Wood Fired Cooking: నిప్పుల మీద కాల్చిన ఆహారం తినడం ఆరోగ్యకరమా? కాదా?
నిప్పుల మీద కాల్చిన ఆహారం పొగ వాసన వస్తుందని రుచిగా ఉండదని చాలా మంది అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే.
ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసుకుని తినే వాళ్ళు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇదే కొనసాగుతుంది. ఇప్పుడు గ్యాస్ స్టవ్, పెద్ద పెద్ద స్ట్రీమర్స్ వచ్చిన తర్వాత నిప్పుల మీద వండే ఆహారాన్ని తగ్గించేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ పాత వంట పద్ధతికి అలవాటు పడుతున్నారు. ప్రముఖ చెఫ్ లు కూడా నిప్పుల మీద కాల్చిన ఆహారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వంటలో కలప వాడకం నాగరికతకు ప్రత్యేకమైన గుర్తింపున్ఇస్తుంది. ఇతర రకాల వంటలతో పోలిస్తే నిప్పుల మీద కాల్చిన ఆహారం నిజానికి చాలా ఆరోగ్యకరమైనది.
కొవ్వు ఉండదు
నిప్పుల మీద కాల్చే ఆహారంలో నూనె, బటర్ వంటి తక్కువ కొవ్వులు అవసరమవుతాయి. అంటే కాల్చిన వంటలో అనారోగ్యకరమైన కేలరీలు సహజంగానే తక్కువగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే బరువు తగ్గేందుకు ప్రయోజనకరంగా ఉంటుంది.
రుచికి రుచి
నిప్పుల మీద కాల్చే ఆహారం ఎప్పుడు ప్రత్యేకమైన స్మోకిఈ ఫ్లేవర్ ని కలిగి ఉంటుంది. కృత్రిమ మసాలాల అవసరాన్ని తగ్గిస్తుంది. సోడియం స్థాయిలని నియంత్రించడంలో సహాయపడుతుంది. మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
హై కుకింగ్ టెంపరేచర్
వుడ్ ఫైర్డ్ ఓవెన్ లు 700 డిగ్రీల ఫారిన్ హీట్(370 డిగ్రీల సెల్సియస్) కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలని వేగంగా చేరుకుంటాయి. ఈ తీవ్రమైన వేడి ఆహారం బయటి పొరని త్వరగా కాలుస్తుంది. రసాలు, పోషకాల్ని లాక్ చేస్తుంది. ఆహారంలో తేమను ఉంచుతుంది. ఇది మరింత రుచిగా, ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది.
వంట సమయం తక్కువ
గ్యాస్ స్టవ్ మీద వంట చేసే సమయం ఎక్కువగా ఉంటుంది. కానీ నిప్పుల మీద వంట అనేది అధిక ఉష్ణోగ్రత కారణంగా వంట వ్యవధిని తగ్గిస్తుంది. తక్కువ సేపటిలో రుచికరమైన ఆహారం రెడీ అవుతుంది. అందులోని పోషకాలు అలాగే ఉంటాయి. ఎక్కువ సేపు ఉడికించడం వల్ల పోషకాలు తగ్గిపోతాయి.
విద్యుత్ లేదా గ్యాస్ వినియోగం లేదు
నిప్పుల మీద చేసే వంట పర్యావరణానికి అనుకులమైంది. దీనికి ఇంధనంగా కలప మాత్రమే ఉపయోగపడుతుంది. చాలా మంది పర్యావరణ వేత్తలు ఈ కాల్చిన ఆహార పద్ధతికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఇది మంచిదని మరికొందరు వాదిస్తున్నారు. విద్యుత్ లేదా గ్యాస్, ఓవెన్ తో పోస్తే శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలికి మేలు చేస్తుంది.
కెమికల్ ఫ్రీ ఫుడ్
నిప్పుల మీద కాల్చిన ఆహారంలో ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఎందుకంటే ఇది సహజమైన కలప ఇచ్చే వేడి ద్వారా ఉడుకుతాయి. అందుకే నిప్పుల మీద కాల్చిన వంటకాలు ఆరోగ్యకరమైన ఎంపిక. ఇవి శుభ్రమైన, రుచికరమైన వంటలుగా పరిగణిస్తారు.
ఆకృతి దెబ్బతినదు
అధిక ఉష్ణోగ్రత వద్ద త్వరగా వంట చేయడం వల్ల ఆహారం ఆకృతి కూడా చెడిపోకుండా ఉంటుంది. కూరగాయలు, మాంసం మృదువుగా ఉండేలా చేస్తుంది. వీటిని తీసుకుంటే సంతృప్తికరమైన భోజనం తీసుకున్నామనే భావన కలుగుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: అద్భుతం, విజయవంతంగా గర్భాశయ మార్పిడి - చరిత్ర సృష్టించిన వైద్యులు