అన్వేషించండి

Christmas Vacation Ideas for 2023 : క్రిస్మస్​ టూర్​కి వెళ్లాలనుకుంటే.. లాంగ్​ వీకెండ్​లో ఇక్కడికెళ్లిపోండి

Winter Vacation 2023 : క్రిస్మస్ సయమంలో చాలా మంది కొత్త ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. పబ్లిక్ హాలీడేలతో పాటు.. పర్సనల్​గా కూడా లీవ్​ తీసుకుని టూర్స్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది ఫాలో అవ్వండి.

Christmas vacation in India : క్రిస్మస్​ అంటే ఇంట్లో కూర్చొని చేసుకునే పండుగేమి కాదు. నలుగురితో కలిసి సెలబ్రేట్ చేసుకునే పండుగగా చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో పబ్లిక్ హాలీడ్​లు ఉంటాయి. అంతేకాదు క్రిస్మస్ 2023 సమయంలో లాంగ్ వీకెండ్ వచ్చింది. అయితే ఈ సమయంలో మీరు క్రిస్మస్ సెలబ్రేట్​ చేసుకునేందుకు ఇండియాలో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఇక్కడ కొన్ని ప్రాంతాల లిస్ట్ ఉంది. ఇవి క్రిస్మస్​ సమయంలో మీ వెకేషన్​కు మంచి ఎంపిక అవుతుంది. ​

ఇండియాలో వింటర్​లో వెళ్లగలిగే హాలిడే డెస్టినేషన్స్ చాలానే ఉన్నాయి. అయితే క్రిస్మస్ సమయంలో మీ వెకేషన్​ని రెట్టింపు చేసే ప్లేస్​లు మాత్రం కొన్నే ఉన్నాయి. వాటిలో ఏవి మీ బడ్జెట్​కు దగ్గర్లో ఉన్నాయో.. మీ ప్లాన్​కి బాగా సెట్  అవుతాయో ఎంచుకోండి. మీకు, మీ ఫ్యామిలతో, ఫ్రెండ్స్​ వెళ్లగలిగే.. మీకు మంచి అనుభూతినిచ్చే డెస్టినేషన్స్​​లో ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

గోవా

క్రిస్మస్​ సమయంలో మీరు ఇండియాలో వెళ్లగలిగే డెస్టినేషన్​లో ముందుగా ఉండేది గోవా. అక్కడ క్రిస్మస్ డెకరేషన్​లు, బీచ్​లలోని సూర్యకిరణాలు మీ పండుగ వైబ్స్​ని రెట్టింపు చేస్తాయి. బీచ్​పార్టీలు, లైవ్ మ్యూజిక్, ప్రత్యేకమైన క్రిస్మస్, న్యూ ఇయర్ ఈవెంట్స్ మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. ఇక్కడ గోవా చర్చ్​లో మీరు క్రిస్మస్​ వేడుకలను ఎంజాయ్ చేస్తారు. అక్కడ దొరికే క్రిస్మస్ స్వీట్లు, సీఫుడ్ డిలైట్​లు మీకు మంచి విందుగా మారుతాయి. 

సిమ్లా

మంచుతో నిండి ఉండే సిమ్లా అందాలు.. ముఖ్యంగా వింటర్​లో దాని ప్రకృతి అందాలు మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి. క్రిస్మస్​ అంటే వైట్ స్నో, ఎర్రని లైట్స్, పచ్చని చెట్లు. మీరు సిమ్లా వెళ్తే ఇలాంటి అందాలే చూడొచ్చు. మెరిసే లైట్లతో కూడిన వీధులు.. రంగు రంగుల లైట్లు, డెకరేషన్​తో చక్కగా ముస్తాబైన ఇండ్లు మీ మనసును ఆకట్టుకుంటాయి. ఇక్కడ హిల్​ స్టేషన్​లో ఉండే చర్చ్​కు మీరు వెళ్లి.. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనవచ్చు. 

మనాలి..

అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు మనాలి పెట్టింది పేరు. ఇక్కడ మంచుతో కప్పి ఉన్న హడింబా దేవి ఆలయాన్ని మీకు మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. ఇది ప్రశాంతమైన, ఆధ్యాత్మిక అనుభూతిని మీకు అందిస్తుంది. అక్కడ మీరు వివిధ రకాల వంటకాలు ఆస్వాదించవచ్చు. మీకు స్ట్రీట్​ షాపింగ్ అంటే ఇష్టముంటే మీరు కచ్చితంగా ఇక్కడ మంచి షాపింగ్ ఎక్స్​పీరియన్స్ చేయవచ్చు. 

ఉదయ్​పూర్

సిటీ ఆఫ్​ లేక్స్​గా రాజరిక చరిత్ర కలిగి ఉంది ఉదయ్​పూర్. ఇది సాంస్కృతిక ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడ మీరు పిచోలా లేక్​లో పడవ ప్రయాణం చేయవచ్చు. అక్కడి వాస్తు శిల్పకళలు మీకు కనువిందు చేస్తాయి. ముఖ్యంగా పండుగ సీజన్​లో వాటికి చేసే అలంకరణలు మీకు ఎక్స్​ట్రా బోనస్​ అనే చెప్పవచ్చు. సిటీ ప్యాలెస్, జగ్​ మందిర్​తో సహా వివిధ రాజభవనాలు మీకు రాజశోభను అందిస్తాయి. 

కొచ్చి

కేరళలో జరిగే క్రిస్మస్ వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ దాదాపు అందరు క్రిస్మస్ చేసుకుంటారు. ఈ సమయంలో కేరళలోని చర్చిలను అందంగా ముస్తాబు చేస్తారు. ఇక్కడ బోటింగ్ ప్రయాణం మీకు మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. పచ్చని చెట్ల మధ్య మీరు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. 

ఇంకెందుకు ఆలస్యం.. వచ్చే క్రిస్మస్​కి మీరు ఓ ప్రదేశాన్ని సెలక్ట్​ చేసుకుని క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకోండి.

Also Read : బడ్జెట్ ఫ్రెండ్లీ గోవా ట్రిప్.. క్రిస్మస్ సమయంలో వెళ్తే మరీ మంచిది.. ఎందుకంటే?

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan : విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Google Chrome Hidden Tools : Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?

వీడియోలు

Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jana Nayagan : విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Google Chrome Hidden Tools : Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
The Raja Saab OTT : 'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
Embed widget