అన్వేషించండి

ఆరోగ్యానికి చుక్కాని, దాల్చిన చెక్క - డయాబెటిస్, గుండె జబ్బులకు ఇదే తగిన మందు!

వేల సంవత్సరాలుగా మసాలా దినుసులు మానవులు ఉఫయోగిస్తున్నారు. వీటిలో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని అందరికీ తెలుసు, అయితే ఆధునిక విజ్ఞానం ఇప్పుడు వాటివల్ల కలిగే లాభాలను నిర్ధారించే పరిశోధనలు చేస్తోంది.

సాలల్లో ఔషధ గుణాలు ఉన్నయి అని అంటారు కానీ వీటిని డాక్టర్లు సిఫారసు చెయ్యరు. కానీ ఒక మసాల సూపర్ మసాలగా యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంది. ఇది ఇన్ఫెక్షన్లు, వైరస్ లు, గుండె జబ్బులు మాత్రమే కాదు క్యాన్సర్ తో పోరాడేందకు కూడా సహాయపడుతుందని పరిశోధనలో తేలింది. ఆ మసాలా మరేదో కాదు దాల్సిన చెక్క. ఇది మనకు సూపర్ మార్కెట్లలో విస్తృతంగా అందుబాటులో ఉంటుంది. అయితే ఇందులో రెండు వెరైటీలు ఉన్నాయి. సిలోన్ సినమన్ దీన్ని అసలు దాల్చిన చెక్కగా చెబుతారు. మరోటి కాషియా సినమన్ ఇది సాధారణంగా దొరికే దాల్చిన చెక్క.

సూపర్ మార్కెట్లో దొరికే దాల్చిన చెక్క రోల్స్ చెట్టు బెరడు అని మీకు తెలుసా? చెట్టు నుంచి వేరుచేసిన తర్వాత ఇవి సహజంగానే గుండ్రగా చుట్ట చుట్టుకుంటాయి. ఈ దాల్చిన చెక్కతో రకరకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. అవేమిటో తెలుసుకుందాం.

  • దాల్చిన చెక్క రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దాల్చిన చెక్క తీసుకోవడం ద్వారా కార్బోహైడ్రేట్ల విచ్చిన్నం చేసే వేగం నెమ్మదిస్తుంది. కనుక పోస్ట్ లంచ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయని 2020 లో ప్రచురించిన అధ్యయనం వివరిస్తుంది. 2022 లో దాల్చిన చెక్క డయాబెటిస్ తో బాధపడుతున్న వారిలో ఇన్సులిన్ మాదిరిగా పనిచేస్తుందని మరో అధ్యయనం నిర్ధారిస్తోంది. టైప్1, టైప్2, గెస్టేషనల్ ఏరకమైన డయాబెటిసలో నైనా ఈ మసాల దినుసు మంచి ఫలితాలను ఇస్తుంది.
  • దాల్చిన చెక్కను తరచుగా తీసుకోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం తగ్గతుంది. ప్రతిరోజూ ముప్పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిందని ఒక అధ్యయనం రుజువు చేసింది. 8 వారాల పాటు క్రమం తప్పకుండా వాడితే బీపీ కూడా తగ్గింది. ఎల్డీఎల్ రక్తనాళాల్లో ప్లేక్ పేరుకునేందుకు కారణం అవుతుంది. ఈ ఎల్డీఎల్ గుండె పోటు, స్ట్రోక్ ప్రమాదానికి కారణం అవుతుంది. బీపీ గుండె, మెదడుకు సంబంధించిన రక్తనాళాల మీద ప్రభావం చూపుతుంది. బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటే ఈ ప్రాణాంతక పరిస్థితుల నుంచి దూరంగా ఉండొచ్చు.
  • అల్జీమర్స్, పార్కిన్సన్ వంటి న్యూరోడీజెనరేటివ్ వ్యాధులకు నాడీ కణాల పనితీరు తగ్గడం వల్ల కొత్త కణాల ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల వస్తాయి. దాల్చిన చెక్కలోని కొన్ని కాంపౌడ్స్ మెదడులో టౌ అనే ప్రొటీన్ ను నిరోధించగలుగుతాయని 2017 లో ఒక అధ్యయనం తెలిపింది. టౌ అనే ప్రొటీన్ అల్జీమర్స్ వ్యాధికి కారణమవుతుంది. ఈ పరిశోధన మనుషుల మీద జరగలేదు. దీన్ని రుజువు చేసేందుకు మరింత విస్తృతమైన పరిశోధన అవసరమవుతుంది.
  • క్యాన్సర్ నివారణ, చికిత్సలో దాల్చిన చెక్క ఎంత వరకు ఉపయుక్తం అనే విషయంలో లాబ్, టెస్ట్ ట్యూబ్ పరిశోధనలు మాత్రమే జరిగాయి. అవి ఆశాజనకంగా ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. దీని నుంచి తీసిన ఎక్స్ ట్రాక్ట్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను, కణితుల్లో నాళాలు ఏర్పడటాన్ని నియంత్రించినట్టు రుజువులు చూపుతున్నారు. జంతువుల మీద పరిశోధనల్లో ఈ ఎక్స్ ట్రాక్ట్స్ కాన్సర్ కణాల మీద విషం మాదిరిగా పనిచేశాయని, వాటిని చంపగలుగుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. మరింత విస్తృత పరిశోధన అవసరం.
  • ఊపిరితిత్తుల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ ను పారద్రోలేందుకు దాల్చిన చెక్క బాగా పనిచేసిందట. లిస్టేరియా, సాల్మోనెల్లా వంటి కొన్ని బ్యాక్టీరియాలను నిరోధించింది కూడా. అంతే కాదు దంతాల్లోని కావెటీలను కూడా నిరోధిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. చిగుళ్ల వ్యాధులు మెదడు, ఊపిరితిత్తులను ప్రశావితం చేసే వ్యాధులకు కారణం కావచ్చని దంతవైద్యులు అంటున్నారు.
  • దోమల వల్ల సంక్రమించే ఇన్ఫ్లూయెంజా, డెంగ్యూ వంటి కొన్న వైరస్ ల నుంచి నిరోధక శక్తిని శరీరానికి అందించడంలో దాల్చిన చెక్క తోడ్పడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.

ఈ ఫలితాలన్నీ కూడా ప్రాథమిక స్థాయిలో నిర్ధారణకు వచ్చాయి. కానీ మరిన్ని పరిశోధనలు సాగాల్సిఉంది. దాల్చిన చెక్కను పరిమితికి మించ కుండా తీసుకోవాలనే సలహా కూడా  నిపుణులు సూచిస్తున్నారు.

Also read : మీకు ఈ మాత్రలు తీసుకొనే అలవాటు ఉందా? ఇక జీవితం మీద ఆశలు వదిలేయాల్సిందే!

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
Embed widget