UPSC Mains Result 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్-2023 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 8న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.
Union Public Service Commission Results: సివిల్ సర్వీసెస్ మెయిన్-2023 పరీక్ష ఫలితాలను (UPSC Main Results) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 8న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించి మెయిన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను చూసుకోవచ్చు. కేటగిరిల వారిగా ఫలితాలను విడుదల చేసి, ఎంపికైన వారి హాల్‌టికెట్ నెంబర్లను ప్రకటించింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిని ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ త్వరలోనే వెల్లడించనుంది.
మెయిన్ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్)కు షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరికి ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని యూపీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాతి దశలో ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్)కు హాజరుకావాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో డీటైల్డ్ అప్లికేషన్ ఫాం-2 అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు డిసెంబర్ 15లోగా దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తిచేసిన అభ్యర్థులకే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రతిభ, మెయిన్స్, ప్రిలిమ్స్ మార్కులను బట్టి ఆలిండియా సర్వీసులకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అభ్యర్థులకు ఫలితాలపై ఏమైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు తమను సంప్రదించవచ్చునని యూపీఎస్సీ ప్రకటనలో తెలిపింది. సమాచారం కోసంగానీ, లేదా స్పష్టత కోసం అన్ని వర్కింగ్ డేస్‌లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 011 23385271, 011 23098543, 011 23381125 ల్యాండ్ లైన్ నెంబర్లలో లేదా ఫ్యాక్స్: 011-23387310, 011-23384472 లేదా ఫెసిలిటేషన్ కౌంటర్‌ను లేదా csm-upsc@nic.in ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని యూపీఎస్సీ సూచించింది.
UPSC Civil Services Main Results-2023 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..?
🔰 ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్: https://www.upsc.gov.in ఓపెన్ చెయ్యాలి.
🔰 హోమ్‌పేజ్‌లో కనిపించే 'Written Result - Civil Services (Main) Examination, 2023' ఆప్షన్‌పై క్లిక్ చెయ్యాలి.
🔰 క్లిక్ చేయగానే సివిల్స్ మెయిన్స్ - 2023 ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్ కనిపిస్తుంది.
🔰 సివిల్స్ మెయిన్స్ ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
🔰 మీ పేరును చెక్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నంబర్/ రోల్ నంబర్‌తో చెక్ చేసుకోవాలి.
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 16, 17, 18, 24, 25 తేదీల్లో సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. అంతకుముందు సివిల్ సర్వీసెస్–2022 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 5న ఉదయం పేపర్-1 (జనరల్ స్డడీస్) పరీక్షను యూపీఎస్సీ నిర్వహించింది. ఈ పేపర్–1 ప్రశ్నపత్రంలో 100 ప్రశ్నలు 200 మార్కులకు నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం పేపర్–2(అప్టిట్యూడ్ టెస్ట్–సీశాట్)ను 80 ప్రశ్నలతో 200 మార్కులకు నిర్వహించారు. జులై 12న ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు మొత్తం 11,845 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో తెలంగాణ నుంచి 673 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లో మూడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.
యూపీఎస్‌సీ ఈ ఏడాది 1011 ఖాళీలను ప్రకటించింది. గత ఏడాది కంటే 300 ఎక్కువగా ఉన్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే 2021లో ప్రకటించిన ఖాళీలు చాలా తక్కువ. సివిల్ సర్వీసెస్ పరీక్ష నుంచి రైల్వే సర్వీసెస్‌ను తొలగించడం వల్ల ఇలా ఖాళీల సంఖ్య తగ్గింది. ఈ సంవత్సరం వాస్తవంగా ప్రకటించిన ఖాళీలు 861. ఆ తర్వాత రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌కు చెందిన 150 ఖాళీలను ప్రభుత్వం జోడించడంతో మొత్తం 1011 ఖాళీలు ఏర్పడ్డాయి. గత ఏడాదితో పోలిస్తే ఖాళీలు 42 శాతం పెరిగాయి.