News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Air Conditioning: వేసవిలో ఏసీ లేకుండానే మీ రూమ్ ఇలా చల్లబరుచుకోవచ్చు

వేసవి వేడి నుంచి ఒక్కసారిగా ఏసీ గదిలోకి వెళ్తే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది కదా. ఏసీ లేకపోయినా కూడ మీ గది చల్లగా ఉంచేందుకు ఇవిగో మార్గాలు.

FOLLOW US: 
Share:

మండే వేసవిలో ఫ్యాన్ వేసుకుంటే నిప్పుల వర్షం కురిసినట్టే ఉంటుంది. ఇంట్లో ఉండాలంటే కొంతమందికి ఏడుపు ఒక్కటే కరువు. కాస్త ఉన్నవాళ్లయితే ఏసీ పెట్టుకుంటారు. ఎయిర్ కండిషనింగ్ గదిని చల్లబరచడానికి అత్యంత సాధరం పద్ధతి. ఎయిర్ కండిషనింగ్ అందుబాటులో లేనప్పుడు మండే వేసవిలో వేడిని చల్లగా ఉండటం కష్టం. అందుకే కూలర్, ఏసీ లేకపోయినా కూడా గది చల్లగా ఉంచేందుకు ఈ చిట్కాలు అనుసరించండి.

వేడి ఉత్పత్తి చేసే ఉపకరణాలు తగ్గించండి

ఓవెన్, స్టవ్, బట్టల డ్రైయార్, డిష్ వాషర్లు వంటి వేడిని ఉత్పత్తి చేసే ఉపకరణాల వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు ఉదయం లేదా సాయంత్రం వాటిని ఉపయోగించాలి. ఎక్కువ వెలుతురు ఇచ్చే బల్బులు బదులు ఎల్ఈడీలు పెట్టుకుంటే మంచిది. ఇవి తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఉష్ణ ఉత్పత్తి, శక్తి వినియోగం రెండింటినీ తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే అవసరం లేనప్పుడు గదిలో లైట్లను ఆఫ్ చేసుకుంటే మంచిది. స్టవ్ వేడి కూడా ఎక్కువగా ఉండి గదిని త్వరగా వెచ్చగా అయ్యేలా చేస్తుంది. అందుకే కిచెన్ లో స్టవ్ వెలిగించినప్పుడు వేడి ఆవిర్లు బయటకి పోయేలాగా ఎగ్జాస్టర్ ఆన్ చేసుకోవడం మంచిది.

కర్టెన్ లు మూసివేసుకోవాలి

పగటి పూట కర్టెన్ మూసివేయడం చేస్తే మంచిది. బ్లాక్ అవుట్ కర్టెన్ లు ఉపయోగించడం వల్ల సూర్యకాంతిని నిరోధించవచ్చు. డార్క్ లేదా బ్లాక్ అవుట్ కర్టెన్లు ముఖ్యంగా ప్రభావవంతంగా ఉంటాయి. ఇవి సూర్యరశ్మిని గ్రహించడం లేదా ప్రతిబింబించే అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ ఇన్సులేషన్ గదిలో మరింత స్థిరమైన ఉష్ణోగ్రతని నిర్వహించడానికి సహాయపడుతుంది. వేడి గదిలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.

విండోస్ తెరవాలి

రాత్రిపూట కిటికీలు తెరవడం ద్వారా చల్లని గాలి గదిలోకి ప్రవేశించి ఇంటి అంతటా వ్యాపిస్తుంది. ఈ సహజ వెంటిలేషన్ ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. హాయిగా నిద్రపోయేందుకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టింస్తుంది. తాజా గాలిని లోపలికి పంపిస్తుంది శీతలీకరణ ప్రభావాన్ని సృష్టిస్తుంది. వంట సమయంలో ఉపకరణాల నుంచి వచ్చే వేడి గాలిని ఇది బయటకి పంపిస్తుంది.

