అన్వేషించండి

Womens Empowerment : 2030 నాటికి 45 శాతం మహిళలు సింగిల్​గా ఉంటారట.. పిల్లలు కూడా ఉండకపోవచ్చు.. కారణమిదే

Womens Lifestyle : 25 నుంచి 44 సంవత్సరాల మధ్య మహిళలు 2030 నాటికి సింగిల్​గా ఉంటారంటూ తాజాగా ఓ అధ్యయనం తెలిపింది. దీనికి గల కారణాలు ఏంటో.. దీనివల్ల నష్టాలున్నాయా వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

Impact of Education on Family Planning : పాత ధోరణులు మారడంతో పాటు.. ఈ మధ్య కాలంలో వ్యక్తిగత అంశాలపై ఎక్కువమంది దృష్టి పెడుతున్నారు. మగవారితో పాటు.. ఆడవారు కూడా వ్యక్తిగత లక్ష్యాలు, కెరీర్​పై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మోర్గాన్ స్టాన్లీ స్టడీ చేసింది. దీనిలో షాకింగ్ విషయాలు వెల్లడించింది. 2030 నాటికి 25 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసుగల మహిళల్లో 45 శాతం మంది సింగిల్​గా, పిల్లలు కూడా లేకుండా ఉంటారని అంచనా వేసి.. అందరినీ విస్మయానికి గురిచేసింది. 

అప్పటికంటే పెరిగింది..

గతంలో కంటే ఈ పర్సెంట్ కాస్త పెరిగింది. 2018లో ఆ వయసులో సింగిల్​గా ఉన్నవారి సంఖ్య 41 శాతంగా ఉంది. పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడం కంటే తమ కెరీర్​లు, వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి పెడుతున్నారని అధ్యయనం తెలిపింది. విద్య, వృత్తి అవకాశాలు కూడా వారికి మంచి కెరీర్​ను మలచుకునేందుకు సహాయం చేస్తున్నాయని తెలిపింది. అంతేకాకుండా సామాజిక నిబంధనలు, అంచనాలతో సహా వివిధ కారణాల వల్ల మహిళలు ఈ నిర్ణయాన్ని ఎక్కువ రెస్పెక్ట్ చేస్తున్నారు. 

షాకింగ్ విషయాలు..

గతంలో మాదిరిగా చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడంలేదు. వివిధ కారణాల వల్ల పిల్లలు పుట్టడం కూడా ఆలస్యమవుతుంది. లేదంటే కొందరు పిల్లలనే వద్దు అనుకుంటున్నారు. ఈ వయసులోపే పిల్లల్ని కనాలనే ఒత్తిడిని తీసుకునేందుకు ఇష్టపడట్లేదు. సెల్ఫ్​ని ముందు పెట్టి.. కెరీర్​లో సక్సెస్​ అయ్యే విధంగా ప్లానింగ్ చేసుకుంటున్నారు. అయితే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అధ్యయనం షాకింగ్ విషయాలు తెలిపింది. 

యాంగ్జైటీ కూడా ఓ కారణమే

సోలో ట్రావెల్, నైట్ లైఫ్, ఫుడ్, స్కిన్ కేర్, బ్యూటీ, రిటైల్ షాపింగ్ పేరుతో సింగిల్​ మహిళలు.. ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసేవారికంటే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారని తాజా అధ్యయనం పేర్కొంది. ఇది ఈ లైఫ్​స్టైల్​ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని కొందరి వాదన. అవివాహిత, సంతానం లేని మహిళల మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం వంటి వాటితో ఎక్కువగా పోరాడాల్సి వస్తుందని సర్వే తేల్చి చెప్పింది. ఓ రకంగా యాంగ్జైటీ వంటి కాంప్లెక్షన్స్​ కూడా ఈ నిర్ణయానికి దారి తీస్తున్నాయని తెలిపింది. 

Dink కల్చర్ కూడా కారణమే..

