TSRTC Recruitment 2022: తెలంగాణలో ఆర్టీసీలో ఉద్యోగాలు- జూన్ 15లోపు దరఖాస్తు చేసుకోండి
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులు జూన్ 15 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
TSRTC Recruitment 2022: ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా కార్పొరేషన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా 300 పోస్టులు భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్, డిప్లొమా చేసిన వాళ్లు టీఎస్‌ఆర్టీసీ అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్‌లోని ఉద్యోగాలకు అర్హులు. ఎంహెచ్‌ఆర్డీ ఎన్‌ఏటీఎస్ పోర్టల్ ద్వారా ఈ జూన్ 15 లోపు ఆప్లై చేసుకోవచ్చు.
టీఎస్‌ఆర్టీసీ అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2022 పూర్తి వివరాలు
పోస్ట్ పేరు: గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా అప్రెంటీసెస్ పోస్టులు
సంస్థ: తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్
విద్యార్హతలు: బీఈ/బీటెక్/ ఇంజినీరింగ్‌లో డిప్లొమా
స్టైఫండ్: నెలకు రూ. 16,000 నుంచి రూ. 22,000
పని చేయాల్సిన స్థలం: తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా పని చేయాలి.
అనుభవం: ఫ్రెషర్స్
అప్లై చేయడానికి ఆఖరు తేదీ: జూన్ 15, 2022
టీఎస్‌ఆర్టీసీ రిక్రూట్‌మెంట్ 2022 వయసు, ఫీజు
విద్యార్హతలతోపాటు ఆ ఉద్యోగాలకు అర్హులైన వారు అప్లై చేయాలంటే కనీస వయసు 18 ఏళ్లు దాటి ఉండాలి. 35 ఏళ్లకు మించిన వయసు ఉన్న వాళ్లు అప్లై చేయడానికి అనర్హులు. కేంద్రం రూల్స్ ప్రకారం గరిష్ట వయసులో మార్పులు ఉంటాయి.
టీఎస్‌ఆర్టీసీ అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2022 అర్హతలు
ఇంజనీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అంటే బీఈ బీటెక్‌తోపాటు ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా చేసిన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు.
టీఎస్‌ఆర్టీసీ అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2022 ఎంపికైన వారికి వేతనం
టీఎస్‌ఆర్టీసీ అప్రెంటీస్ ఉద్యోగాలు 2022 కోసం అభ్యర్థుల ఎంపిక నోటిఫికేషన్ 2022లో చెప్పినట్టు ప్రాథమిక నిర్దేశిత అర్హత, CGPA/మార్కుల శాతం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. వాళ్లకు స్టైఫండ్ రూపంలో నెలకు 16 వేల రూపాయల నుంచి 22 వేల రూపాయల వరకు చెల్లిస్తారు.
టీఎస్‌ఆర్టీసీ అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్‌లో ప్రాంతాల వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ రీజన్‌లో - 51 ఉద్యోగాలు
సికింద్రాబాద్ రీజన్- 36
మహబూబ్‌నగర్ రీజన్- 27
మెదక్ రీజన్- 24
నల్గొండ రీజన్ - 21
రంగారెడ్డి రీజన్- 21
ఆదిలాబాద్ రీజన్ - 18
కరీంనగర్ రీజన్ - 30
ఖమ్మం రీజన్ - 18
నిజామాబాద్ రీజన్- 18
వరంగల్ రీజన్ - 27
ఎన్‌వోయూఎస్ -9
టీఎస్‌ఆర్టీసీ అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2022 పూర్తి నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి