News
News
వీడియోలు ఆటలు
X

SBI JOBS: ఎస్‌బీఐలో 217 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ పోస్టులు- వివరాలు ఇలా!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 217 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 217.

* స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ పోస్టులు

1. మేనేజర్: 02 పోస్టులు

2. డిప్యూటీ మేనేజర్: 44 పోస్టులు

3. అసిస్టెంట్ మేనేజర్: 136 పోస్టులు

4. అసిస్టెంట్ వీపీ: 19 పోస్టులు

5. సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్: 01 పోస్టు

6. సీనియర్ ఎగ్జిక్యూటివ్: 15 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 31.03.2023 నాటికి పోస్టుని అనుసరించి 31-42 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 29.04.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 19.05.2023. 

➥ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: జూన్ 2023.

Notification 

Website 

Also Read:

షార్‌ శ్రీహరికోటలో 94 టెక్నీషియన్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు- అర్హతలివే!
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ వివిధ కేటగిరీ/ విభాగాల్లో టెక్నీషియన్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్/డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 94 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ/ ఎన్‌టీసీ/ ఎన్‌ఏసీ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

రిజర్వ్ బ్యాంకులో 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు, అర్హతలివే!
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 291 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రెండు దశల ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. సరైన అర్హతలున్నవారు మే 9 నుంచి జూన్ 9 మధ్య ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూలు విడుదల, అడ్మిట్‌కార్డులు అందుబాటులో!
సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్ (జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీకి సంబంధించి వాయిదాపడిన శారీరక సామర్థ్య పరీక్షల (పీఈటీ, పీఎస్‌టీ) తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. మే 1 నుంచి 15 వరకు అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నట్లు తెలిపింది. వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డులను అభ్యర్థలు సీఆర్‌పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా కోరింది. ఫిజికల్ ఈవెంట్లకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు లేనిదే అనుమతి ఉండదు.
అడ్మిట్ కార్డులు, ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 29 Apr 2023 07:09 PM (IST) Tags: State Bank Of India SBI Specialist Cadre Officer Posts SBI Notification SBI SO Recruitment 2023

సంబంధిత కథనాలు

RITES: రైట్స్‌ లిమిటెడ్‌లో 30 సివిల్ ఇంజినీర్‌ పోస్టులు, వివరాలు ఇలా!

RITES: రైట్స్‌ లిమిటెడ్‌లో 30 సివిల్ ఇంజినీర్‌ పోస్టులు, వివరాలు ఇలా!

DRDO Recruitment: హైదరాబాద్‌ డీఆర్‌డీఓ-ఆర్‌సీఐలో 150 అప్రెంటిస్‌ పోస్టులు, అర్హతలివే!

DRDO Recruitment: హైదరాబాద్‌ డీఆర్‌డీఓ-ఆర్‌సీఐలో 150 అప్రెంటిస్‌ పోస్టులు, అర్హతలివే!

Group1: గ్రూప్‌-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!

Group1: గ్రూప్‌-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!

SCR Recruitment: దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!

SCR Recruitment: దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!

ITBP Head Constable Posts: ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!

ITBP Head Constable Posts: ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?