UPSC Exam Calender: యూపీఎస్సీ-2024 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
కేంద్రప్రభుత్వ విభాగాల్లోని వివిధ ఖాళీల భర్తీకి సంబంధించి 2024 జాబ్ క్యాలెండర్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబర్ 28న విడుదల చేసింది.
కేంద్రప్రభుత్వ విభాగాల్లోని వివిధ ఖాళీల భర్తీకి సంబంధించి 2024 జాబ్ క్యాలెండర్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబర్ 28న విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం ఏఏ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తారో అన్న దానిపై ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. ప్రతి ఏడాది యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్న విషయం తెల్సిందే. ఈ క్యాలెండర్ ప్రకారమే దేశవాప్తంగా అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను కొనసాగిస్తుంటారు.
యూపీఎస్సీ ఉద్యోగ క్యాలెండర్-2024 ఇదే..
1) యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జా్మ్-2024 వివరాలు..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్: 14.02.2024
దరఖాస్తు గడువు: 05.03.2024
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: మే 26.05.2024
మెయిన్స్ పరీక్ష తేదీ: 20.09.2024
2) యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జా్మ్-2024 వివరాలు..
నోటిఫికేషన్: 14.02.2024.
దరఖాస్తు గడువు: 05.03.2024.
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: 26.05.2024
మెయిన్స్ పరీక్ష తేదీ: 24.11.2024
3) యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జా్మ్-2024 వివరాలు..
నోటిఫికేషన్: సెప్టెంబర్ 06.09.2023.
దరఖాస్తు గడువు: సెప్టెంబర్ 26.09.2023.
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: 18.02.2024.
మెయిన్స్ పరీక్ష తేదీ: 23.06.2024
4) యూపీఎస్సీ ఎన్డీఏ & ఎన్‌ఏ (1) ఎగ్జామ్-2024 వివరాలు..
నోటిఫికేషన్ : డిసెంబర్ 20.12.2023.
దరఖాస్తు గడువు: 09.01.2024.
పరీక్ష తేదీ: 21.04.2024.
5) యూపీఎస్సీ ఎన్డీఏ & ఎన్‌ఏ (2) ఎగ్జామ్-2024 వివరాలు..
నోటిఫికేషన్: 15.05.2024.
దరఖాస్తు గడువు: 04.06.2024.
పరీక్ష తేదీ: 01.09.2024.
6) యూపీఎస్సీ సీడీఎస్ పరీక్ష(1) ఎగ్జామ్-2024 వివరాలు..
నోటిఫికేషన్: 20.12.2023.
దరఖాస్తు గడువు: మార్చి 05.03.2024.
పరీక్ష తేదీ: 21.04.2024.
7) యూపీఎస్సీ సీడీఎస్ పరీక్ష(2) ఎగ్జామ్-2024 వివరాలు..
నోటిఫికేషన్: మే 15.05.2024.
దరఖాస్తు గడువు: 04.06.2024.
పరీక్ష తేదీ: 01.09.2024.
8) యూపీఎస్సీ కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్–2024 వివరాలు..
నోటిఫికేషన్: సెప్టెంబర్ 20.09.2023.
దరఖాస్తు గడువు: 10.10.2023.
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: 18.02.2024.
మెయిన్స్ పరీక్ష తేదీ: 22.06.2024.
9) యూపీఎస్సీ ఐఈఎస్/ఐఎస్‌ఎస్ ఎగ్జా్మ్-2024 వివరాలు..
నోటిఫికేషన్: ఏప్రిల్ 10.04.2024.
దరఖాస్తు గడువు: 30.04.2024.
పరీక్ష తేదీ: 21.06.2024
10) యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్–2024 వివరాలు..
నోటిఫికేషన్: ఏప్రిల్ 10.04.2024.
దరఖాస్తు గడువు: ఏప్రిల్ 30.04.2024.
పరీక్ష తేదీ: 14.07.2024.
11) యూపీఎస్సీ సీఏపీఎఫ్ (అసిస్టెంట్ కమాండెంట్స్) ఎగ్జామ్–2024 వివరాలు..
నోటిఫికేషన్ : ఏప్రిల్ 24.04.2024.
దరఖాస్తు గడువు: 14.05.2024.
పరీక్ష తేదీ: 04.08.2024.
12) యూపీఎస్సీ సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ (ఎగ్జిక్యూటివ్) ఎల్‌డీసీఈ ఎగ్జామ్-2024 వివరాలు..
నోటిఫికేషన్: నవంబర్ 29.11.2023.
దరఖాస్తు గడువు: 19.12.2023.
పరీక్ష తేదీ: 10.03.2024.
13. యూపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్/ స్టెనో ఎల్‌డీసీఈ ఎగ్జామ్–2024 వివరాలు..
నోటిఫికేషన్: 11.09.2024.
దరఖాస్తు గడువు: 01.10.2024.
పరీక్ష తేదీ: 07.12.2024.
ALSO READ:
కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టుల వివరాలు ఇలా
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 10లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ప్రిలిమినరీ పరీక్ష; జూన్ 22న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..