అన్వేషించండి

Lunch Mistakes : లంచ్ సమయంలో ఈ పొరపాట్లు చేస్తే బరువు పెరిగిపోతారట.. జాగ్రత్త

Lunchtime Errors : మధ్యాహ్న భోజనం సమయంలో బరువు తగ్గాలని చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల ఇంకా బరువు పెరిగిపోతారట. ఇంతకీ ఆ మిస్టేక్స్ ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

Weightloss Tips : బరువు పెరగాలన్నా.. తగ్గాలన్నా భోజనం ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే కొన్నిసార్లు బరువు తగ్గేందుకు భోజనం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. బరువు పెరుగుతూనే ఉంటారు. దానికి భోజనం రీజన్ కాదట. ఆ సమయంలో తెలియకుండా చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల బరువుపెరుగుతారట. ఇలా చేయడం వల్ల హెల్తీ ఫుడ్ తీసుకున్నా.. వ్యాయామం చేస్తున్నా సరే బరువు పెరుగుతారని చెప్తున్నారు. ఇంతకీ భోజన సమయంలో చేయకూడని పనులు ఏంటి?

భోజన సమయంలో జంక్ ఫుడ్స్​ లిమిట్​గా తీసుకున్నా పర్లేదు కానీ.. తెలియకుండా చేసే కొన్ని పనులు వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు. దీనివల్ల బరువు తగ్గడం కష్టంగా మారుతుందని చెప్తున్నారు. ఇంతకీ మధ్యాహ్న భోజనం సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ అలవాట్లు వల్ల బరువు పెరుగుతారో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. 

ప్లేట్​లో అవి కచ్చితంగా ఉండాలి.. 

బరువు తగ్గాలి అనుకున్నప్పుడు మీరు ఏమి తింటున్నారనే దానిపై కచ్చింతగా ఫోకస్ పెట్టాలి. మీ లంచ్ బ్యాలెన్స్డ్​గా ఉండేలా చూసుకోండి. అంటే మీ ప్లేట్​లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ కచ్చితంగా ఉండాలి. కానీ కొందరు కార్బ్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఫైబర్, ప్రోటీన్ కూడా లంచ్​లో ఉండదు. ఆ సమయంలో మీరు తక్కువగా తిన్నా కూడా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్​ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి కాబట్టి.. బరువు తగ్గాలనుకుంటే లంచ్​లో ఇవి కూడా ఉండేలా చూసుకోవాలి. కార్బ్స్ మాత్రమే తీసుకుంటే.. ఆకలి ఎక్కువగా వేసి బరువు ఎక్కువగా పెరిగే అవకాశముంది. 

బయటి ఫుడ్ వద్దు..

చాలామంది మధ్యాహ్న భోజనానికి బయట అలవాటు పడుతున్నారు. బయట ఫుడ్​లో న్యూట్రెంట్స్ ఉండవు. పైగా ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. రుచికోసం వివిధ రకాల కెమికల్స్ వేస్తారు. షుగర్స్ ఎక్కువ ఉంటుంది. ఇవి బరువు పెరిగేలా చేస్తుంది. కుదిరితే ఇంటి ఫుడ్ తినాలి. లేదంటే.. ఫ్రూట్స్, కూరగాయలను హెల్తీ ఆప్షన్​గా పెట్టుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. 

భోజనం మానేస్తారు.. 

బరువు పెరిగిపోతున్నాము.. తగ్గాలి అనే ఉద్దేశంతో చాలామంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఏమిటంటే భోజనం మానేయడం. అయితే భోజనం మానేసే బదులు.. న్యూట్రిషనల్ ఫుడ్​ని శరీరానికి అందిస్తే బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. లేదు బరువు తగ్గాలని ఫుడ్ మానేస్తే మాత్రం బరువును తగ్గించడం కాదు కదా.. మిమ్మల్ని వీక్ చేసి.. మరింత బరువు పెరిగేలా చేస్తుంది. పైగా బ్రేక్​ఫాస్ట్, లంచ్, డిన్నర్​లో ఏది మానేసినా.. దానివల్ల మెటబాలీజం తగ్గిపోతుందట. మెటబాలీజం తగ్గితే.. బరువు పెరుగుతూనే ఉంటారు. 

వాటి వినియోగం వద్దు.. 

