By: ABP Desam | Updated at : 30 Jul 2022 07:12 AM (IST)
TSSPDCL Sub Engineer posts
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ(డిస్కం)లో 201 సబ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం జులై 31న నిర్వహించనున్న రాత పరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంస్థ సీఎండీ రఘుమారెడ్డి జులై 29న తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్ష ఉంటుందన్నారు.
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సీఎండీ సూచించారు. హాల్‌టికెట్‌లో ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఉదయం 10.30 తరవాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని చెప్పారు. పరీక్ష సమయానికి గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, చివరి నిమిషంలో హడావుడిగా రావద్దని రఘుమారెడ్డి సూచించారు.
పరీక్ష హాల్‌టిక్కెట్ల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం: ఈ పరీక్షని మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ‘సెక్షన్-ఎ’లో మొత్తం 80 ప్రశ్నలు కోర్ టెక్నికల్ సబ్జెక్టుపై∙ఉంటాయి. ‘సెక్షన్-బి’ నుంచి 20 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, హిస్టరీ, తెలంగాణ సంస్కృతి, ఉద్యమం నుంచి ప్రశ్నలు వస్తాయి.
సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్)లో 201 సబ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. డిప్లొమా(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)/డిప్లొమా(ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్)/గ్రాడ్యుయేషన్(ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) అర్హత ఉన్న అభ్యర్థుల జూన్ 15 నుంచి జులై 7 వరకు దరఖాస్తులు స్వీకరించారు.
* పోస్టుల వివరాలు...
సబ్‌ఇంజినీర్లు (ఎలక్ట్రికల్): 201 పోస్టులు
అర్హత: డిప్లొమా (ఎలక్ట్రికల్‌ఇంజినీరింగ్)/ డిప్లొమా (ఎలక్ట్రికల్‌అండ్‌ఎలక్ట్రానిక్స్‌ఇంజినీరింగ్)/ గ్రాడ్యుయేషన్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్‌అండ్‌ఎలక్ట్రానిక్స్‌ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని మల్టిపుల్‌ఛాయిస్‌ప్రశ్నల రూపంలో మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. సెక్షన్‌ఏ లో మొత్తం 80 ప్రశ్నలు కోర్‌టెక్నికల్‌సబ్జెక్టు మీద ఉంటాయి. సెక్షన్‌బి నుంచి 20 ప్రశ్నలు, జనరల్‌అవేర్‌నెస్, న్యూమరికల్‌ఎబిలిటీ, హిస్టరీ, తెలంగాణ సంస్కృతి, ఉద్యమం నుంచి ఉంటాయి. పరీక్షా సమయం 2 గంటలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: 200 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
TS SI Preliminary Exam 2022: ప్రశాంతంగా ముగిసిన ఎస్ఐ రాత పరీక్ష, 91.32 శాతం మంది హాజరు!
AP Govt Jobs : ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం, 42 రకాల పోస్టులకు ఉమ్మడి నోటిఫికేషన్!
TS SI Preliminary Exam 2022: ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ - ఒక్క నిమిషం ఆలస్యమైనా సెంటర్లోకి అనుమతించరు, మాస్క్ తప్పనిసరి
TSPSC Notification: తెలంగాణలో DAO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇలా!
AP PGT, TGT Jobs: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 282 టీజీటీ, పీజీటీ పోస్టులు - వివరాలు ఇవే!
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్కు స్వర్ణం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్