(Source: ECI/ABP News/ABP Majha)
New study: మనం తినే ఆహారం సరిపోదంట.... మరికొంచెం గట్టిగా తినమంటున్నారు...
పప్పు, కూర, పెరుగు, చపాతీలు, పండ్లు, అన్నం... ఇవే నిత్యం మనదేశంలోని ప్రజలు తినే ఆహారం. వాటి ద్వారా అందే పోషకాలు సరిపోవంటూ ఓ కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది.
మీరు తినే ఆహారం... మీ శరీర అవసరాలను తీరుస్తుందో లేదో ఎప్పుడైనా ఆలోచించారా? రోజు ఏదో ఒక కూరతో లేదా పెరుగుతో తిని సరిపెట్టుకునే వాళ్లు కూడా మన దేశంలో ఎక్కువే. కొంతమంది ఆర్థిక పరిస్థితుల రీత్యా మంచి పౌష్టికాహాహారం తినలేరు. మరికొందరు నిర్లక్ష్యం, ఉద్యోగ పనుల్లో బిజీ వల్ల సమయం లేక ఆహారం పై శ్రద్ధ వహించని వారెందరో. అందుకే తాజాగా చేసి ఓ అధ్యయనంలో సాధారణంగా అందరూ నిత్యం తినే ఇండియన్ డైట్.... వందశాతం పోషకాలను శరీరానికి అందించడం లేదని తేలింది. శరీరానికి అవసరమయ్యే పోషకాలలో కేవలం 70 శాతం మాత్రమే మన రెగ్యులర్ డైట్ ద్వారా అందుతున్నాయట. అందుకే మనల్ని ఇంకాస్త గట్టిగా తినమంటున్నారు.
ఈ అధ్యయనాన్ని సుప్రడిన్ అనే మల్టివిటమిన్లు తయారుచేసే ఓ ఔషధ సంస్థ నిర్వహించింది. ఇండియాలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వైద్యులు, పోషకాహార నిపుణులతో మాట్లాడి అంతిమ అధ్యయన ఫలితాలను అందించింది. ఆ సర్వేలో వైద్యులంతా చెప్పిన విషయం ఒక్కటే... రోజూ ప్రజలు తీసుకునే ఇండియన్ డైట్ శరీర అవసరాలను తీర్చేందుకు సరిపోదని. ఆ లోటును పూడ్చుకోవడానికి కచ్చితంగా మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు వైద్యుల సలహాతో వేసుకోమని చెబుతున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా దాదాపు 220 మంది వైద్యులతో అధ్యయనకర్తలు మాట్లాడారు.
Also Read: Internet Apocalypse: ఇంటర్నెట్ యుగం ముగిసిపోనుందా? సౌర తుపానుతో భారీ డ్యామేజ్!
వెజిటేరియన్లు, నాన్ వెజిటేరియన్లు... ఇద్దరిలోనూ పోషకాల శాతంలో 30 శాతం గ్యాప్ వస్తోందని, 70 శాతం పోషకాలతోనే శరీరం నెట్టుకొస్తోందని తేల్చారు. అంతేకాదు శరీరానికి విటమిన్ బి12, డి3 విటమిన్లు అందడం లేదని, వాటిని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. అసలే కోవిడ్ మహమ్మారి లాంటి అంటువ్యాధులు దాడి చేస్తున్న క్రమంలో శరీరానికి వందశాతం పోషకాలు అందాల్సిన అవసరం ముఖ్యంగా ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కనుక శరీరానికి పూర్తి పోషకాలు అందేలా న్యూట్రిషనిస్టులు సలహాతో మల్టీవిటమిన్లు ట్యాబ్లెట్లు వాడొచ్చని ప్రతి పది మందిలో తొమ్మిది వైద్యులు సూచిస్తున్నట్టు అధ్యయనం తెలిపింది.
గమనిక: పలు అధ్యయనాల, సమాచారం ఆధారంగా మీ అవగాహన కోసం ఈ కథనం అందించాం. వైద్యనిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు సలహా తీసుకోవాలి.
Also read: మహిళలు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి? నెలసరికి ముందా? తరువాతా?
Also read: సంగీతంతో మానసికోల్లాసం... ఒత్తిడి మాయం
Also read: బంగాళాదుంపలతో చేసిన వంటలను రుచి చూసే ఉద్యోగం... జీతం ఎంతంటే...