AC Temperature: ఏసీని 24 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో పెడుతున్నారా? అయితే, ముప్పే!

రోజూ ఏసీని ఎంత టెంపరేచర్‌లో పెట్టుకుని నిద్రపోతున్నారు? ఒక వేళ మీరు 24 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో ఏసీని ఉంచుతున్నట్లయితే.. ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి.

FOLLOW US: 

మీ ఇంట్లో ఏసీ ఉందా? అయితే, మీరు ఓ షాకింగ్ విషయం తెలుసుకోవాలి. వేసవి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఏసీ ఉపయోగిస్తారు. మరీ కూల్‌గా కాకపోయినా ఉష్ణోగ్రతలను 24 డిగ్రీల నుంచి 28 డిగ్రీల మధ్య ఉంచుతారు. ఈ ఉష్ణోగ్రతల మధ్య ఏసీని ఉంచడం మంచిదే. తగిన చల్లదనంతోపాటు విద్యుత్ కూడా అదా అవుతుంది. ఈ ఉష్ణోగ్రతల్లో ఏసీని ఉంచితే ముక్కు పట్టేయడం, జలుబు వంటి సమస్యలు కూడా రావు. కానీ, ఓ చిక్కు మాత్రం ఉంది. అదే డెంగ్యూ. అదేంటీ? ఏసీకి, డెంగ్యూకు లింకేంటి అనేగా మీ సందేహం? అయితే మీరు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR-NIMR) జరిపిన పరిశోధనలో ఏం తెలిందో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. 
 
నిపుణుల సమాచారం ప్రకారం.. 24 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతల్లోనే దోమలు ఎక్కువగా బతుకుతాయి. ఈ ఉష్ణోగ్రతల్లోనే ఏడెస్ దోమలు వృద్ధి చెందుతాయి. ఫలితంగా ఏసీ ఉండే గది డెంగ్యూ దోమలకు అడ్డాగా మారుతుంది. డెంగ్యూ, చికున్‌గున్యా వంటి రోగాలు చలికాలంలో మాత్రమే కాదు, ఎండకాలంలో కూడా ఉనికిని చాటుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఏసీలు ఉపయోగించేవారు 24 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో ఏసీని సెట్ చేసుకోవడమే బెటర్ అని అంటున్నారు.

సాధారణ దోమలకు, డెంగ్యూ దోమలకు తేడా ఇదే: వివిధ రకాల వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులతో సంబంధం ఉన్న దోమలు సాధారణ ఉష్ణోగ్రతల్లో సంతానోత్పత్తి చేస్తాయి. డెంగ్యూకు కారణమయ్యే దోమలు మాత్రం కంటైనర్ల(మూసివున్న ప్రాంతాలు లేదా గదులు, ఇళ్లు)లో సంతానోత్పత్తి చేస్తాయి. కంటైనర్ యొక్క ఉష్ణోగ్రత 24-28 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉన్నట్లయితే, డెంగ్యూ వ్యాపించే ఏడిస్ దోమలు వృద్ధి చెందుతాయి.

Also Read: జాగ్రత్త, అంగస్తంభన కోసం ఇలా చేస్తే కళ్లు పోతాయ్! తాజా అధ్యయనం వెల్లడి

కానీ, విద్యుత్ ఆదాకు 24 డిగ్రీలే సరైనది: వేసవిలో వేడి మాత్రమే కాదు.. కరెంటు బిల్లులు కూడా పెరిగిపోతాయి. ఆ సమస్య నుంచి బయటపడాలంటే ఏసీలను 24 డిగ్రీల సెల్సియస్‌లోనే ఉంచాలి. ఏసీల్లో ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ చొప్పున పెంచితే 6 శాతం విద్యుత్తును ఆదా చేయొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చు. జపాన్ వంటి దేశాల్లోని ఏసీల్లో కేవలం 28 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే ఉంటాయి. కానీ, ఇండియాలో మాత్రం 18 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. ఉష్ణోగ్రత తగ్గే కొద్ది విద్యుత్ వినియోగం పెరుగుతుంది. మీరు నివసించే ప్రాంతంలో దోమల బెడద లేనట్లయితే.. ఈ ఫార్ములా ఫాలో అవ్వొచ్చు. దోమలు ఎక్కువగా ఉంటే మాత్రం.. ఏసీని 24 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో పెట్టుకుని సురక్షితంగా ఉండండి.

Also Read: వేసవిలో వెచ్చని కోరికలు, అక్రమ సంబంధాలన్నీ ఈ సీజన్లోనే ఎక్కువట, ఎందుకంటే..

Source: Dr Ramesh C Dhiman, Senior consultant at DST- ICMR center of excellence for climate change and vector-borne diseases at the Indian council of medical research (ICMR-NIMR), Delhi.

Published at : 12 Apr 2022 05:08 PM (IST) Tags: AC temperature AC temperature in summer AC temperature dengue dengue mosquitoes in AC AC temperature tips AC tips AC tips in Summer Summer AC tips

సంబంధిత కథనాలు

Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Dhaniya Powder: ఈ ధనియాల పొడిని అన్నంతో, ఇడ్లీతో తినొచ్చు, ఎలా చేయాలో తెలుసా?

Dhaniya Powder: ఈ ధనియాల పొడిని అన్నంతో, ఇడ్లీతో తినొచ్చు, ఎలా చేయాలో తెలుసా?

Brain Foods: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే బ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ, రోజుకొకటైనా తప్పకుండా తినిపించాల్సిందే

Brain Foods: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే బ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ, రోజుకొకటైనా తప్పకుండా తినిపించాల్సిందే

Sleeping Pills: స్లీపింగ్ పిల్స్ అధికంగా వాడుతున్నారా? వాటి వల్ల కలిగే నష్టాలు ఇవే

Sleeping Pills: స్లీపింగ్ పిల్స్ అధికంగా వాడుతున్నారా? వాటి వల్ల కలిగే నష్టాలు ఇవే

Amazon: ఒక ప్లాస్టిక్ బకెట్ ఇరవై ఆరువేల రూపాయలా? అది కూడా ‘సోల్డ్ అవుట్’

Amazon: ఒక ప్లాస్టిక్ బకెట్ ఇరవై ఆరువేల రూపాయలా? అది కూడా ‘సోల్డ్ అవుట్’

టాప్ స్టోరీస్

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Rajya Sabha Nominations: రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్‌రావు, పార్థసారధి నామినేషన్‌ దాఖలు

Rajya Sabha Nominations: రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్‌రావు, పార్థసారధి నామినేషన్‌ దాఖలు