అన్వేషించండి

Lipsticks: అమ్మాయిలూ లిప్ స్టిక్స్ వేసుకుంటున్నారా? జర భద్రం, ఇలా మీకు జరగకూడదు!

లిప్ స్టిక్ లేకుండా అమ్మాయిలు అసలు బయటకి రారు. అందాన్ని ఇచ్చే లిప్ స్టిక్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

మ్మాయిల పెదవులు అంటే ఎర్రగా ఉండాలని అనుకునే వాళ్ళు ఇంతకుముందు. కానీ ఇప్పుడు వాటిలో కూడా రంగులు వచ్చేశాయి. పెదవులకి అందమైన రంగునిచ్చే లిప్ స్టిక్ అంటే అమ్మాయిలకి విపరీతమైన ఇష్టం. మెరిసే, మాయిశ్చరైజింగ్, మిరుమిట్లు గొలిపే రంగులు వేసి పెదవులు అందంగా కనిపించేలా చేసుకుంటున్నారు. లిప్ స్టిక్ వేసుకోకుండా బయటకి రావడం లేదు. గోళ్ళ రంగులో ఎన్ని షేడ్స్ ఉంటున్నాయో లిప్ స్టిక్ లో కూడా అన్నే రకాల షేడ్స్ కనిపిస్తున్నాయి. అయితే, ఈ లిప్ స్టిక్స్ వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అనేక అధ్యయనాల ప్రకారం లిప్ స్టిక్ లో పెట్రోలియం ఆధారిత ప్రమాదకరమైన రసాయనాల మిశ్రమం ఉందని, వీటి వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని  వెల్లడించాయి. లిప్ స్టిక్స్ వల్ల దగ్గు, కంటి చికాకు, శ్వాస లోపం వంటి తీవ్రమైన సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇందులోని రసాయనాలు పెదవులు తడిపిన ప్రతిసారీ నోటి ద్వారా పొట్టలోకి చేరుకుంటున్నాయి. శరీరంలో చర్మం తర్వాత పెదవులు అత్యంత సున్నితమైన భాగం. వెంట్రుకలు, చెమట గ్రంథులు లేకపోవడం వల్ల అవి ఎటువంటి సహజ రక్షణ లేకుండా ఉంటాయి. అందుకే అవి త్వరగా ఎండిపోవడం, అలర్జీలకి ఎక్కువగా గురవుతాయి.

లిప్ స్టిక్ లో ఉపయోగించే పదార్థాలు ఏంటి?

అధిక రక్తపోటు, గుండె సమస్యలకి కారణమయ్యే హానికరమైన రసాయనం సీసం. ఇది కాకుండా లిప్ స్టిక్‌లో ఇంకా ఏం ఉంటాయో చూడండి.

మిథైల్‌పరాబెన్

మిథైల్‌పరాబెన్ అనేది అనేక ఆహారాలు, ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల్లో సాధారణంగా ఉపయోగించే రసాయనం. ఇది ఫంగల్ దాడుల నుంచి ఉత్పత్తిని రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇది చాలా వేగంగా చర్మంలోకి శోషించబడుతుంది కానీ శరీరంలో నిల్వ ఉండదు. ఈ రసాయనం క్యాన్సర్ కారకమని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఐరోపా దేశాలలో మిథైల్‌పరాబెన్ నిషేధిత పదార్థం. కానీ సౌందర్య సాధనాల డేటాబేస్ ప్రకారం మిథైల్‌పరాబెన్ తక్కువ ప్రమాదం అని పేర్కొంటున్నాయి.

పాలీపరాబెన్

ఇది లిప్ స్టిక్ ని తేమగా, జిడ్డుగా ఉంచేందుకు సహాయపడుతుంది. కానీ ఇది ఎండోక్రైన్ గ్రంథుల పనితీరుకి అంతరాయం కలిగిస్తుందని, తీవ్రమైన అలర్జీలకి కూడా కారణం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. సౌందర్య ఉత్పత్తుల డేటా బెస్ ప్రకారం.. ఇది హై రిస్క్ ప్రొడక్ట్ గా పేర్కొన్నాయి.  

రెటినైల్ పాల్మిటేట్

ఇది యాంటీఆక్సిడెంట్‌గా జోడించబడే సింథటిక్ ప్రిజర్వేటివ్. గర్భిణీ స్త్రీలకి హానికరం. కాస్మోటిక్ జాబితా దీన్ని మోడరేట్ రిస్క్ గా చెప్పుకొస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం దీని వల్ల ఉంది అనేందుకు కూడా ఆధారాలు ఉన్నాయి. రెటీనైల్ సూర్యుని హానికరమైన అతి నీలలోహిత కిరణాలకి గురైనప్పుడు అవి విషపూరితమైన రాడికల్స్ ని ఉత్పత్తి చేస్తాయి. దాని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

రంగులు

మార్కెట్లో లభించే లిప్ స్టిక్ లు అల్యూమినియం, పెట్రోలియం ఉత్పత్తులతో తయారు చేయబడిన సింథటిక్ నకిలీ రంగులతో చేస్తారు. ఇవి శరీరానికి హానికరం. క్యాన్సర్, చర్మ సమస్యలు, అవయవ వైఫల్యానికి కూడా కారణమవుతాయి. కొందరు సహజమైన, సేంద్రీయ లిప్ స్టిక్ ఉత్పత్తులు వినియోగించడానికి ఇష్టపడతారు. రంగు కోసం చాలా మంది బీట్ రూట్ లేదా కోకో వంటి పదార్థాలని ఉపయోగిస్తారు.  

ముఖ్యమైన చిట్కాలు

☀ డార్క్ షేడ్స్ లిప్ స్టిక్స్ ఉపయోగించకపోవడమే ఉత్తమం

☀ లిప్ స్టిక్ రాసుకునే ముందు పెదవులకి నెయ్యి లేదా పెట్రోలియం జెల్లీని రాసుకోవాలి. ఇది దుష్ప్రభావాలని తగ్గిస్తుంది

☀ బ్రాండెడ్ లిప్ స్టిక్స్ ఉపయోగించాలి

☀ లిప్ స్టిక్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ ని తొలగించడానికి చక్కెర లేదా తేనెతో పెదాలని స్క్రబ్ చెయ్యాలి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also read: పాదాలు చల్లగా మారిపోతున్నాయా? ఈ వ్యాధి గురించి తెలుసుకోకపోతే గుండె ప్రమాదంలో పడినట్లే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget