By: ABP Desam | Updated at : 07 Dec 2021 06:50 PM (IST)
Representational Image/Pixabay
తన ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లయిపోతుందనే వార్తను ప్రియుడు జీర్ణించుకోలేకపోయాడు. నేరుగా పెళ్లి మండపానికి వచ్చేశాడు. పీటలపై వధువరులు దండలు మార్చుకుంటున్న సమయానికి అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ వెంటనే తనతో తెచ్చుకున్న సింధూరాన్ని తెచ్చి వధువు నుదుటికి పెట్టాడు. అంతే.. ఈ ఊహించని ఘటనకు వధువరుల పెద్దలతోపాటు అతిథులు షాకయ్యారు. వధువు ప్రియుడిని మండపంలోనే కుమ్మేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో బాలీవుడ్ సినిమాకు ఈ మాత్రం తీసిపోదు. మండపంలో దండలు మార్చుకుంటున్న సమయంలో ముఖానికి చున్నీ చుట్టుకున్న వ్యక్తి అకస్మాత్తుగా వచ్చాడు. వధువు.. వరుడి మెడలో వరమాల వేస్తున్న సమయానికి అకస్మాత్తుగా మండపంలోకి వచ్చాడు. వెంటనే సింధూరం పెట్టేశాడు. దీంతో వధువు అక్కడి నుంచి పక్కకు తప్పుకుంది. మండపం వద్ద ఉన్న వధువు కుటుంబ సభ్యులు అతడిపై దాడి చేశారు. ఇంత జరుగుతున్నా.. వరుడిలో మాత్రం ఏ స్పందన కనిపించలేదు. కాసేపు అతడికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తే.. వధువు మాజీ ప్రియుడని తెలిసింది.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజనులు భిన్న స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఒక్కసారి తిరస్కరించిన తర్వాత అతడు బలవంతంగా సింధూరం దిద్దడం ఏమిటని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం డేరింగ్ లవర్ అంటున్నారు. ఈ వీడియో చూసి మీ అభిప్రాయం కూడా చెప్పండి మరి.
In UP's Gorakhpur, a spurned youth gatecrashed an ongoing wedding and applied vermilion to the to-be bride. Families and relatives tried to overpower him resulting in a major ruckus at the venue.@SaumyaShandily3 @anantmsr @vandanaMishraP2 pic.twitter.com/nZPKHl7VVi
— Vivek Pandey | विवेक पांडेय (@VivekPandeygkp) December 7, 2021
శోభనం రోజు వధువు జంప్?: ఇటీవల హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జరిగిన ఘటన కూడా వైరల్‌గా మారింది. ఓ యువతి తల్లిదండ్రులు బెంగళూరుకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయించారు. పెళ్లి చూపులు, నిశ్చితార్థం జరుపుకున్న అనంతరం వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ పాత బస్తీలోని నబీల్ కాలనీలో ఓ ఇంట్లో పెద్దలు వీరు ఇద్దరికీ వివాహం జరిపించారు. అబ్బాయి తరఫు వారు పెళ్లి కూతురికి కానుకల కింద దాదాపు రూ.2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు పెళ్లిలో ఇచ్చారు. పెళ్లి మొత్తం ఘనంగా జరిగింది.
Also Read: ‘ఆత్మహత్య’కు అనుమతి.. నొప్పిలేకుండా చంపే యంత్రానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఈ వివాహ కార్యక్రమం మొత్తం పూర్తయిన తర్వాత శోభనం కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. పెళ్లి కూతురు ఓ పట్టుబట్టింది. తాను అర్జంటుగా బ్యూటీ పార్లర్‌కు వెళ్తానని, అక్కడ ముస్తాబై వస్తానని అడిగింది. పెళ్లి జరిగిన వెంటనే బ్యూటీ పార్లర్‌కు వెళ్లడం ఏంటని పెద్దలు వారించి ఆమెను ఇంట్లోనే ఉంచేశారు. ఆమె ససేమిరా అంటూ బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిందేనని మొండికేసి కూర్చుంది. ఇక చేసేది లేక ఆమెను బ్యూటీ పార్లర్‌కు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో పెళ్లి కూతురి కోసం దగ్గర్లోని బ్యూటీ పార్లర్‌కు వెళ్లి చూశారు. ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, పెళ్లి కుమారుడి తరపు వారు కంగుతిన్నారు. అయితే, ఆమె తన ప్రియుడితో పారిపోయి ఉంటుందని అంతా అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని బాలాపూర్ పోలీసులు వెల్లడించారు.
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి
ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!
Children Health: పిల్లలకి ఫీవర్‌గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయొద్దు
Heatstroke: సమ్మర్ స్ట్రోక్ నుంచి బయటపడాలంటే ఈ ఫుడ్స్ తప్పకుండా మెనూలో చేర్చుకోవాల్సిందే
Skipping Meals: భోజనం మానేస్తున్నారా? దానివల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Pregnant Travel Tips: గర్భిణీలు ప్రయాణాలు చేయొచ్చా? ఒకవేళ చేయాల్సి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
IPL 2023 Final: కప్ ఎవరిదైనా ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు వీరికే - ఇద్దరూ గుజరాత్ ప్లేయర్లే!
RGV: ఎన్టీఆర్‌ను చంపిన వాళ్లే, రక్తం తుడుచుకుని వచ్చి అభిషేకాలు చేస్తున్నారు - ఆర్జీవీ సీరియస్ కామెంట్స్!
NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి