అన్వేషించండి

Effective Weight Loss Strategies : బరువు వేగంగా తగ్గాలంటే డైటింగే చేయాల్సిన అవసరం లేదు.. ఈ టిప్స్​తో కూడా బరువు తగ్గొచ్చు

Natural Weight Loss Methods : చాలామంది డైట్​తో బరువు తగ్గేందుకు చూస్తారు. కానీ కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఎలాంటి డైట్ చేయకుండానే వేగంగా బరువు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటంటే..

Lose Weight without Dieting : కొందరు డైటింగ్ చేస్తూ.. బరువు తగ్గుతూ ఉంటారు. బరువు తగ్గడానికి రకరకాల డైట్​లు ఫాలో అవుతారు. కానీ కొందరికి ఈ డైట్స్ మంచి ఫలితాలు ఇవ్వవు. అలాంటివారు డైట్​లకు ఫుల్ స్టాప్ పెట్టేయాలి. మరికొందరికి డైట్​లు చేయడం కష్టంగా ఉంటుంది. కొన్ని ఫుడ్స్ ఎఫెర్ట్ చేయలేకపోవడం, సమయానుసారంగా కొన్ని ఫుడ్స్ తీసుకోలేకపోవడం వల్ల డైట్​ చేయడం కష్టమవుతుంది. అయితే మీరు నిజంగా బరువు తగ్గాలనుకుంటే డైట్​ చేయాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. 

అవును బరువు తగ్గేందుకు డైట్​ చేయకుండా మంచి ఫలితాలు పొందాలనుకుంటే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు. వీటివల్ల బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయని చెప్తున్నారు. డైటింగ్ లాంటివి చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్య సమస్యలు లభిస్తాయని.. కాబట్టి సులభమైన ఆహార మార్పులతో అధికబరువును తగ్గించవచ్చు అంటున్నారు. దీనితో పాటు లైఫ్​స్టైల్​లో చేసే చిన్ని మార్పులు పెద్ద ప్రయోజనాలు అందిస్తాయంటున్నారు. అవేంటంటే..

శారీరక శ్రమ పెరగాలి..

మెటబాలీజం పెరిగితే.. బరువు కచ్చితంగా తగ్గుతారు. కాబట్టి జీవక్రియను పెంచుకోవడానికి, కేలరీలు కరిగించడానికి రోజూ వ్యాయామం చేయండి. ఏరోబిక్ వ్యాయామాలు, కండరాలను ధృడంగా చేసే ఎక్సర్​సైజ్​లు చేయవచ్చు. ఇవి మెటబాలీజంను పెంచుతాయి. వీటిని రెగ్యూలర్​గా చేస్తే.. మీరు కదలకుండా కూర్చొన్నా.. జీవక్రియ జరిగి.. కేలరీలు బర్న్ అవుతూ ఉంటాయి. 

నీరు తీసుకోకుంటే

శరీరం డీహైడ్రేషన్​కు గురైనా బరువు పెరుగుతారు. ఎందుకంటే ఇది మెటబాలీజంపై వ్యతిరేకంగా ప్రభావాన్ని చూపిస్తుంది. సరైన జీవక్రియ లేకుంటే బరువు తగ్గడం చాలా కష్టమవుతుంది. అందుకే డీహైడ్రేషన్​ లేకుండా రెగ్యూలర్​గా నీటిని తీసుకోవాలి. ఇది శరీరంలోని టాక్సీన్లను కూడా బయటకు పంపి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి వర్షాకాలంలో కూడా నీటిని తాగేందుకు వెనుకాడకూడదు. 

తినేప్పుడు ఈ తప్పులు చేయకూడదు

మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నామనేది బరువు తగ్గడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే ఫుడ్​ తినేప్పుడు టీవీ, సెల్​ఫోన్​ చూస్తూ కాకుండా.. తినేదానిపై దృష్టి పెడుతూ తినాలట. దీనివల్ల ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉండొచ్చు. అంతేకాకుండా ఆహారాన్ని బాగా నమిలి తినాలి. దీనివల్ల తీసుకున్న ఆహారం జీర్ణమై.. కొవ్వుగా మారకుండా శరీరానికి శక్తిని అందిస్తుంది. మసాలాలు, తీపి, కార్బ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉంటూ లిమిటెడ్​గా తీసుకుంటే బరువు తగ్గడం మరింత సులువుగా మారుతుంది. 

డెస్క్ జాబ్​లు చేస్తుంటే..

కొందరు డెస్క్​ జాబ్​లు చేస్తూ ఉంటారు. అలాంటివారికి శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. దీనివల్ల బరువు తగ్గడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఫిజికల్​గా యాక్టివ్​గా ఉండేలా మీ డైలీ షెడ్యూల్ మార్చుకోండి. పని మధ్యలో వాకింగ్​ చేయవచ్చు. కూరగాయలు, ఫ్రూట్స్​ కోసం బైక్​ కాకుండా నడిచి వెళ్లొచ్చు. మెట్లు ఎక్కడం, దిగడం వంటివి చేస్తూ ఉండాలి. ఇంటి పనిని కూడా మీ రోటీన్​లో భాగం చేసుకోవచ్చు. 

నిద్రతో బరువు తగ్గొచ్చు..

నిద్ర బరువును పెంచుతుంది. తగ్గిస్తోంది. అదేంటి అనుకుంటున్నారా? నిద్రలేమితో ఇబ్బంది పడేవారు తొందరగా బరువు పెరుగుతారు. సరైన నిద్రను మెయింటైన్ చేసేవారి బరువు కంట్రోల్​లో ఉంటుంది. కాబట్టి రాత్రి నిద్ర 7 నుంచి 9 గంటలు కచ్చితంగా ఉండేలా చూసుకోండి. నిద్ర సరిపోకపోతే బద్ధకం పెరిగి.. ఏ పనిపై శ్రద్ధ చూపించరు. ఇది కూడా బరువు పెరగడంలో ఓ కారణంగానే చెప్తున్నారు. 

స్ట్రెస్​ తగ్గించుకోవాలట.. 

ఒత్తిడి శారీరకంగానే కాదు.. మానసికంగానూ కూడా కృంగదీస్తుంది. నిద్రను దూరం చేస్తుంది. ఇది క్రమంగా బరువును పెంచేస్తుంది. కాబట్టి వీలైనంతవరకు ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను ఎంచుకోండి. మీ సమస్యలను ఎప్పటికప్పుడూ క్లియర్ చేసుకోండి. పనిని కూడా మీరు వెంటనే పూర్తి చేసుకోగలిగితే.. ఒకేసారి స్ట్రెస్​ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. యోగా, ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్​సైజ్​లు ఒత్తిడిని తగ్గిస్తాయి. 

ఇవేకాకుండా ఆల్కహాల్​కి దూరంగా ఉండడం.. స్మోకింగ్ మానేయడం వల్ల కూడా బరువు తగ్గుతారు. తీసుకునే ఆహారంలో ప్రోటీన్​ ఎక్కువగా ఉండేలా చూసుకోవడం, కూరగాయలను అధికంగా తీసుకోవడం, అన్​ హెల్తీ స్నాక్స్​ని ఫ్రూట్స్​తో రిప్లేస్ చేయడం వంటివి వేగంగా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. 

Also Read : లంచ్ బాక్స్ స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీ.. కుక్కర్​లో టేస్టీగా, ఈజీగా ఇలా చేసేయండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget