అన్వేషించండి

Asthma: వర్షాకాలం వచ్చిందంటే ఆస్తమా తీవ్రంగా మారే అవకాశం, రాకుండా ఇలా జాగ్రత్త పడండి

ఆస్తమా ఉన్నవారు వర్షాకాలంలో, చల్లని వాతావరణంలో జాగ్రత్తగా ఉండాలి.

Asthma:  మండే ఎండలను తప్పించుకుని వానాకాలంలో అడుగు పెట్టడం వల్ల వాతావరణం చల్లబడుతుంది. ఆ వాతావరణం శరీరానికి హాయిగా అనిపిస్తుంది. సాయంత్రమైతే వేడి వేడి ఛాయ్‌తో పకోడీ తినాలనిపిస్తుంది. లాంగ్ డ్రైవ్‌కి వెళ్లాలనిపిస్తుంది. కానీ ఆస్తమా ఉన్నవారికి మాత్రం ఈ వాతావరణం చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఊపిరి సరిగా అందక ఎంతో ఇబ్బంది పడతారు. ఆస్తమా ఉన్నవారు వర్షాకాలంలో, వాతావరణం చల్లగా ఉన్న రోజుల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ వాతావరణం ఆస్తమాను తీవ్రంగా మార్చేస్తుంది. అంతేకాదు వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా, వైరస్‌ల ద్వారా సంక్రమించే వ్యాధులు త్వరగా వస్తాయి. కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 

ఆస్తమా అనేది శ్వాసనాళాల వాపు వల్ల వస్తుంది. ఆస్తమా బారిన పడిన రోగులు... గురక, శ్వాస ఆడక పోవడం, ఛాతీ బిగుతుగా పట్టేసినట్టు అనిపించడం, దగ్గు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ లక్షణాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దీనికి చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఆస్తమా ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇది ఎవరికైనా రావచ్చు. వానాకాలంలో వాతావరణం చల్లగా మారుతుంది. దీనివల్ల శరీరంలో హిస్టామిన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది శ్వాసలో గురక వచ్చేలా చేస్తుంది. ఆస్తమా లక్షణాలను ప్రేరేపిస్తుంది. వానాకాలంలో పువ్వులు వికసించడం అధికంగా ఉంటుంది. దీని వల్ల పుప్పొడి గాలిలో అధికంగా చేరుతుంది. గాలి ద్వారా ఆ పుప్పొడి ఆస్తమా ఉన్నవారికి ఎలర్జీగా మారుతుంది. దీనివల్ల ఆస్తమా లక్షణాలు పెరుగుతాయి. వాతావరణంలో తేమ స్థాయిలు కూడా పెరుగుతాయి. దీనివల్ల ఆస్తమా తీవ్రంగా మారే అవకాశం ఉంది. అలాగే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. అలా తక్కువగా ఉంటే వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆస్తమాకు కారణం అవుతుంది.

వానలు పడుతున్నప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఆస్తమా రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేడి వేడి ఆహారాలను, పానీయాలను తరచూ తాగుతూ ఉండాలి. ప్రోటీన్లు అధికంగా ఉండే బ్రౌన్ రైస్, మొలకలు, ఆకుకూరలు, క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, గుడ్లు వంటివి తింటూ ఉండాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆవిరి పీల్చడం ద్వారా శ్వాసనాళాలకు వ్యాకోచించేలా చేయాలి. నూనెలు వంటివి ముఖానికి, తలకు రాసుకోవడం తగ్గించాలి. ఇవి శ్వాసనాళాలకు చికాకును కలిగిస్తాయి. మీరు ఉండే ప్రదేశం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. దుమ్ము ధూళి వంటివి లేకుండా చూసుకోండి. ఎయిర్ కండిషనర్లకు సంబంధించిన ఫిల్టర్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. దిండు కవర్లు, బెడ్ షీట్లను పరిశుభ్రంగా ఉంచుకోండి. అనారోగ్యంగా ఉన్న వారికి దూరంగా ఉండండి. కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో తిరగకండి. ధూమపానం చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళకండి. ఆ పొగ వల్ల ఆస్తమా పెరిగిపోతుంది. పెంపుడు జంతువులకు కూడా దూరంగా ఉండండి.

Also read: డయాబెటిస్ ఉన్న ప్రతి నలుగురిలో ఒకరికి ఈ కంటి సమస్య, దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget