News
News
X

Crime Thrillers: క్రైమ్ థ్రిల్లర్‌లను ఎక్కువగా చూస్తున్నారా? అయితే మీకు ఇబ్బందులు తప్పవు!

మీరు ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడుతారా? ఓటీటీల్లో గంటల తరబడి వాటిని చూస్తున్నారా? అయితే, మీరు ఈ షాకింగ్ న్యూస్ తెలుసుకోవాల్సిందే!

FOLLOW US: 

గడిచిన కొంత కాలంగా ఓటీటీలు జనాల్లోకి బాగా చొచ్చుకుపోతున్నాయి. ప్రజలు  కూడా సినిమా థియేటర్లకు వెళ్లకుండా, ఓటీటీల్లోనే సినిమాలు, వెబ్ సిరీస్ లు, రకరకాల షోలను చూస్తున్నారు. ఓటీటీ కంటెంట్ లో ఎక్కువగా ప్రేక్షకులు క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడుతున్నారని తాజా స్టడీలో తేలింది. యువత సహా చాలా మంది గంటల తరబడి వాటినే చూస్తున్నారట. ఈ నేపథ్యంలో పలు మానసిక సమస్యలకు గురవుతున్నట్లు వెల్లడైంది. నేర సంబంధ సినిమాలు, కంటెంట్ చూసీ, చూసీ యువత మెదళ్లు విపరీత ఆలోచనలకు దారితీస్తున్నాయట. క్రైమ్ కంటెంట్‌ని ఆస్వాదించే వ్యక్తులు నమ్మశక్యం కాని క్రూరత్వానికి  ఆకర్షితులవుతున్నారట.

క్రూమ్ క్రైమ్ థ్రిల్లర్స్ తో మానసిక సమస్యలు

చీకటి, గగుర్పాటు కలిగించడంతో పాటు కలవరపెట్టే కామెడీ, క్రైమ్ థ్రిల్లర్స్ చూసేందుకు జనాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా మొగ్గు చూపుతున్నారట.  పలు ఓటీటీ  ప్లాట్‌ ఫామ్‌ లు డాక్యుమెంటరీలు, సినిమాలు, వెబ్ సిరీస్‌ ల రూపంలో డార్క్ కంటెంట్‌ ను ప్రేక్షకులకు అందుబాటులో ఉంచుతున్నాయి.  వినియోగదారులు సైతం క్రైమ్ సంబంధ కంటెంట్ పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారట. కొన్ని కల్పిత కథలు,  మరికొన్ని డాక్యుమెంటరీలు. ఇంకొన్ని యథార్థ సంఘటనలతో కూడిన నేర సంబంధ కంటెంట్ ఓటీటీల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కన్వర్సేషన్స్ విత్ ఎ కిల్లర్: ది టెడ్ బండీ టేప్స్, ఢిల్లీ క్రైమ్, హౌస్ ఆఫ్ సీక్రెట్స్, అబ్డక్టెడ్ ఇన్ ప్లెయిన్ సైట్,  మాన్‌స్టర్: ది జెఫ్రీ డహ్మెర్ స్టోరీ లాంటి క్రైమ్ థ్రిల్లర్స్ కు  విపరీతమైన అభిమానులు ఉన్నారు. వీటితో పాటు ఇంకా చాలా క్రైమ్ కంటెంట్ అందుబాటులో ఉంది.  క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ స్టడీ ప్రకారం, నేరపూరిత కంటెంట్ చూడటం అనేది మొదట్లో వినోదం అనిపించినప్పటికీ.. కొంతకాలం తర్వాత వ్యసనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ తర్వాత మానసిక సమస్యలు ఎదుర్కొంటారని తెలిపింది. 

క్రైమ్ థ్రిల్లర్స్ కు ఎందుకు అడిక్ట్ అవుతున్నారు?

News Reels

క్రైమ్ షోలు వాస్తవానికి నేర ప్రవర్తన ధోరణులను సూచించవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కంటెంట్ ప్రజలను ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, అవి దారుణమైన ఆలోచననలు చేసే వ్యక్తుల మనస్సులోకి ఈజీగా ఎక్కుతాయి.  అంతేకాదు.. అలాంటి కంటెంట్‌ ని చూసే వ్యక్తులు క్రూరత్వం పట్ల ఈజీగా ఆకర్షించబడుతారు.  అంతేకాదు.. స్త్రీల పట్ల నీచ స్వభావాన్ని కలిగి ఉంటారని నిపుణులు వెల్లడిస్తున్నారు. వీటి మూలంగా మహిళలు ఎక్కవగా బాధితులుగా మిగిలిపోతున్నారట.   

క్రైమ్ థ్రిల్లర్లను అతిగా చూస్తే ఏం జరుగుతుందంటే?

క్రైమ్ థ్రిల్లర్స్ ను అతిగా చూడ్డం మూలంగా అత్యాచారం, హత్యలపైకి ఆలోచనలు వెళ్తాయట. అదే సమయంలో ఈ నేరాల నుంచి అప్రమత్తంగా ఉండేందుకు సహాయపడతాయట. వీటి ప్రభావం బ్రెయిన్ మీద ఎక్కువగా పడటం మూలంగా  అన్ని సమయాల్లో భయంగా అనిపిస్తుందట. ఇంట్లో ఉన్నా అసురక్షిత భావన కలుగుతుందట. ఆందోళనతో పాటు చిన్నచిన్న విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన కలుగుతుందట. కొన్నిసార్లు సాధారణ పరిస్థితుల్లో కూడా భయంతో నిద్రపోవడం కష్టం అవుతుందట. టెన్షన్ కలుగుతుందట. అశాంతి, గుండె వేగంగా కొట్టుకోవడం,  హైపర్‌ వెంటిలేషన్, నీరసం ఆవహిస్తాయట.

Published at : 28 Sep 2022 05:14 PM (IST) Tags: ott platform watching crime thrillers shocking effect on brain

సంబంధిత కథనాలు

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

నిద్ర రావడం లేదా? ఇలా చేసి చూడండి

నిద్ర రావడం లేదా? ఇలా చేసి చూడండి

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయ ఇదే, కిలో కొనాలంటే ఎంత ఖర్చుపెట్టాలంటే

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయ ఇదే, కిలో కొనాలంటే ఎంత ఖర్చుపెట్టాలంటే

Bruce Lee 1 Inch Punch: బ్రూస్ లీ వన్ ఇంచ్ పంచ్ కు ప్రపంచం ఫిదా, ఈ పంచ్ ప్రత్యేకత ఏంటి? ఎందుకు వరల్డ్ ఫేమస్ అయ్యింది? దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే?

Bruce Lee 1 Inch Punch: బ్రూస్ లీ వన్ ఇంచ్ పంచ్ కు ప్రపంచం ఫిదా, ఈ పంచ్ ప్రత్యేకత ఏంటి? ఎందుకు వరల్డ్ ఫేమస్ అయ్యింది? దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే?

ప్రతిరోజూ చికెన్ తింటున్నారా? ఇలా తింటే ఈ ఇబ్బందులు రావడం ఖాయం

ప్రతిరోజూ చికెన్ తింటున్నారా? ఇలా తింటే ఈ ఇబ్బందులు రావడం ఖాయం

టాప్ స్టోరీస్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

మంత్రి అప్పలరాజుకు అసమ్మతి సెగ, అతడిని ఓడించాలంటూ వైసీపీ నేతల ప్రచారాలు!

మంత్రి అప్పలరాజుకు అసమ్మతి సెగ, అతడిని ఓడించాలంటూ వైసీపీ నేతల ప్రచారాలు!

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్