WCDSCW: వరంగల్ జిల్లాలో మిషన్ కోఆర్డినేటర్, ఎంటీఎస్ ఉద్యోగాలు- అర్హతలివే
వరంగల్‌లోని మహిళలు, పిల్లలు& దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వరంగల్‌లోని మహిళలు, పిల్లలు& దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 04
➥ జిల్లా మిషన్ కోఆర్డినేటర్: 01
అర్హత: సోషల్ సైన్స్/లైఫ్ సైన్స్/న్యూట్రిషన్/మెడిసిన్/హెల్మేనేజ్ మెంట్/సోషల్వర్క్ /రూరల్ మేనేజ్ మెంట్‌లో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
పని అనుభవం: గవర్నమెంట్/నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో కనీసం 3 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం: రూ.38,500.
➥ జెండర్ స్పెషలిస్ట్: 01
అర్హత: సోషల్ వర్క్, సోషల్ సైన్స్ విభాగాలలో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. పీజీ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
పని అనుభవం: గవర్నమెంట్/నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో జెండర్ ఫోకస్ థీమ్స్ పై కనీసం 3 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం: రూ.25000.
➥ ఫైనాన్స్ లిటరసీ స్పెషలిస్ట్: 01
అర్హత: ఎకనామిక్స్ /బ్యాంకింగ్ /సంబంధిత ఇతర విభాగాల్లో డిగ్రీ కలిగి ఉండాలి. పీజీ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
పని అనుభవం: గవర్నమెంట్/నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో ఫైనాన్సియల్ లిటరసీ/ ఫైనాన్సియల్ ఇంక్లుజూన్‌కు సంబంధించిన విషయములో కనీసం 3 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం: రూ.22750.
➥ మల్టీ-పర్పస్ స్టాఫ్: 01
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు పదో తరగతి, 10+2 విధానంలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
జీతం: రూ.15600.
వయోపరిమితి: 1.7.2023 నాటికి 21 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
District Welfare Officer,
Women, Children, Disabled & Senior Citizens Welfare Department,
House No. 6-1-8L,
Opposite Public Garden, Near TTD Kalyana Mandapam,
Hanumakonda.
Also Read:
ఎస్‌బీఐలో 217 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు- వివరాలు ఇలా!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 217 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
రిజర్వ్ బ్యాంకులో 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు, అర్హతలివే!
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 291 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రెండు దశల ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. సరైన అర్హతలున్నవారు మే 9 నుంచి జూన్ 9 మధ్య ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..





















