Cooking Facts: పాస్తాను నీటితో కడగొచ్చా? మైక్రోవేవ్ ఓవెన్‌లో వంటలు చెయ్యకూడదా? ఏది వాస్తవం, ఏది అపోహ?
వంటకి సంబంధించి బయట జరుగుతున్న వాటిలో ఉన్న కొన్ని అపోహలు వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం..
ఒక్కో రకం వంటకి ఒక్కో ఫార్ములా ఉంటుంది. చెఫ్ లు కొంతమంది వాటిని ఫాలో అవుతుంటారు. కానీ మరికొంతమంది మాత్రం కొత్త పద్ధతులు పాటిస్తుంటారు. వంట పద్ధతుల గురించి చాలా అపోహలు ఉంటాయి. చక్కని రుచికరమైన వంటకాన్ని సిద్ధం చేయడానికి విభిన్న మార్గాలు ఉన్నాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్ ఉంటుంది. మైక్రోవేవ్ ఓవెన్ లో వంట చేస్తే బాగోదని రుచిగా ఉండదని కొంతమంది వాదిస్తారు. కానీ అందులో నిజం లేదు. అలాంటి కొన్ని వంట పద్ధతుల తయారీ గురించి వచ్చే అపోహలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అవి నిజమా వాస్తవమా అనేది తెలియాలంటే ఇది చదవాల్సిందే.
అపోహ: మైక్రోవేవ్ లో చేసిన ఆహారంలో తక్కువ పోషకాలు ఉంటాయి
వాస్తవం: మైక్రోవేవ్ లు చాలా ఉపయోగకరం. వాటిలో వండితే బాగోదని చాలా మంది అనుకుంటారు. కానీ అవి ఆరోగ్యానికి పూర్తిగా హాని చెయ్యవు. మైక్రోవేవ్ లో ఆహారాన్ని ఉడికించినప్పుడు స్టవ్ మీద ఉంచే దాని కంటే తక్కువ సమయంలోనే వేడి అవుతుంది. అందువల్ల మైక్రోవేవ్ లో చేసే ఆహారంలో ముఖ్యమైన పోషకాలు మెరుగ్గా ఉండటానికి సహాయపడతాయని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.
అపోహ: ఉప్పు నీటిని త్వరగా మరిగించగలదు
వాస్తవం: చెఫ్ లు నీటిని వేడి చేసేటప్పుడు అందుకో కొద్దిగా ఉప్పు వేస్తారు. అయితే అది కేవలం రుచిని మార్చడం కోసం మాత్రమే. వాస్తవానికి ఉప్పు వంట సమయాన్ని కూడా పెంచుతుంది. దీన్నే బాయిల్ పాయింట్ ఎలివేషన్ అని పిలుస్తారు.
అపోహ: బాగా శుద్ధి చేసిన మాంసం సురక్షితం
వాస్తవం: మాంసాన్ని బాగా స్టీక్ చేయడం వల్ల సురక్షితంగా ఉంటుందని అనుకుంటారు. కానీ అది మాంసం రుచి, ఆకృతిని నాశనం చేస్తుంది. అంతే కాదు అలా చేయడం వల్ల అందులోని బ్యాక్టీరియా చనిపోతుందని అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. బ్యాక్టీరియాని చంపడానికి కావల్సిందల్లా మాంసాన్ని 65 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర వేడి చేయడమే.
అపోహ: పాస్తాను నీటితో కడగాలి
వాస్తవం: పాస్తా రుచి, ఆకృతిని ఆప్టిమైజ్ చేయడానికి దాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలని చాలా మంది నమ్ముతారు. కానీ అది అవాస్తవం అని తేలింది. పాస్తాను కడగటం అంటే సాస్ అతుక్కోవడానికి సహాయపడే సహజ పిండి పదార్థాన్ని శుభ్రం చేయడమే. అలా చేయడం వల్ల అది తొలగిపోతుంది. పాస్తాని కడిగితే అది వండిన తర్వాత అంత రుచిగా అనిపించదు.
అపోహ: మైదా పిండి నిల్వ ఉన్నా ఏమి కాదు
వాస్తవం: మూసి ఉన్న బ్యాగ్ లేదా డబ్బాలో పిండి నిల్వ చేయడం వల్ల అది బాగుంటుందని అనుకుంటారు. కానీ అది అనుకున్న దానికంటే ఎక్కువ హాని కలిగిస్తుంది. అలా ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన పిండి దాని రుచి, నాణ్యతని కోల్పోతుంది. పిండి నిల్వ ఉండటం వల్ల అది చెడు వాసన రావడం పురుగులు కనిపించడం అనేవి పిండి చెడిపోయింది అనేందుకు సంకేతం. అందుకే పిండి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోకుండా త్వరగా ఉపయోగించుకోవాలి. దాన్ని వండుకునే ముందు బాగుందా లేదా అనేది ఖచ్చితంగా పరిశీలించాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: అమ్మాయిలూ లిప్ స్టిక్స్ వేసుకుంటున్నారా? జర భద్రం, ఇలా మీకు జరగకూడదు!