అన్వేషించండి

Ginger: వర్షాకాలంలో అల్లాన్ని పక్కన పెట్టొద్దు.. ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

Ginger health benefits: ఈ వర్షాల్లో రోగాల వ్యాప్తి ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. ఈ సీజన్‌లో మీరు సురక్షితంగా ఉండాలంటే అల్లాన్ని ఈ విధంగా తీసుకోండి.

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల ప్రకృతి వైఫరిత్యాలు ఒక వైపు.. రోగాలు మరోవైపు.. జనజీవినాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లు, రోగాల నుంచి బయటపడాలంటే ఇమ్యునిటీని పెంచే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. 

ఈ వానల్లో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే ఔషదం.. మీ వంటిట్లోనే ఉంది. అదే అల్లం. ఔనండి.. అల్లం ఒక దివ్యౌషదం. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో అల్లం.. చాలా మెరుగ్గా పనిచేస్తుంది. వానల్లో స్వేచ్ఛగా విహరించే బ్యాక్టీరియా, వైరస్‌లు.. ఎక్కువగా బలహీనమైన రోగ నిరోధక శక్తి కలిగిన వ్యక్తులనే టార్గెట్ చేసుకుంటాయి. ఇక దోమలైతే.. డెంగ్యూ, మలేరియా వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. అలాంటి వ్యాధుల నుంచి మనం బయటపడాలి అంటే.. తప్పకుండా అల్లాన్ని మీ మెనులో చేర్చుకోవల్సిందే. 

అల్లం ఎందుకంత ప్రత్యేకం?

వర్షా కాలం వచ్చిందంటే.. వాతావరణంలో అనేక మార్పులు ఏర్పడతాయి. అవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వైరల్ ఫ్లూను ప్రేరేపిస్తాయి. అందుకే, వర్షాకాలంలో ఆరోగ్యంపై తప్పకుండా శ్రద్ధ చూపాలి. అందుకే అందుకే అల్లం వంటి యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం. అల్లంలో ఇంకా విటమిన్-సితోపాటు కొన్ని ఆరోగ్యకరమైన ఖనిజాలు ఉంటాయి. దానివల్ల రోగ నిరోధశక్తి పెరుగుతుంది.

⦿ విటమిన్ సి, ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్‌తో ఇలా ఎన్నో రకాల పోషకాలు అల్లంలో ఉన్నాయి.  
⦿ అల్లంలో జింజెరాల్, షోగోల్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. 
⦿ వాతావరణం ద్వారా వ్యాప్తిచెందే వైరస్‌, బ్యాక్టీరియాలతో కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్లు పోరాడుతాయి. 

ఏ విధంగా తీసుకోవచ్చు

అల్లం తినేయండి అని చెప్పడం ఈజీనే. కానీ, దాన్ని తినాలంటేనే పెద్ద టాస్క్. ఎందుకంటే.. అది చాలా వగరుగా, చేదుగా.. ఘాటుగా ఉంటుంది. చిన్న ముక్క కొరికితేనే నోరంతా ఏదోలా ఉన్నట్లు ఉంటుంది. మరి దాన్ని తినడం ఎలా అని చాలామంది ఆలోచిస్తుంటారు. వారి కోసమే ఈ చిట్కాలు.

⦿ అల్లాన్ని రసంలా చేసుకుని కాస్త తేనేను జోడించి తాగవచ్చు. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే.. తేనెకు బదులు నిమ్మరసం, కాస్త ఉప్పు వేసుకుని తాగండి.
⦿ రసం చేసుకోడానికి టైమ్ లేకపోతే.. అల్లం ముక్కపై కాస్త పసుపు చల్లి, లైటుగా మంటపై కాల్చి తినండి. దానివల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
⦿ అల్లాన్ని టీగా కూడా చేసుకుని తాగవచ్చు. ఉత్తి అల్లాన్ని నీటిలో మరిగించి.. కాస్త చక్కెర వేసుకుని తాగవచ్చు. అలా తాగడం కష్టమైతే పాలు జోడించండి.
⦿ అల్లం టీ కేవలం రోగనిరోధక శక్తికి మాత్రమే కాదు.. బరువును తగ్గించడానికి కూడా దివ్యౌషదంలా పనిచేస్తుంది. 
⦿ అల్లాన్ని ముక్కలుగా చేసుకుని నీటిలో మరిగించి.. కషాయంలా చేసుకుని తాగితే ఇంకా మంచిది. ఫ్లూ లేదా వైరస్‌లను ఇది ఎదుర్కొంటుంది.
⦿ అల్లంలో ఒక చుక్క నీటిని కూడా కలపకుండా షాట్స్‌లా తాగవచ్చు. అది సాధారణం కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది. జ్వరం, గొంతు సమస్యలతో బాధపడేవారికి ఇది బెటర్.
⦿ అల్లం పచ్చిగా తింటే చేదుగానే ఉంటుంది. కానీ, కూరల్లో వేసుకుంటే భలే రుచి వస్తుంది. మంచి వాసన కూడా వస్తుంది. 
⦿ మీకు అల్లాన్ని పచ్చిగా తినడం ఇష్టలేకపోతే కూరల్లో వేసుకుని తీసుకోండి. రుచికి రుచి ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. 
⦿ అల్లం.. ఎప్పుడూ అందుబాటులో దివ్య ఔషదం. కాబట్టి, ఈ సారి కూరగాయలు కొనుగోలు చేయడానికి వెళ్లినప్పుడు. దాన్ని అస్సలు వదలద్దు. 

Also Read : మూర్ఛవస్తే ఫస్ట్ ఎయిడ్ ఇలా చేయండి.. సమస్యను దూరం చేసేందుకు ఈ టిప్స్​ను ఫాలో అయిపోండి


Ginger: వర్షాకాలంలో అల్లాన్ని పక్కన పెట్టొద్దు.. ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Embed widget