళ్లు త్వరగా నిద్రరావట్లేదా? అయితే ఈ టిప్స్‌తో హాయిగా నిద్రపోండి
Develop a Sleep Routine : వివిధ కారణాల వల్ల కొందరు నిద్రకి దూరమవుతారు. కానీ కొన్ని టిప్స్‌ని రెగ్యూలర్‌గా ఫాలో అవ్వడం వల్ల నిద్ర సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు. అవేంటంటే..
Tips to Sleep Better at Night : రాత్రుళ్లు త్వరగా నిద్రపోవాలని ఉన్నా.. నిద్రరాక చాలామంది ఇబ్బంది పడతారు. సరైన నిద్రలేకుంటే డే టైమ్‌లో చేయాల్సిన పనులపై శ్రద్ధ పెట్టలేరు. అంతేకాకుండా శారీరకంగా, మానసికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్ర రాకపోవడానికి పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆరోగ్య సమస్యలు ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే ముందుగా నిద్ర ఏ కారణం వల్ల దూరం అవుతుందో తెలుసుకోవడం చాలా అవసరం. అది కుదరని సమయంలో మీరు నిద్రను కలిగించే అలవాట్లు నేర్చుకోవచ్చు. ఇవి మీకు మంచి నిద్రను అందిస్తాయి. అంతేకాకుండా నిద్రవల్ల కలిగే ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఇంతకీ నిద్ర ప్రేరేపించే చిట్కాలు ఏంటంటే..
తీసుకునే ఫుడ్‌పై జాగ్రత్త వహించాలి
ఆకలితో పడుకుంటే నిద్ర రాదు. వచ్చిన ఎక్కువ సేపు ఉండదు. కాబట్టి కచ్చితంగా ఫుడ్ తీసుకోండి. అయితే ఈ సమయంలో భారీ లేదా స్పైసీ ఫుడ్‌ని తీసుకోకపోవడమే మంచిది. లేదంటే ఇది మీకు అసౌకర్యాన్ని గురి చేస్తుంది. నికోటిన్, కెఫిన్, ఆల్కహాల్ వంటి వాటి జోలికి వెల్లకపోవడమే మంచిది.
శారీరక శ్రమ ఉండాల్సిందే..
వ్యాయామం, లేదా శారీరక శ్రమ కచ్చితంగా ఉండేలా చూడండి. ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉంటే.. కచ్చితంగా చురుకుగా ఉంటారు. వాకింగ్ చేయడం వల్ల కూడా మంచి నిద్ర వస్తుంది. కాబట్టి వివిధ యాప్‌లను ఉపయోగించి మీ వాకింగ్ కౌంట్‌ను ట్రాక్ చేయండి. ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉంచే గేమ్స్ ఆడుకోవచ్చు.
ఒత్తిడిని తగ్గించుకోండి..
ఆందోళన, ఒత్తిడి సమస్యలతో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే నిద్ర సమస్య కూడా వస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా చేయండి. లేదంటే మనసుకు నచ్చిన వ్యక్తితో మాట్లాడండి. దీనివల్ల మీకు స్ట్రెస్ తగ్గుతుంది.
పగటి నిద్రకు నో చెప్పండి
కొందరు డే టైమ్‌లో ఎక్కువగా పడుకుంటారు. ఇది రాత్రి నిద్రను దూరం చేస్తుంది. అంతేకాకుండా మిమ్మల్ని లేజీగా చేస్తుంది. కాబట్టి రాత్రి నిద్రకు ఆటంకంగా లేకుండా పగటి నిద్ర ఉండేలా చూసుకోండి. ఓ అరగంట, లేదా గంటసేపు పడుకోవచ్చు. దానికి మించి పడుకుంటే మీకు రాత్రి నిద్ర దూరమవుతుంది.
షెడ్యూల్ పెట్టుకోండి..
నిద్ర వచ్చినా రాకున్నా.. రెగ్యూలర్‌గా ఓ టైమ్‌కి బెడ్ ఎక్కేయండి. మనిషికి రోజుకి 8 గంటలు నిద్ర అవసరం. కనీసం ఏడు గంటలైన మీరు నిద్రపోయేలా చూసుకోండి. నిద్ర పట్టినా పట్టకున్నా.. ఈ ఏడు లేదా ఎనిమిది గంటలు కచ్చితంగా నిద్రపోయేలా జాగ్రత్తలు తీసుకోండి. కొందరు చేసే మిస్టేక్ ఏంటంటే.. వీకేండ్ సమయాల్లో ఎక్కువగా పడుకుని.. మిగిలిన రోజుల్లో తక్కువ నిద్రపోతారు. అది చాలా మిస్టేక్. అలాగే వారాంతాల్లో కూడా ఎక్కువసేపు పడుకోకుండా ఏడు గంటల షెడ్యూల్ ఫాలో అవ్వాలి. అప్పుడే నిద్ర రెగ్యూలర్ అవుతుంది. పడుకున్న 20 నిమిషాలలోపు నిద్రరాకపోతే.. రూమ్ నుంచి బయకు వచ్చి.. మంచి మ్యూజిక్ వినండి. లేదా బుక్ చదవండి. ఇది మీకు నిద్రను ప్రేరేపిస్తుంది.
ప్రశాంతమైన వాతావరణం..
మీరు పడుకునే గదిలో వాతావరణం మరీ చల్లగా కాకుండా, మరీ వేడిగా కాకుండా ఉండేలా చూసుకోండి. లైట్స్ ఆన్‌లో ఉంటే నిద్రపోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి పడుకునే సమయంలో రూమ్‌లో లైట్స్ డల్‌గా ఉండేలా లేదా పూర్తిగా చీకటిగా ఉండేలా చూసుకోండి. నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే బాడీ రిలాక్స్ అవుతుంది. లేదా మీరు రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా ఫాలో అవ్వొచ్చు.
నిద్రలేకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ వీటిని రెగ్యూలర్‌గా ఫాలో అయితే కచ్చితంగా మీ నిద్ర మెరుగవుతుంది అంటున్నారు నిపుణులు. మరి ఇంకేమి ఆలస్యం మీరు కూడా మంచి నిద్రకోసం ఈ టిప్స్ ఫాలో అయిపోండి.
Also Read : లేట్ నైట్ పడుకుంటున్నారా? అయితే జాగ్రత్త.. అర్థరాత్రి దాటాక నిద్రపోతే అర్థాయుష్షు తప్పదట