Ayurveda Tips : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ ఇవే, పెరుగు నుంచి శనగపిండివరకు.. ఆరోగ్యానికి మంచిది కాదంటోన్న నిపుణులు
Kadhi in Monsoon : ఢిల్లీలోని ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ రీనా శర్మ మాట్లాడుతూ.. వర్షాకాలంలో జీర్ణశక్తి తగ్గుతుంది కాబట్టి కొన్ని ఫుడ్స్ తినొద్దని సూచిస్తున్నారు అవేంటంటే..

Ayurvedic Monsoon Tips : మాన్సూన్లో చినుకులు, చల్లని గాలులు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అయితే ఈ వర్షాకాలంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆయుర్వేదం కూడా ఇదే చెప్తుంది. వర్షాకాలంలో ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలట. వాటిలో కడీ వంటి వంటకాలు కూడా ఉన్నాయి. పెరుగు, శనగపిండితో చేసే దీనిని తినడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుందని.. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు. మరి కడీని ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహారంపై ఎందుకు శ్రద్ధ వహించాలంటే..
ఆయుర్వేదంలో వర్షాకాలంను వర్ష ఋతువు అంటారు. ఈ సమయంలో శరీరంలోని జీర్ణశక్తి బలహీనపడుతుంది. అలాగే ఈ సీజన్‌లో తేమ కారణంగా బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. ఢిల్లీకి చెందిన ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ రీనా శర్మ మాట్లాడుతూ.. "వర్షాకాలంలో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అటువంటి పరిస్థితిలో భారీ, నూనెతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. దానిలో కడీకి దూరంగా ఉండాలని ఆయుర్వేదం సూచిస్తుంది". పెరుగు, శనగపిండితే చేసే ఈ ఫుడ్ జీర్ణమవ్వడం కష్టమని తెలిపారు.
కడీ ఏంటి?
ఆయుర్వేదం ప్రకారం.. కడీని కూరను పెరుగు, శనగపిండి, మసాలా దినుసులతో తయారు చేస్తారు. పెరుగులో శనగపిండి వేసి.. దానిని నీటితో పలుచగా కలిపి.. మసాలాలు వేసి ఉడికిస్తారు. దీనిని అన్నం, రోటీలలో తింటారు. ఇది నోటికి మంచి రుచిని ఇస్తుంది. అయితే ఇది వర్షాకాలంలో తినేందుకు హానికరమైన ఫుడ్ కావచ్చు. దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు ఎందుకు తినకూడదంటే
కడీలో ప్రధానమైనది పెరుగు. దీనిని ఆయుర్వేదంలో చల్లని ఆహారంగా పరిగణిస్తారు. అయితే వర్షాకాలంలో తేమ కారణంగా శరీరంలో కఫ దోషం పెరుగుతుంది. పెరుగు ఈ కఫాన్ని మరింత పెంచుతుంది. దీనివల్ల జలుబు, దగ్గు, సైనస్ వంటి సమస్యలు వస్తాయి. బెంగళూరుకు చెందిన ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ అనిల్ మంగళ్ ప్రకారం.. "వర్షాకాలంలో పెరుగుతో చేసిన ఆహారాలు.. కడీ వంటి వాటిని నివారించండి. ఎందుకంటే ఇవి జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తాయి. కఫాన్ని పెంచుతాయి".
శనగపిండితో వచ్చే సమస్య ఇదే
కడీలో శనగపిండిని కూడా ఉపయోగిస్తారు. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ ఇప్పటికే బలహీనంగా ఉంటుంది. శనగపిండి దానిపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం, కడుపులో భారంగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. సూప్ లేదా కిచిడి వంటి తేలికైన, వేడి ఆహారాలు వర్షాకాలంలో ఉత్తమమైనవిగా చెప్తారు. ఆ సమయంలో శనగపిండితో చేసిన వాటిని నివారించాలి.
మసాలా దినుసులు, నూనె
కర్రీకి తాలింపు వేయడానికి నూనె మరియు ఇంగువ, జీలకర్ర, ఆవాలు వంటి మసాలా దినుసులను ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం.. ఎక్కువ మసాలా దినుసులు, నూనె పిత్త దోషాన్ని పెంచుతాయి. దీనివల్ల అసిడిటీ, గుండెల్లో మంట, చర్మ సమస్యలు వస్తాయి. అందుకే వర్షాకాలంలో తక్కువ మసాలా దినుసులు, తక్కువ నూనెతో చేసిన ఆహారాలు తినాలని సూచిస్తున్నారు నిపుణులు.
బ్యాక్టీరియా ప్రమాదం
వర్షాకాలంలో తేమ కారణంగా పెరుగులో బ్యాక్టీరియా, ఫంగస్ త్వరగా పెరుగుతాయి. కర్రీని సరిగ్గా నిల్వ చేయకపోతే.. ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా ఆహారాన్ని విషం చేయడం లేదా ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది.
కాబట్టి వర్షాకాలంలో పెరుగు, శనగపిండి, మసాల, నూనెకు సంబంధించిన ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ఫుడ్స్ తీసుకుంటే మంచిదని.. ఈ మార్పు వల్ల కడుపులో భారం, గ్యాస్ లేదా అతిసారం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.






















