News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

TSPSC CDPO Recruitment: 10న ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆన్సర్ 'కీ', రెస్పాన్స్ షీట్లు విడుదల!

పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీ, జవాబు పత్రాలను (రెస్పాన్స్ షీట్లను) జనవరి 10న విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

FOLLOW US: 
Share:

తెలంగాణలో ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జనవరి 3న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీ, జవాబు పత్రాలను (రెస్పాన్స్ షీట్లను) జనవరి 10న విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాలను ఆన్‌లైన్ ద్వారా స్వీకరించనున్నట్లు తెలిపింది. అభ్యంతరాల నమోదుకోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక లింకు ద్వారా అభ్యర్థులు జనవరి 11 నుంచి 15 వరకు తమ అభ్యంతరాలు సమర్పించాలని సూచించింది. జనవరి 15న సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక లింకు అందుబాటులో ఉంటుందని కమిషన్ తెలిపింది. అభ్యంతరాలకు సంబంధించిన సమాచారం, ఆధారాలను పీడీఎఫ్ ఫార్మట్లో జతచేయాలని, వెబ్‌సైట్లు, సోర్సుల పేరిట ఇచ్చిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోబోమని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.  

తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖలో మొత్తం 23 ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 5న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 13 నుంచి అక్టోబరు 10 వరకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జనవరి 3న రాతపరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 75 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.

కంప్యూటర్‌ ఆధారిత ద్వారా పరీక్షను నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 (అభ్యర్థులకు సంబంధించిన సబ్జెక్టు) పరీక్ష నిర్వహించారు. మొత్తం 19,812 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా దాదాపు 14 వేల మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. రెండు పేపర్లు రాసిన అభ్యర్థులను మాత్రమే ఫలితాల్లో పరిగణనలోకి తీసుకోనున్నారు.

Also Read:

TSPSC: వెబ్‌సైట్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పరీక్ష హాల్‌టికెట్లు, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ జనవరి 2న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 8న రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఓఎంఆర్ విధానంలోనే పరీక్ష జరుగనుంది.
హాల్‌టికెట్ డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి..

రవాణాశాఖలో 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టులు!
తెలంగాణ రవాణాశాఖలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 54 పోస్టులు మల్టీ జోన్‌-1లో ఉండగా.. 59 పోస్టులు మల్టీ జోన్‌-2 పరిధిలో ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో పురుషులకు 71 పోస్టులు, మహిళలకు 42 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 23న పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో 544 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. కళాశాల విద్యాశాఖలో 544 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31న నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో డిగ్రీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జనవరి 31 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులకు మే లేదా జూన్‌లో నియామక పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ - అర్హతలివే!
తెలంగాణలోని ఇంటర్, సాంకేతిక విద్యలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 71 లైబ్రేరియన్ పోస్టులకు భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రాతపరీక్ష ద్వారా ఎంపికలు చేపడతారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 08 Jan 2023 02:42 PM (IST) Tags: Telangana Jobs TSPSC Recruitment Women and Child Welfare Officer TSPSC WCWO Recruitment 2022 CDPO Answer Key

ఇవి కూడా చూడండి

SSC MNS: మిలిటరీ నర్సింగ్ సర్వీస్‌ నోటిఫికేషన్ విడుదల, మహిళలకు ప్రత్యేకం

SSC MNS: మిలిటరీ నర్సింగ్ సర్వీస్‌ నోటిఫికేషన్ విడుదల, మహిళలకు ప్రత్యేకం

GGH Paderu: పాడేరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 256 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

GGH Paderu: పాడేరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 256 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

UGC NET 2023: యూజీసీనెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?

UGC NET 2023: యూజీసీనెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?

RITES: రైట్స్‌ లిమిటెడ్‌లో 257 అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

RITES: రైట్స్‌ లిమిటెడ్‌లో 257 అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

HSL Recruitment: వైజాగ్‌ హిందుస్థాన్ షిప్‌యార్డులో 99 మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులు - అర్హతలివే

HSL Recruitment: వైజాగ్‌ హిందుస్థాన్ షిప్‌యార్డులో 99 మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులు - అర్హతలివే

టాప్ స్టోరీస్

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
×