Back Fat Reduction : వెన్ను కొవ్వును సులభంగా వదిలించుకోండి.. ఇంట్లోనే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి
Back Fat : చాలామంది బ్యాక్ ఫ్యాట్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. కేవలం చెడు ఆహారం తీసుకోవడం వల్లే వస్తుందని అనుకుంటారు. దీని కారణాలు ఏంటి? ఇంట్లోనే ఎలా తగ్గించుకోవచ్చో చూసేద్దాం.

Easy and Effective Methods to Lose Back Fat : వెన్నులో కొవ్వు లేదా బ్యాక్ ఫ్యాట్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది కేవలం చూడటానికే కాదు.. మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అందుకే బ్యాక్ ఫ్యాట్ తగ్గించుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ సరైన మార్గం పాటించకపోవడం వల్ల తగ్గించుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే బ్యాక్ ఫ్యాట్ అనేది చెడు ఆహారం తీసుకోవడం వల్ల మాత్రమే వస్తుందనుకుంటారు కాబట్టి. కానీ వాస్తవానికి దీని వెనుక మరొక పెద్ద కారణం ఉందంటున్నారు నిపుణులు.
నిపుణుల ప్రకారం బ్యాక్ ఫ్యాట్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే.. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం. రోజంతా కూర్చుని పని చేస్తే, కొంచెం కూడా శారీరక శ్రమ చేయకపోతే.. ఈ బ్యాక్ ఫ్యాట్ చాలా త్వరగా, సులభంగా పేరుకుపోతుందని చెప్తున్నారు. కానీ మంచి విషయం ఏమిటంటే.. దీనిని తగ్గించుకోవడానికి మీరు జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కొన్ని సులభమైన టిప్స్ ఫాలో అవుతూ వెన్ను భాగంలోని మొండి కొవ్వును తగ్గించుకోవచ్చట. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
కార్డియో వ్యాయామాలు
బ్యాక్ ఫ్యాట్ తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం కార్డియో. మీరు దీన్ని ఇంట్లో కూడా సులభంగా చేయవచ్చు. ప్రతిరోజూ వేగంగా నడవడం, పరిగెత్తడం లేదా అక్కడే జాగింగ్ చేయడం వల్ల శరీరంలోని కేలరీలను బర్న్ అవుతాయి. మీకు సైకిల్ ఉంటే సైక్లింగ్ కూడా ఒక అద్భుతమైన ఎంపిక. కార్డియో వ్యాయామం వెన్ను కొవ్వును తగ్గించడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
స్ట్రైంత్ ట్రైనింగ్
బ్యాక్ ఫ్యాట్ తగ్గించడానికి, కండరాలను టోన్ చేయడానికి మీరు స్ట్రైంగ్త్ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా మీరు ఇంట్లోనే పుష్-అప్స్, ప్లాంక్, డంబెల్స్ లేదా నీటి సీసాలతో వ్యాయామం చేయవచ్చు. ఈ వ్యాయామాలు మీ వెన్ను కండరాలను బలపరుస్తాయి. కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ప్రారంభంలో తేలికపాటి వ్యాయామాలు చేయండి. నెమ్మదిగా వాటి సంఖ్యను పెంచండి.
యోగా
మీరు జిమ్‌కు వెళ్లలేకపోతే లేదా భారీ వ్యాయామాలు చేయలేకపోతే.. యోగా కూడా బ్యాక్ ఫ్యాట్ను తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. ముఖ్యంగా భుజంగాసనం, తాడాసనం వంటి సులభమైన యోగాసనాలు మీ వెన్ను కండరాలను బలపరుస్తాయి. కొవ్వును తగ్గిస్తాయి. ఈ యోగాసనాలను ప్రతిరోజూ 15 నుంచి 20 నిమిషాలు చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఆహారంలో మార్పులు
మీరు ఎంత వ్యాయామం చేసినా.. ఆహారం సరిగ్గా లేకపోతే ఫలితాలు నెమ్మదిగా వస్తాయి. బ్యాక్ ఫ్యాట్ను తగ్గించడానికి వేయించిన ఆహారాలు, ఎక్కువ తీపి, జంక్ ఫుడ్లకు దూరంగా ఉండండి. బదులుగా మీ ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ను చేర్చండి. ప్రోటీన్ కండరాలను బలపరుస్తుంది. ఫైబర్ ఎక్కువ కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. ఇది అనవసరమైన కేలరీలను తగ్గిస్తుంది.
ఇవేకాకుండా యాక్టివ్‌గా ఉండడం అలవాటు చేసుకోండి. మెట్లు ఎక్కడం, కొద్దిసేపు నడవడం లేదా ఇంటి పనులు చేయడం వంటివి మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచుతాయి. అలాగే హైడ్రేటెడ్‌గా ఉండడం మరచిపోకండి. నిపుణుల సలహాలు తీసుకుంటే మరింత వేగంగా ఈ బ్యాక్ ఫ్యాట్ తగ్గించుకోగలుగుతారు.






