సలాడ్స్, ఇతర బేకరి ఫుడ్ ఐటమ్స్​ని లంచ్​గా తీసుకునేప్పుడు డిప్స్, సాస్​లు ఎక్కువగా ఉపయోగిస్తారు. నిజం చెప్పాలంటే.. వీటివల్లే కేలరీలు ఎక్కువైపోతాయట. డిప్స్​లే కదా.. సాసే కదా అనుకుంటే.. దానిని తక్కువగా తీసుకున్న కేలరీలు ఎక్కువ ఉంటాయి. ఇవి బరువు పెరిగేలా చేస్తాయి. కాబట్టి క్రీమ్స్​, డ్రెస్సింగ్స్​కోసం ఉపయోగించే డిప్స్ ఉపయోగించకపోవడమే మంచిది. 

అప్పుడు తినండి.. 

కొందరు ఆకలేస్తున్నా సరే బరువు తగ్గాలని తినడం మానేస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. మీరు తగ్గాలనుకున్నప్పుడు ఆకలి వేస్తున్న సమయంలో కాస్త ఫుడ్ తీసుకుంటే మంచిది. లంచ్ టైమ్​ అయినా.. కాకున్నా ఆకలి వేస్తున్నప్పుడు ఫుడ్​ని లిమిటెడ్​గా, అన్ని న్యూట్రిషన్స్ ఉండేలా చూసుకుని తినాలి. 

చూసేందుకు ఇవి సింపుల్​గా ఉన్నా.. ఈ మిస్టేక్స్ రెగ్యూలర్​గా చేయడం వల్ల బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. మరు నిజంగా బరువు తగ్గాలనుకుంటే వైద్యులు, నిపుణుల సలహా తీసుకుని.. వారి సూచనలకు అనుగుణంగా డైట్​ ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి. 

Also Read : లివర్​ని డీటాక్స్ చేసే ఫుడ్స్ ఇవే.. రెగ్యూలర్​గా తీసుకుంటే మీ కాలేయం సేఫ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Infosys Expansion: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
Anantapur News: ఎవరో పిలిచినట్లుగా వెళ్లి దూకేశాడు  -  ఇలా కూడా ప్రాణం తీసుకుంటారా ?   అనంతపురం విద్యార్థి ఆత్మహత్య వీడియో వైరల్
ఎవరో పిలిచినట్లుగా వెళ్లి దూకేశాడు - ఇలా కూడా ప్రాణం తీసుకుంటారా ? అనంతపురం విద్యార్థి ఆత్మహత్య వీడియో వైరల్
Maoists Death: మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Meerpet Husband Killed Wife  | సైకోలా మారిపోయాడు..భార్యను కిరాతకంగా చంపేశాడు | ABP DesamNara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Infosys Expansion: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
Anantapur News: ఎవరో పిలిచినట్లుగా వెళ్లి దూకేశాడు  -  ఇలా కూడా ప్రాణం తీసుకుంటారా ?   అనంతపురం విద్యార్థి ఆత్మహత్య వీడియో వైరల్
ఎవరో పిలిచినట్లుగా వెళ్లి దూకేశాడు - ఇలా కూడా ప్రాణం తీసుకుంటారా ? అనంతపురం విద్యార్థి ఆత్మహత్య వీడియో వైరల్
Maoists Death: మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
Bihar ACB Raids: ఉండేది అద్దె ఇల్లు - కానీ గోతాల నిండా డబ్బుల కట్టలు - విజిలెన్స్‌కు దొరికిన డీఈవో !
ఉండేది అద్దె ఇల్లు - కానీ గోతాల నిండా డబ్బుల కట్టలు - విజిలెన్స్‌కు దొరికిన డీఈవో !
EPFO: మీ UAN వేరొకరి IDతో లింక్ అయిందా?, దానిని ఇలా డిలీట్‌ చేయండి
మీ UAN వేరొకరి IDతో లింక్ అయిందా?, దానిని ఇలా డిలీట్‌ చేయండి
Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారా? - NRIలకు కష్టాలు తప్పవా!
అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారా? - NRIలకు కష్టాలు తప్పవా!
Meerpet Husband Killed Wife  | సైకోలా మారిపోయాడు..భార్యను కిరాతకంగా చంపేశాడు | ABP Desam
Meerpet Husband Killed Wife | సైకోలా మారిపోయాడు..భార్యను కిరాతకంగా చంపేశాడు | ABP Desam
Embed widget