అన్వేషించండి

Mosquito Bite : దోమలు బాగా కుడుతున్నాయా? బ్లడ్ గ్రూప్ వల్ల కాదు, అసలు కారణం వేరే ఉంది!

దోమలు కొంతమందినే ఎందుకు ఎక్కువ కుడతాయని చాలా మంది ఆలోచిస్తారు కదా. దానికి సమాధానం దొరికేసింది.

వర్షాకాలం వచ్చిందంటే దోమలు దండయాత్ర మొదలు పెట్టేస్తాయి. తేమ వాతావరణం వల్ల అవి ఎక్కువగా వేడిని కోరుకుంటాయి. దోమలు కొంతమందినే ఎక్కువ కుట్టేస్తూ ఉంటాయి. మన పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళని కుట్టకుండా మనల్నే కుడుతుంటే.. వీటికి మన రక్తం బాగా రుచిగా ఉందేమో అని అనుకుంటారు. కానీ అవి కేవలం కొంతమందినే ఆకర్షించేందుకు వేరే కారణాలు ఉన్నాయి. శరీర వేడి, వాసనని బట్టి అవి ఎక్కువగా కుట్టేస్తాయి. మీరు కూడా ఇప్పుడు దోమలకి అయస్కాంతంగా మారిపోయారా? అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే చూసేయండి.

దోమలు ఎక్కువగా కొందరినే కుట్టడానికి గల కారణాల మీద ఒక ఇంట్రెస్టింగ్ అధ్యయనం బయటకి వచ్చింది. న్యూయార్క్ లోని రాక్ ఫెల్లర్ విశ్వవిద్యాలయం, మెమోరియల్ స్లోన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్, కవ్లీ న్యూరల్ సిస్టమ్స్ ఇన్‌స్టిట్యూట్, హోవార్డ్ హ్యూస్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌ల పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ఇది. దోమలకి అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తులుగా మారే వారి చర్మంపై అధిక స్థాయిలో కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి దోమలని విపరీతంగా ఆకర్షించుకుంటాయి. ఈ ఆమ్లం మీ శరీరం మీద కూడా ఉంటే జీవితాంతం మీరు దోమల అయస్కాంతంగా మారిపోయినట్టే.

ఈ అధ్యయనం ఎలా చేశారు?

కొంతమందినే దోమలు ఎక్కువగా ఎందుకు కూడతాయో ఈ అధ్యయనం ద్వారా రుజువైంది. అందరినీ కాకుండా నన్నే ఈ దోమలు ఎందుకు కుడుతున్నాయని మనలో చాలా మందికి వచ్చే ప్రశ్న. ఇదే ఈ సరికొత్త అధ్యయనానికి పునాది వేసింది. సుమారు 64 మందిని పరీక్షించిన తర్వాత ఈ నివేదిక రూపొందించారు.

మానవ చర్మ వాసన, దోమల మీద పరిశోధన

ప్రతి ఒక్కరి శరీరానికి ఒక వాసన ఉంటుంది. అది అందరికీ ఒకే విధంగా ఉండదు. అదే దోమలని ఆకర్షించేందుకు కారణం అయింది. ఒక వ్యక్తి శరీర వాసన దోమలని ఆకర్షించడంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఎక్కువ స్థాయిలో కార్బాక్సిలిక్ యాసిడ్ ఉత్పత్తి చేసే చర్మం కలిగిన వ్యక్తులు తక్కువ ఉత్పత్తి చేసే వారి కంటే దోమలను ఎక్కువగా ఆకర్షిస్తున్నారని వారు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులు తమ ప్రత్యేక సువాసన గ్రహించేందుకు ఆరు గంటల పాటు తమ చేతులపై నైలాన్ స్టాకింగ్స్(పల్చని పొర లాంటి తొడుగు) ధరించారు. తర్వాత వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి దోమలు ఉంచిన కంటైనర్లలో వేశారు. ఆ దోమలు ఆ సువాసనకి కదలకుండా అలాగే ఉండిపోయాయి.

జంతువులతో పోల్చినప్పుడు మానవులు అధిక మొత్తంలో కార్బాక్సిలిక్ యాసిడ్‌ను విడుదల చేస్తారు. అందుకే దోమలు మనుషుల్ని ఆకర్షించేందుకు పెద్ద కారణంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఆహారం లేదా అలవాట్లు మారినప్పటికి ఉత్పత్తి చేయబడే కార్బాక్సిలిక్ యాసిడ్ స్థాయిలు మాత్రం మారడం లేదు. అందుకే దోమలు ఇటువంటి వాళ్ళని ఎక్కువగా కరిచేస్తున్నాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు దోమలు కార్బాక్సిలిక్ యాసిడ్‌ను ఎందుకు ఇష్టపడతాయనే దాని గురించి పరిశోధనలు చేస్తున్నారు.

శరీర వాసనే కాదు ఇతర కారణాలు కూడా దోమలు ఆకర్షిస్తాయనే విషయం గురించి కూడా అధ్యయనంలో ప్రస్తావించారు. ఒక అధ్యయనం ప్రకారం మీ బ్లడ్ గ్రూప్ కూడా ఒక కారణమని శాస్తవేత్తలు తేల్చి చెప్పారు. అలాగే శరీరం వాసనతో పాటు రంగు, శరీర వేడి, మద్యం వాసనకి కూడా ఆకర్షితులుగా మారతాయి. చర్మ ఉష్ణోగ్రత ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడే దోమలు కూడతాయి. అధికంగా చేతులు, కాళ్ళపై కుడతాయి. మరి మీరు కూడా దోమల అయస్కాంతం అయితే వాటి నుంచి కాపాడటం కాస్త కష్టమేనండోయ్.   

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: వెల్లుల్లిలో ఎన్ని రంగులు ఉన్నాయో తెలుసా? వాటిలో ఆరోగ్యానికి ఏది మంచిది

టాప్ హెడ్ లైన్స్

Morning vs Evening Workout : జిమ్ ఉదయం చేయాలా? సాయంత్రం చేస్తే బరువు తగ్గుతారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
జిమ్ ఉదయం చేయాలా? సాయంత్రం చేస్తే బరువు తగ్గుతారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
DIY Sandalwood Face Packs : గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
Kidney Problems : ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు
ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు
Coconut Milk : కొబ్బరి పాలు తీసే సరైన పద్ధతి ఇదే.. ప్యాకెట్ పాలకు బదులు ఇంట్లోనే ఇలా చేసుకోండి, ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చంటే
కొబ్బరి పాలు తీసే సరైన పద్ధతి ఇదే.. ప్యాకెట్ పాలకు బదులు ఇంట్లోనే ఇలా చేసుకోండి, ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చంటే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Flight Shutdown: అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
Gautam Gambhir Fire: బ్యాటర్లపై గంభీర్ ఫైర్.. ఆడలేని బంతులంటూ ఏవీ ఉండవంటూ ఘాటు విమర్శలు
బ్యాటర్లపై గంభీర్ ఫైర్.. ఆడలేని బంతులంటూ ఏవీ ఉండవంటూ ఘాటు విమర్శలు
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Bigg Boss Season 10 Today November 13th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Embed widget