ఈజిప్షియన్ పద్ధతి

దీన్నే ఈజిప్షియన్ కాటన్ షీట్ పద్ధతి అని కూడా పిలుస్తారు. వేసవిలో గదిని చల్లబరిచి సులభమైన తక్కువ ఖర్చుతో కూడుకున్న మార్గం. దీని కోసం కాటన్ షీట్ తీసుకుని చల్లని నీటితో తడి చేయాలి. బెడ్ పై తడిగా ఉన్న షీట్ ని వేసుకోవచ్చు. లేదంటే బెడ్ లేదా ఫ్యాన్ కి సమీపంలో షీట్ ఉంచుకోవాలి. ఇది తడిగా ఉండటం వల్ల వచ్చే గాలి కూడా చల్లగా ఉంటుంది. షీట్ నుంచి తేమ ఆవిరైపోయినప్పుడు చల్లదనం తగ్గిపోతుంది.

కూల్ షవర్

శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి చల్లటి నీటి స్నానం చేయాలి. ఇది చెమటని తగ్గించడంలో సహాయపడుతుంది. వేడి వాతావరణం నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు చల్లటి స్నానం చేయకూడదు. కాసేపు శరీరాన్ని కొద్దిగా చల్లబరిచి ఆ తర్వాత చన్నీటి స్నానం చేయాలి. శరీరానికి వదులుగా ఉండే దుస్తులు ధరిస్తే సౌకర్యవంతంగా ఉంటుంది.

Also Read: ఆరోగ్యకరమైన చర్మం కోసం ఈ ఐదు ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సిందే

Published at : 07 Jun 2023 06:00 AM (IST) Tags: Home Tips Summer Tips Air Conditioning Cooling Your Room Tips Cooling Tips

ఇవి కూడా చూడండి

Alzheimer's:  మీకు అల్జీమర్స్ వస్తుందా - ఈ చిన్న పరీక్షతో గుర్తించొచ్చు!

Alzheimer's: మీకు అల్జీమర్స్ వస్తుందా - ఈ చిన్న పరీక్షతో గుర్తించొచ్చు!

Computer Vision Syndrome: కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారా- ఈ టిప్స్ పాటించండి రిలీఫ్ పొందుతారు

Computer Vision Syndrome: కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారా- ఈ టిప్స్ పాటించండి రిలీఫ్ పొందుతారు

Mineral Water: ఇంట్లోనే ఇలా సింపుల్ గా మినరల్ వాటర్ తయారు చేసేసుకోండి!

Mineral Water: ఇంట్లోనే ఇలా సింపుల్ గా మినరల్ వాటర్ తయారు చేసేసుకోండి!

Fruits: పండ్లు కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!

Fruits: పండ్లు కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!

Garcinia Cambogia: బరువు తగ్గించుకునేందుకు ఈ పండు తినేస్తున్నారా- మరి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసా!

Garcinia Cambogia: బరువు తగ్గించుకునేందుకు ఈ పండు తినేస్తున్నారా-  మరి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసా!

టాప్ స్టోరీస్

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

సిక్కుల కళ్లలో ఆనందం కోసం కెనడా చిక్కుల్లో పడిందా? భారత్‌తో మైత్రిని కాదనుకుని ఉండగలదా?

సిక్కుల కళ్లలో ఆనందం కోసం కెనడా చిక్కుల్లో పడిందా? భారత్‌తో మైత్రిని కాదనుకుని ఉండగలదా?

జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- సభ నుంచి టీడీపీ లీడర్ల సస్పెన్షన్

జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- సభ నుంచి టీడీపీ లీడర్ల సస్పెన్షన్

Women's Reservation Bill: ప్రధానితో మహిళా ఎంపీల ఫొటోలు, స్వీట్లు పంపిణీ

Women's Reservation Bill: ప్రధానితో మహిళా ఎంపీల ఫొటోలు, స్వీట్లు పంపిణీ