News
News
X

Bitter Gourd: మధుమేహుల కోసం కాకరకాయ పొడి, రుచికి రుచి ఎంతో ఆరోగ్యం

మధుమేహులు ఏం తినాలన్న ఆలోచించాల్సిన పరిస్థితి. అందుకే వారి కోసం కొన్ని ప్రత్యేక వంటకాలున్నాయి.

FOLLOW US: 
 
డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందా, ఒంట్లో ఇల్లు కట్టుకుని కూర్చుంటుంది. ఏం తినాలన్న అందులో చక్కెర ఉందా, కేలరీలెంత అని ఆలోచించుకుని తినాలి. అందుకే డయాబెటిస్ రాకుండానే జాగ్రత్తపడమంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ బారిన పడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మధుమేహులు కాకరకాయను తినవచ్చు. ఎంత తిన్నా కాకర కాయ మేలే చేస్తుంది. ఎన్నో వ్యాధుల నుంచి నయం చేయడంలో కూడా కాకరకాయ ముందుంటుంది. వారి కోసమే ఈ కాకరకాయ పొడి రెసిపీ. దీన్ని ఒకసారి చేసుకుంటే నెల రోజుల పాటూ వాడుకోవచ్చు. భోజనం చేసే ముందు రెండు ముద్దలు ఈ కాకరకాయ పొడితో తింటే ఎంతో ఆరోగ్యం. 

కావాల్సిన పదార్థాలు
కాకరకాయలు - అయిదు (మీడియం సైజువి)
మినపప్పు - రెండు స్పూనులు
శెనగ పప్పు - నాలుగు స్పూనులు
ధనియాలు - మూడు స్పూనులు
ఎండు మిర్చి - ఆరు (స్పైసీగా కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు)
వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది
చింతపండు - చిన్న ఉండ
నూనె - మూడు స్పూనులు
ఉప్పు - రుచికి సరిపడా

తయారీ ఇలా...
1. కాకర కాయల్ని శుభ్రం చేసుకుని సన్నగా,గుండ్రంగా చక్రాల్లా కోసుకోవాలి. 
2. ఇప్పుడు కళాయిలో నూనె వేయాలి. నూనె వేడెక్కాక కాకర కాయ ముక్కల్ని వేసి వేయించాలి. 
3. బాగా వేయిస్తే ముక్కలు బ్రౌను రంగులోకి మారి కాస్త క్రిస్పీగా అవుతాయి. 
4. ఇప్పుడు వాటిని తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. 
5. మరో కళాయిలో మినప్పప్పు, శెనగ పప్పు, ఎండుమిర్చి, ధనియాలు వేసి వేయించాలి. 
6. మిక్సీ గిన్నెలో వేయించిన మసాలాలు, వెల్లుల్లి రెబ్బలు, కాకరకాయ ముక్కలు వేసి, చిన్న చింతపండు, ఉప్పు వేసి పొడిలా చేయాలి. 
7. అంతే కాకర కాయ పొడి సిద్ధమైనట్టే. గాలి చొరబడని డబ్బాలో వేస్తే నెల రోజుల పాటూ పాడవ్వకుండా ఉంటుంది. రోజూ రెండు ముద్దలు కాకరకాయ పొడితో తింటే ఎంతో ఆరోగ్యం. 

కాకరకాయలో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉంవటాయి. వీటితో పాటూ శరీరానికి అత్యవసరమైన ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, మాంగనీస్ కూడా లభిస్తాయి. అందుకే కాకరకాయను తినమని వైద్యులు ప్రత్యేకంగా చెబుతారు. ఎన్నో రోగాలకు కాకరకాయ అడ్డుకట్ట వేయగలదు. డయాబెటిస్ వారికీ చాలా మంచిది. జలుబు, దగ్గు, శ్వాససమస్యలు, ఆస్తమా వంటి వాటికి కూడా కాకరకాయ బాగా పనిచేస్తుంది. 

News Reels

Also read: వెల్లుల్లి కారంతో రోజుకో ముద్ద తిన్నా చాలు, ఎన్ని లాభాలో

Also read: ఘుమఘుమలాడే కసూరీ మేతీ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి

Also read: వంకాయ కూర తింటే అది బాగా పని చేస్తుందట, మీ పిల్లలకు తిరిగే ఉండదు

Also read:

Published at : 20 Mar 2022 12:32 PM (IST) Tags: Telugu vantalu Telugu recipes Food for Diabetes Bitter Gourd powder Karela Powder

సంబంధిత కథనాలు

Dhanurmasam Special Sweet : ఆగ్రా స్వీట్స్‌లా ఉత్తరాంధ్ర బ్రాండ్ ఈ ధనుర్మాసం చిక్కీ - అందరికీ దొరకదు..ఎల్లప్పుడూ ఉండదు ! అందుకే స్పెషల్

Dhanurmasam Special Sweet : ఆగ్రా స్వీట్స్‌లా ఉత్తరాంధ్ర బ్రాండ్ ఈ ధనుర్మాసం చిక్కీ - అందరికీ దొరకదు..ఎల్లప్పుడూ ఉండదు ! అందుకే స్పెషల్

Heart Health: ఈ లక్షణాలు తరచూ కనిపిస్తున్నాయా? గుండె ఆరోగ్యం క్షీణిస్తోందని హెచ్చరికలు అవి

Heart Health: ఈ లక్షణాలు తరచూ కనిపిస్తున్నాయా? గుండె ఆరోగ్యం క్షీణిస్తోందని హెచ్చరికలు అవి

Arthritis: చలికాలంలో ఆర్థరైటిస్ నొప్పులు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? వాటిని తగ్గించుకోవడం ఎలా?

Arthritis: చలికాలంలో ఆర్థరైటిస్ నొప్పులు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? వాటిని తగ్గించుకోవడం ఎలా?

Dengue: డెంగ్యూ నుంచి త్వరగా కోలుకునేలా చేసే సూపర్ ఫ్రూట్స్

Dengue: డెంగ్యూ నుంచి త్వరగా కోలుకునేలా చేసే సూపర్ ఫ్రూట్స్

ఆకలిని పెంచి మధుమేహాన్ని తగ్గించే చిరాత - ఏమిటీ చిరాత? దీని ఎలా తినాలి?

ఆకలిని పెంచి మధుమేహాన్ని తగ్గించే చిరాత - ఏమిటీ చిరాత? దీని ఎలా తినాలి?

టాప్ స్టోరీస్

ప్రజలను సెంటిమెంట్‌తో కొడుతున్న పార్టీలు- ఇది వర్క్ అవుట్ అవుతుందా?

ప్రజలను సెంటిమెంట్‌తో కొడుతున్న పార్టీలు- ఇది వర్క్ అవుట్ అవుతుందా?

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

Vadhandhi Review: వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

Vadhandhi Review: వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

Matti Kusthi Review - 'మట్టి కుస్తీ' రివ్యూ : భార్యాభర్తలు ఇంట్లో కాకుండా మట్టిలో కుస్తీ పోటీకి రెడీ అయితే? 

Matti Kusthi Review - 'మట్టి కుస్తీ' రివ్యూ : భార్యాభర్తలు ఇంట్లో కాకుండా మట్టిలో కుస్తీ పోటీకి రెడీ అయితే?