News
News
X

Peroids: పీరియడ్స్ ప్రతి నెలా రావడం లేదా... కారణాలు ఇవి కావచ్చు

స్త్రీలు ఆరోగ్యంగా ఉంటే ప్రతి నెలా పీరియడ్స్ క్రమం తప్పకుండా వచ్చేస్తాయి. అవి రావడం లేదు అంటే సమస్య ఉన్నట్టు గ్రహించాలి.

FOLLOW US: 
Share:

చాలా మంది మహిళలు నెలసరులు సరిగా రాకపోయినా పట్టించుకోరు. ముఖ్యంగా పెళ్లయి, పిల్లలున్న స్త్రీలు ఈ విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తారు. పిల్లలు పుట్టేశారు కదా అన్న ధీమా అది. కానీ నెలసరి క్రమం తప్పితే అది చాలా అనారోగ్యాలకు సూచన. కాబట్టి తేలికగా తీసుకోకూడదు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే తల్లిగా మీ బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించగలరు. 

హార్మోన్స్ సమతుల్యత నెలసరుల్లో ముఖ్యపాత్ర వహిస్తాయి. హార్మోన్స్ సమయానికి విడుదలై ఆ ప్రభావం గర్భశయం మీద పడినప్పుడు ప్రతి నెలా పీరియడ్స్ వస్తాయి. హార్మోన్లలో అసమతుల్యత ఉంటే ఈ ప్రక్రియలో అంతరాయం కలుగుతుంది. ఒక్కోసారి నెలసరి సరిగా రాదు, వచ్చినా అధిక రక్తస్రావం అవుతుంది. అలాగే థైరాయిడ్ హార్మోన్ అధికంగా విడుదలైనా కూడా నెలసరులు తప్పుతాయి. కాబట్టి హార్మోన్ల సమతుల్యత చాలా అవసరం. అందుకే నెలసరుల్లో ఏదైనా తేడాగా అనిపిస్తే హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. లావుగా ఉన్నవారిలో, ఆహారంలో మార్పులు, నిద్రలో మార్పులు జరిగినా కూడా నెలసరులపై ప్రభావం పడుతుంది. అయితే నెలల తరబడి పీరియడ్స్ క్రమం తప్పడం, రాకపోవడం, అధిక రక్తస్రావం కావడం వంటివి కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

గర్భాశయంలో కణితులు ఉన్నా...
ఒక్కోసారి గర్భాశయంలో కణితులు, నీటిబుడగల్లాంటివి ఉన్నా కూడా నెలసరులు రావు. వచ్చినా అధికంగా బ్లీడింగ్ అవుతుంది. ప్రతి నెలా అధిక బ్లీడింగ్ అయినా కూడా తేలికగా తీసుకోరాదు. రక్త హీనత సమస్య ఏర్పడే అవకాశం ఉంది. అధిక రక్తస్రావానికి కారణమేంటో కచ్చితంగా తెలుసుకోవాలి. టెస్టుల్లో కణితులు, నీటిబుడగల్లాంటివి ఉంటే బయటపడతాయి. అవి కరిగేందుకు మందులు ఇస్తారు. వాటి తీవ్రతను బట్టి ఒక్కోసారి లాప్రోస్కోపీ అవసరం పడుతుంది. 

ఒత్తిడి వద్దు
ఆరోగ్యకరమై ఆహారాన్ని తినాలి. పండ్లు, కూరగాయలు అధికంగా తినాలి. ఆహారంలో కార్బోహైడ్రైట్లను తగ్గించి, ప్రోటీన్లు ఎక్కువ తినాలి. రోజూ వ్యాయామాలు చేయాలి. జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధ్యానం చేయాలి. 

Also read: వారానికోరోజు పుట్టగొడుగుల కూర... యాంగ్జయిటీ, డిప్రెషన్‌కు చెక్ పెట్టొచ్చు

Also read: సెలెబ్రిటీ గాసిప్స్ ఇష్టపడేవారికి తెలివి తక్కువగా ఉంటుంది... కొత్త అధ్యయన ఫలితం

Also read:  పంది గుండె మనిషికి ప్రాణం పోసింది, చరిత్రలోనే తొలిసారిగా జంతువు గుండెతో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్

Also read: ఎక్కువ సమయం ఫోన్ చూస్తున్నారా? ఈ రోగాలు తప్పవు

 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.

Published at : 12 Jan 2022 10:18 AM (IST) Tags: Periods పీరియడ్స్ Irreguler Peroids Periods symptoms

సంబంధిత కథనాలు

కడుపులో మంటగా ఉందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో వెంటనే ఉపశమనం

కడుపులో మంటగా ఉందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో వెంటనే ఉపశమనం

Knee Pain: మీలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మోకాళ్ళు అరిగిపోతున్నాయని సంకేతాలు కావొచ్చు

Knee Pain: మీలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మోకాళ్ళు అరిగిపోతున్నాయని సంకేతాలు కావొచ్చు

Hair Conditioner: జుట్టుకి షాంపూ చేసిన ప్రతిసారీ కండిషనర్ పెట్టడం అవసరమా? ప్రయోజనం ఏంటి?

Hair Conditioner: జుట్టుకి షాంపూ చేసిన ప్రతిసారీ కండిషనర్ పెట్టడం అవసరమా? ప్రయోజనం ఏంటి?

Weight Loss: బరువు తగ్గించే ఈ ఐదు ఆహారాలు మీ ఫ్రిజ్‌లో ఎప్పుడూ ఉంచుకోండి

Weight Loss: బరువు తగ్గించే ఈ ఐదు ఆహారాలు మీ ఫ్రిజ్‌లో ఎప్పుడూ ఉంచుకోండి

Diabetes: మధుమేహానికి మెంతులను మించిన పరమౌషధం మరొకటి లేదు

Diabetes: మధుమేహానికి మెంతులను మించిన పరమౌషధం మరొకటి లేదు

టాప్ స్టోరీస్

TS Teachers Transfers : ఉపాధ్యాయ దంపతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, స్పౌజ్ కేటగిరీ బదిలీలకు గ్రీన్ సిగ్నల్

TS Teachers Transfers :  ఉపాధ్యాయ దంపతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్,  స్పౌజ్ కేటగిరీ బదిలీలకు గ్రీన్ సిగ్నల్

Pawan Vs Byreddy : నన్ను ముసలోడ్నంటావా ? కొండారెడ్డి బురుజు వద్ద కుస్తీకొస్తావా ? - పవన్‌కు బైరెడ్డి సవాల్ !

Pawan Vs Byreddy : నన్ను ముసలోడ్నంటావా ? కొండారెడ్డి బురుజు వద్ద కుస్తీకొస్తావా ? - పవన్‌కు బైరెడ్డి సవాల్ !

AP Capital supreme Court : ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ - ఈ సారి శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టుపై...

AP Capital supreme Court : ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ -  ఈ సారి శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టుపై...

Sai Dharam Tej's Satya: రిపబ్లిక్ డే స్పెషల్, సాయి ధరమ్ తేజ్ - కలర్స్ స్వాతి మ్యూజికల్ వీడియో

Sai Dharam Tej's Satya: రిపబ్లిక్ డే స్పెషల్, సాయి ధరమ్ తేజ్ - కలర్స్ స్వాతి మ్యూజికల్ వీడియో