News
News
వీడియోలు ఆటలు
X

UPSC CDS Admit Card: సీడీఎస్-1 ఎగ్జామ్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్! పరీక్ష ఎప్పుడంటే?

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేషన్(1)-2023 పరీక్ష అడ్మిట్‌కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది.

FOLLOW US: 
Share:

➥ పరీక్షరోజు వరకు హాల్‌టికెట్లు అందుబాటులో

➥ ఏప్రిల్ 16న దేశవ్యాప్తంగా పలునగరాల్లో పరీక్ష నిర్వహణ

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేషన్(1)-2023 పరీక్ష అడ్మిట్‌కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. సీడీఎస్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ రిజిస్ట్రేషన్ ఐడీ లేదా రూల్ నెంబరు వివరాలు నమోదుచేసి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టు లేదా మరే ఇతర విధానాల్లోనూ అడ్మిట్‌కార్డు పొందలేరు.

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 16న దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో సీడీఎస్ఈ-1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్షరోజు వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్ పరీక్షకు ఎంపికచేస్తారు. ఇందులోనూ అర్హత పొందినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికచేస్తారు. 

సీడీఎస్ పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 

అభ్యర్థులకు ముఖ్య సూచనలు..

✦ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంట తీసుకెళ్లాలి. వాటిలో ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి తీసుకెళ్లాలి.

✦ పరీక్ష ప్రారంభానికి 10 నిమిషాల ముందు నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. కాబట్టి సాధ్యమైనంత త్వరగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం మంచిది.

✦ హాల్‌టికెట్‌పై ఫోటో సరిగాలేని వారు ఏదైనా ఐడీఫ్రూఫ్‌తో పాటు మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది.

✦ హాల్‌టికెట్ల విషయంలో ఏమైనా సందేహాలుంటే ఏప్రిల్ 7లోగా ఈమెయిల్: skindo-upsc@gov.in చిరునామాకు మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

✦ అభ్యర్థులు పరీక్షలో 'బ్లాక్' బాల్ పాయింట్ పెన్‌ను మాత్రమే వినియోగించాలి.

పోస్టుల వివ‌రాలు...

* కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (సీడీఎస్‌) ఎగ్జామినేష‌న్ (I)-2023

ఖాళీల సంఖ్య: 341

అకాడమీల వారీగా ఖాళీలు..

➥ ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ, డెహ్రాడూన్: 100

➥ ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ, ఎజిమ‌ల‌: 22

➥ ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ, హైద‌రాబాద్: 32

➥ ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ (మెన్), చెన్నై: 170

➥ ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ (ఉమెన్), చెన్నై: 17

ఎంపిక‌ విధానం: రాత ప‌రీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ ప‌ర్సనాలిటీ టెస్ట్, ఇంట‌ర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

పరీక్ష విధానం: ఒక్కో పేపర్‌కు వంద చొప్పున మొత్తం 300 మార్కులకు ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి.   ఒక్కో పేపర్‌కు వ్యవధి 2 గంటలు.   ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు, మ్యాథ్స్ పేపర్ రాయనవసరం లేదు.     

ఇంటర్వ్యూ విధానం: ఈ విభాగానికి 300 మార్కులుంటాయి. ఓటీఏ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారికి 200 మార్కులకు ఉంటుంది.  ఇంటర్వ్యూ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి మెరిట్ జాబితా రూపొందిస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:  హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి, అనంతపురం.

నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేష‌న్(I)-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) డిసెంబరు 21న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు డిసెంబరు 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దీనిద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని 341 ఖాళీలను భర్తీచేయనున్నారు. డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. రాత ప‌రీక్ష ఇంటెలిజెన్స్ అండ్ ప‌ర్సనాలిటీ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 24 Mar 2023 08:05 PM (IST) Tags: upsc cds exam 2023 UPSC CDS I hall ticket 2023 UPSC CDS I Admit Card 2023 UPSC CDS hall ticket 2023 UPSC CDS Admit Card 2023 UPSC CDS 2023 hall ticket UPSC CDS 2023 Admit Card

సంబంధిత కథనాలు

TSLPRB Results: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు విడుదల, 84.06 శాతం మంది అర్హత!

TSLPRB Results: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు విడుదల, 84.06 శాతం మంది అర్హత!

TSPSC Paper Leak Case: టీఎస్ పీఎస్సీ సంచలన నిర్ణయం, జీవితాంతం ఎగ్జామ్స్ రాయకుండా 37 మందిని డీబార్

TSPSC Paper Leak Case: టీఎస్ పీఎస్సీ సంచలన నిర్ణయం, జీవితాంతం ఎగ్జామ్స్ రాయకుండా 37 మందిని డీబార్

LIC ADO Result 2023: ఎల్ఐసీ ఏడీవో మెయిన్స్ ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

LIC ADO Result 2023: ఎల్ఐసీ ఏడీవో మెయిన్స్ ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

UPSC Civils Exam: వెబ్‌సైట్‌లో యూపీఎస్సీ సివిల్స్‌-2023 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం!

UPSC Civils Exam: వెబ్‌సైట్‌లో యూపీఎస్సీ సివిల్స్‌-2023 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం!

CEERI: రాజస్థాన్‌ సీఎస్‌ఐఆర్‌-సీఈఈఆర్‌ఐలో 20 సైంటిస్ట్‌ పోస్టులు

CEERI: రాజస్థాన్‌ సీఎస్‌ఐఆర్‌-సీఈఈఆర్‌ఐలో 20 సైంటిస్ట్‌ పోస్టులు

టాప్ స్టోరీస్

AP Registrations : ఏపీలో రివర్స్ రిజిస్ట్రేషన్ల పద్దతి - ఇక మాన్యువల్‌గానే ! సర్వర్ల సమస్యే కారణం

AP Registrations :   ఏపీలో రివర్స్ రిజిస్ట్రేషన్ల పద్దతి - ఇక మాన్యువల్‌గానే ! సర్వర్ల సమస్యే  కారణం

KTR : జనాభాను నియంత్రించినందుకు దక్షిణాదికి అన్యాయం - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు !

KTR  :   జనాభాను నియంత్రించినందుకు దక్షిణాదికి అన్యాయం  - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు !

BRO Update: డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేసిన పవన్ కల్యాణ్ 'బ్రో' - మరీ ఇంత ఫాస్టా?

BRO Update: డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేసిన పవన్ కల్యాణ్ 'బ్రో' - మరీ ఇంత ఫాస్టా?

Kakani Satires On Chandrababu: మేనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి డిలీట్ చేసిన ఘనత చంద్రబాబుదే- మంత్రి కాకాణి

Kakani Satires On Chandrababu: మేనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి డిలీట్ చేసిన ఘనత చంద్రబాబుదే- మంత్రి కాకాణి