అన్వేషించండి

World Brain Day 2024 : మూర్ఛవస్తే ఫస్ట్ ఎయిడ్ ఇలా చేయండి.. సమస్యను దూరం చేసేందుకు ఈ టిప్స్​ను ఫాలో అయిపోండి

Epilepsy Management : వివిధ కారణాల వల్ల కొందరికి మూర్ఛ వస్తూ ఉంటుంది. అసలు ఇది ఎందుకు వస్తుంది? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వస్తే ఎలా దానిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి?

Seizure Controlling Tips : మెదడులో జరిగే మార్పుల వల్ల కొందరు మూర్ఛతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మెదడులో జరిగే కొన్ని చర్యల వల్ల ఇది వస్తుంటుంది. ఈ సమస్య ఉన్నవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ మూర్ఛ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవాలి? మూర్ఛ ఉన్నా సరే కాంప్లికేట్ కాకుండా లైఫ్​ని ఎలా లీడ్​ చేయాలి వంటి చిట్కాలు ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ మెదడు దినోత్సవం 2024 సందర్భంగా.. మూర్ఛను కంట్రోల్ చేసి.. హెల్తీగా ఎలా ఉండొచ్చో.. నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

మూర్ఛ అనేది నాడీ సంబంధిత వ్యాధి. మెదడులో జరిగే పలురకాల స్పైక్​ల కారణంగా ఇది వస్తూ ఉంటుంది. ఇది మనిషి రూపం, ప్రవర్తనలో పలు మార్పులు కలిగిస్తుంది. అయితే అందరిలో ఒకే తరహా లక్షణాలు ఉండవు. కాబట్టి మూర్ఛను బట్టి.. పరిస్థితిని గుర్తించి సకాలంలో చికిత్సను అందించాల్సి ఉంటుంది. అయితే మూర్ఛరకాలను ఎలా అర్థం చేసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మూర్ఛ కంట్రోల్​లో ఉంటుందో చూసేద్దాం. 

మూర్ఛ ఎన్ని రకాలంటే.. 

మూర్ఛ ప్రధానంగా రెండు రకాలు ఉంటుంది. మెదడులోని ఒకే ప్రాంతంలో వచ్చే ఫోకల్​ మూర్చ. మరొకటి మెదడును ప్రభావితం చేసే సాధారణ మూర్ఛ. ఈ రెండింటిలో ప్రతి స్పందనలు వేరుగా ఉంటాయి. కాబట్టి వాటిని గుర్తించి సకాలంలో చికిత్స అందించాలంటున్నారు న్యూరాలజిస్ట్​లు. 

మూర్ఛ లక్షణాలు..

కొందరిలో ముఖ కవలికలు మారుతాయి. వాసన, రుచి భిన్నంగా ఉంటాయట. ఆరా పూర్తిగా డిఫరెంట్​గా మారుతుందని చెప్తున్నారు. అయితే ఎపిలెప్టిక్​ ఫిట్​ వచ్చిన వారిలో అవయవాలు బిగుసుకుపోవడం, దవడ బిగుసుకుపోవడం, నోటి నుంచి నురగలు రావడం, శరీరమంతా కుదుపులు, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ తరహా లక్షణాలు కొన్ని నిమిషాలు ఉంటాయి. అనంతరం వ్యక్తి స్పృహలోకి వస్తాడు. కానీ కాస్త ఒత్తిడికి లోనవుతారు. 

మూర్ఛ వచ్చిన తర్వాత కొన్ని గంటలు తలనొప్పి అధికంగా ఉంటుంది. మూత్రవిసర్జన నియంత్రణలో ఉండదు. దీనివల్ల రోగి తన దుస్తుల్లోనే మూత్రవిసర్జన చేసేస్తారు. ఈ లక్షణాలు సంవత్సరాలు గడిచే కొద్ది మారుతూ ఉంటాయి. అయితే మూర్ఛ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి చికిత్సలు అందించాలి? మూర్చ రాకుండా జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేయాలో ఇప్పుడు చూద్దాం. 

మూర్ఛ వస్తే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

మూర్ఛ వస్తే ముందు కంగారు పడిపోకుండా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే మీరు ఎదుటి వ్యక్తి సాయం చేయగలరు. రోగిని సురక్షితమైన ప్రాంతంలో, గాలి ఆడేలా ఉంచండి. సూటిగా, స్ట్రాంగ్​గా ఉండే వస్తువులను దగ్గర్లో ఉంచకండి. మూర్ఛ సమయం ఎంతసేపు ఉంటుందో గమనించండి. ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉంటే.. వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే.. రోగి కదలికలను కంట్రోల్ చేస్తారు. అలా కాకుండా.. కదలికలు కంట్రోల్ చేయకుండా ఉంచాలంటున్నారు నిపుణులు. 

శ్వాసకు ఇబ్బంది కలుగకుండా.. నోటిలోని ఉమ్ము బయటకు పోయేలా.. పక్కకు పడుకోబెట్టండి. దీనివల్ల నోటిలోని స్రావాలు బయటకుపోతాయి. అనంతరం వారి వీపుపై సున్నితంగా ఒత్తండి. షర్ట్ గానీ వేసుకుంటే పైన బటన్స్ తీసేయండి. శ్వాసకు ఆటంకం లేకుండా చూసుకోవాలి. మూర్ఛ తర్వాత రోగి అలసిపోయి ఉంటారు కాబట్టి.. వారికి వీలైనంత విశ్రాంతినిస్తే మంచిది. 

సమస్యను ఎలా తగ్గించుకోవాలంటే.. 

వైద్యులు ఇచ్చిన మందులను రెగ్యూలర్​గా తీసుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదు. జీవనశైలిలో కూడా మార్పులు చేయాలి. మూర్ఛను ప్రభావితం చేసే అంశాలకు దూరంగా ఉండాలి. ఒత్తిడిని వీలైనంత తగ్గించుకోవాలి. సమతుల్యమైన ఆహారం, రెగ్యూలర్ వ్యాయామం, పుష్కలమైన నిద్ర మూర్ఛ సమస్యను దూరం చేస్తుంది. యోగా, బ్రీతింగ్ వ్యాయామాలు కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తాయి. 

Also Read : బరువు వేగంగా తగ్గాలంటే డైటింగే చేయాల్సిన అవసరం లేదు.. ఈ టిప్స్​తో కూడా బరువు తగ్గొచ్చు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Embed widget