News
News
X

Boiled Banana: అరటిపండు ఉడకబెట్టుకుని తింటే ఈ రోగాలన్నీ నయమవుతాయ్

అరటిపండు పచ్చిది కాకుండా ఉడకబెట్టుకుని తింటే పోషకాలు పెరగడమే కాదు ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

FOLLOW US: 
Share:

మీరు అరటి పండు ఎలా తింటున్నారు? అదేం ప్రశ్న తొక్క తీసుకుని తింటామని చెప్తారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ ఊపందుకుంది. అదేంటో తెలుసా..? అరటిపండుని బాగా ఉడకబెట్టుకుని తినడం. అదేమీ కఠినమైన పదార్థం కాదు కదా ఉడకబెట్టడానికి మెత్తగానే ఉంటుంది కదా అని కొందరు అనుకుంటారేమో. కానీ అరటిపండు ఉడకబెట్టుకుని తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెప్తున్నారు. అరటిపండుని దాని తొక్కతో సహా ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడకబెట్టడం వల్ల అవి మరింత మృదువుగా, టీపీగా, క్రీమ్ గా మారిపోతుంది. దాంట్లో పీనట్ బటర్, తేనె, దాల్చిన చెక్క పొడి వంటి వాటిని వేసుకుని తింటే అద్భుతంగా ఉందని చెప్తున్నారు.

అన్నట్టు మీకో విషయం తెలుసా మన దేశంలో తొక్క తీసి అరటి పండు తింటారేమో కానీ వివిధ దేశాలలో తొక్కతో సహా వాటిని ఉడకబెట్టి రకరకాల వంటల్లో వేసుకుంటారు. థాయ్ సంస్కృతిలో ఉడికించిన అరటిపండ్లను మెత్తగా చేసి కొబ్బరి పాలతో కలిపి క్లూయ్ బూట్ చి అనే డెజర్ట్ తయారు చేస్తారు. అది అక్కడ చాలా ఫేమస్. ఇతర ప్రాంతాల్లో ఉడకబెట్టిన అరటిపండ్లను బనానా బ్రెడ్ తయారుచేయడానికి ఉపయోగిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫేమస్. ఉడికించిన అరటిపండు అల్పాహారంగా లేదా డెజర్ట్ గా తీసుకున్నా అందులోని కేలరీల్లో మాత్రం ఎ మాత్రం మార్పు ఉండదు.

పోషకాలు పెరుగుతాయా?

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం అరటిపండుని ఉడకబెట్టడం వల్ల దానిలోని పోషకాల లభ్యత పెరుగుతుంది. అందులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ శరీరానికి మరింత త్వరగా అందుతాయి. ఉడకబెట్టడం వాళ్ళ అందులోని పిండి పదార్థాలు పెరుగుతాయి. శక్తిని అందిస్తుంది. అంతే కాదు అరటిపండు ఉడకబెట్టింది తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కొందరు నమ్ముతారు. ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీరానికి వెచ్చదనం, విశ్రాంతిని ఇస్తుంది. అదనంగా తీపి తినాలనే కోరికలను తగ్గిస్తుంది.

ఎందుకు ఉడకబెట్టాలి?

అరటిపండ్లు ఉడకబెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే వాటి ఆకృతి, రుచి మారుస్తుంది. మృదువుగా మారిపోతాయి. నమలడం, మింగడం సులభం అవుతుంది. ఉడకబెట్టడం వల్ల వేడి కారణంగా అందులోని సహజ చక్కెరలని విచ్చిన్నం చేస్తుంది. ఇది పచ్చి అరటిపండ్ల కంటే తియ్యగా ఉంటుంది.

ప్రయోజనాలు..

అరటిపండ్లు ఉడకబెట్టడం వల్ల కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే సులభంగా జీర్ణంఅవుతుంది. పచ్చి అరటిపండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొంతమందికి జీర్ణం కావడం కష్టతరం చేస్తుంది. ఉడకబెట్టడం వల్ల ఫైబర్ విచ్చిన్నమవుతుంది.  దీని వల్ల పండులోని పోషకాలను శరీరం సులభంగా గ్రహించేలా చేస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్న వారికి ఇది మరింత సహాయపడుతుంది. చైనీస్ సంప్రదాయ వైద్యంలో ఉడికించిన అరటిపండు మలబద్ధకం  లేదా దగ్గుతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయపడుతుందని నమ్ముతారు. అలాగే ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఉడకబెట్టిన అరటిపండు అతిసారం చికిత్సకి ఉపయోగిస్తారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: జస్ట్ 11 నిమిషాల నడక చాలు మీరు ఎక్కువ కాలం జీవించడానికి

Published at : 04 Mar 2023 12:20 PM (IST) Tags: Constipation Banana Boiled Banana Benefits Of Boiled Banana Health Benefits Of Boiled Banana

సంబంధిత కథనాలు

Healthy Fats: హెల్తీగా ఉండాలంటే ఈ మూడు కొవ్వులున్న ఆహారాలు తీసుకోవాల్సిందే

Healthy Fats: హెల్తీగా ఉండాలంటే ఈ మూడు కొవ్వులున్న ఆహారాలు తీసుకోవాల్సిందే

Egg Freezing: తల్లి కావడానికి ప్రియాంక చోప్రా పాటించిన ‘ఎగ్ ఫ్రీజింగ్’ పద్ధతి గురించి మీకు తెలుసా?

Egg Freezing: తల్లి కావడానికి ప్రియాంక చోప్రా పాటించిన ‘ఎగ్ ఫ్రీజింగ్’ పద్ధతి గురించి మీకు తెలుసా?

ఏడాదిలో 8428 ప్లేట్ల ఆర్డర్‌- ఆశ్చర్యపరుస్తున్న హైదరాబాదీ ఇడ్లీ ప్రేమ

ఏడాదిలో 8428 ప్లేట్ల ఆర్డర్‌- ఆశ్చర్యపరుస్తున్న హైదరాబాదీ ఇడ్లీ ప్రేమ

Heart Health: మీ గుండెని కాపాడుకోవాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే

Heart Health: మీ గుండెని కాపాడుకోవాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే

Summer Drinks: వేసవి తాపాన్ని తగ్గించి మిమ్మల్ని చల్లగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే

Summer Drinks: వేసవి తాపాన్ని తగ్గించి మిమ్మల్ని చల్లగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్