ఒకప్పటిలాగా ఆడవాళ్లు వంటింటికి, పిల్లలకే పరిమితంగానే ఉండేందుకు ఇష్టపడట్లేదు. ఇప్పుటు తమ జీవితాన్ని వారు అనుభవించడం నేర్చుకుంటున్నారు. తమ శక్తి, యుక్తులను కెరీర్​ గ్రోత్​ కోసం వాడుకుంటున్నారు. పురుషుల మాదిరిగానే.. మహిళలు కూడా అన్ని రంగాల్లో చురుగ్గా ఉంటూ.. తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. గతంలో 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపే వివాహం చేసుకునేవారు. ఇప్పుడు ప్రాధాన్యతలు మారుతున్నాయి. పైగా పిల్లలు లేకపోవడమనేది DINK కల్చర్​లో కూడా భాగమవుతుంది. అందుకే దాదాపు సగం మంది యువతులు వచ్చే ఆరేళ్లల్లో సింగిల్​గా, పిల్లలు లేకుండా ఉంటున్నారని సర్వే తెలిపింది. 

Also Read : భారత్​లోనూ పెరిగిపోతున్న DINK కల్చర్.. పిల్లలు వద్దు, ఆదాయమే ముద్దు అంటోన్న కపుల్స్

విడాకులు కూడా పెరుగుతున్నాయి

సామాజిక, ఆర్థిక కారణాల వల్ల జరిగిన ఈ మార్పు.. ప్రపంచ వ్యాప్తంగా గణనీయమైన మార్పులు తీసుకురానుంది. పెళ్లి చేసుకోకుండా ఉండే ట్రెండ్ పెరుగుతోంది. మగవారిలో కూడా ఈ ఆలోచన ఉంది. అలాగే మహిళల్లో కూడా ఇది పెరుగుతుంది. అందుకే సింగిల్ ఉమెన్స్ సంఖ్య పెరుగుతోంది. అలాగే చిన్నవయసులో పెళ్లి చేసుకున్న మహిళలు విడాకులు తీసుకునే పరిస్థితులు కూడా పెరిగిపోతున్నాయని, అలాగే పెళ్లి చేసుకోకూడదనే స్వతహాగా నిర్ణయం తీసుకుంటున్నారని నివేదిక పేర్కొంది. దీనివల్ల భవిష్యత్తులో మహిళల జీవనశైలిలో, కుటుంబాలపై గణనీయమైన మార్పులు తీసుకువస్తుందని నిపుణులు చెప్తున్నారు. 

Also Read : 15 ఏళ్ల కిడ్స్​లో పెరుగుతోన్న లైంగిక సమస్యలు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న WHO.. కారణమిదే

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
Srisailam Tour Package: కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
New Maruti Suzuki Dzire: మారుతి సుజుకి కొత్త డిజైర్ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
మారుతి సుజుకి కొత్త డిజైర్ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
KTR: కాంగ్రెస్ గ్యారెంటీలపై ఖర్గే వ్యాఖ్యలు - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
కాంగ్రెస్ గ్యారెంటీలపై ఖర్గే వ్యాఖ్యలు - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP DesamEngland Players Not Retained by IPL Franchises | ఇంగ్లండ్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు ఝలక్ | ABP Desamఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
Srisailam Tour Package: కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
New Maruti Suzuki Dzire: మారుతి సుజుకి కొత్త డిజైర్ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
మారుతి సుజుకి కొత్త డిజైర్ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
KTR: కాంగ్రెస్ గ్యారెంటీలపై ఖర్గే వ్యాఖ్యలు - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
కాంగ్రెస్ గ్యారెంటీలపై ఖర్గే వ్యాఖ్యలు - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
Constable Jobs: కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన
కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన
Mount Everest: ఎవరెస్ట్ అధిరోహించిన ఏపీకి చెందిన బీటెక్ స్టూడెంట్
ఎవరెస్ట్ అధిరోహించిన ఏపీకి చెందిన బీటెక్ స్టూడెంట్
Jani Master Diwali Celebration: కుటుంబసభ్యులతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జానీ మాస్టర్, వారికి అసలైన పండుగ
కుటుంబసభ్యులతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జానీ మాస్టర్, వారికి అసలైన పండుగ
Pawan Kalyan: 'యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం' - షర్మిలకు రక్షణ కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం' - షర్మిలకు రక్షణ కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget