అన్వేషించండి

Feeling Sad: దిగులుగా, డిప్రెషన్ లోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుందా? అయితే ఆహారపు అలవాట్లు మార్చేసుకోండి

దిగులుకు, ఆహారపు అలవాట్లకి సంబంధం ఏముంటుందని అనుకుంటారు కానీ నిజానికి ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందని మీకు తెలుసా?

ఆహారానికి, మానసిక పరిస్థితికి మధ్య సంబంధం ఉంటుందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. మనం తీసుకునే ఆహారం మనకి ఆనందం, విచారం, ఒంటరితనం వంటి భావాలని కలిగిస్తుంది. శారీరక ఆరోగ్యం, మానసిక శ్రేయస్సు రెండింటికీ సమతుల్య, పోషకాలతో నిండిన ఆహారం ముఖ్యమని అందుకే నిపుణులు చెబుతుంటారు. కొంతమంది కోపంగా ఉన్నప్పుడు చాక్లెట్స్ తింటారు. అదొక ఫీలింగ్ కోపం తగ్గిపోతుందని. కానీ అవే చాక్లెట్ తలనొప్పిగా ఉన్నప్పుడు తింటే మాత్రం నొప్పి ఎక్కువ అవుతుంది. అందుకే తిండికి, మూడ్ కి మధ్య లింకు ఉంటుంది.

విటమిన్లు, ఖనిజాలు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు వంటి ముఖ్యమైన పోషకాలు లేని ఆహారం తీసుకుంటే సెరోటోనిన్, డోపమైన్ హార్మోన్ల విడుదలకి ఆటంకం కలిగిస్తుంది. ఇది మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ అసమతుల్యతలు తరచుగా విచారం, ఆందోళన, ఒంటరితనం భావాలతో సంబంధం కలిగి ఉంటాయి. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో సహా వివిధ రకాల ఆహారాలు తీసుకుంటేనే మెదడు పనితీరు, మానసిక స్థితి రెండు సరిగా ఉంటాయి.

షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులు

అనారోగ్యకరమైన, చక్కెర లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలు తరచుగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. అధిక మొత్తంలో కేలరీలు తీసుకుంటే మానసిక స్థితిని ప్రభావితం చేయవచ్చు. కార్బోహైడ్రేట్లు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య భోజనం, స్నాక్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. చిరాకు, ఒంటరితనం భావాలు తగ్గిపోతాయి.

గట్- మెదడుకి కనెక్షన్

పొట్టకి, మెదడుకి కనెక్షన్ ఉంటుందని విషయం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే మెదడు చురుకుగా పని చేస్తుంది. సెరోటోనిన్, డోపమైన్ హ్యాపీ హార్మోన్లు. ఇవి మానసిక స్థితి, శ్రేయస్సు మీద గణనీయమైన ప్రభావం చూపుతాయి. ఇది ఆహారం ద్వారా ప్రభావితం అవుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, తక్కువ ఫైబర్ ఆహారాలు పొట్ట ఆరోగ్యానికి భంగం కలిగిస్తాయి. ఇది న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఫైబర్ రిచ్ ఫుడ్స్, ప్రీబయాటిక్స్, ప్రొ బయోటిక్స్ తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు మెదడు హాయిగా తన పని తాను చేసుకుంటుంది.

సోషల్, సైకలాజికల్ అంశాలు

ఇష్టమైన వారితో భోజనం షేర్ చేసుకోవడం, హాయిగా నవ్వుతూ తినడం, తినే ఆహారాన్ని ఆస్వాదించడం మానసిక సంతృప్తిని ఇస్తాయి. అలా కాకుండా ఆహార నియంత్రణ, ఇష్టం లేని ఆహారం కష్టంగా తినడం, ఒంటరిగా భోజనం చేయడం వంటివి చేస్తే డిప్రెషన్ లలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది.

ప్రతి ఒక్క వ్యక్తి ఆహార అవసరాలు ఒకే విధంగా ఉంటాయని చెప్పలేము. ఒక్కొక్కరికీ ఒక్కో విధమైన ప్రాధాన్యతలు ఉంటాయి. వాటికి అణుగుణంగా డైటీషియం చెప్పిన ప్రకారం డైట్ పాటిస్తే ఎటువంటి మానసిక సమస్యలు తలెత్తవు. సంపూర్ణ, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు భావోద్వేగాలని నియంత్రిస్తాయి. శారీరక ఆరోగ్యమే మానసిక శ్రేయస్సుని మెరుగుపరుస్తుంది.

 గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: నిప్పుల మీద కాల్చిన ఆహారం తినడం ఆరోగ్యకరమా? కాదా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Embed widget